Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
ఇది నిజమే: ట్రంప్ భారీ శుభవార్త..వీసా లేకుండానే అమెరికా వెళ్లొచ్చు
భారతీయులకు అమెరికా అంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్లి రావాలని అనుకునేవాళ్లు కోట్లలోనే ఉంటారు. అక్కడే స్థిరపడాలని కూడా కలలు కంటారు కొందరు. ఏటా వేలమంది విద్యార్థులు భారత్ నుంచి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు. ఉద్యోగాల పరంగా, ఇతర వర్క్ ల పరంగా కూడా చాలామంది భారతీయులు అమెరికా వెళ్తుంటారు. అయితే అమెరికా వెళ్లాలంటే వీసా తప్పనిసరి..అమెరికా వీసా రావాలంటే అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ట్రంప్ కాలంలో అమెరికా వీసా పొందడం చాలా కష్టతరం.
అమెరికా వీసా పొందడం చాలా కష్టం అనుకుంటున్న సమయంలో తాజాగా వీసా విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 41 దేశాల ప్రజలు ఎలాంటి వీసా లేకుండా అమెరికా వచ్చేందుకు వీలు కలిస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక వీసా మినహాయింపు కార్యక్రమంలో భాగంగా 41 దేశాల ప్రజలు ఎలాంటి వీసా లేకుండానే అమెరికాలో 90 రోజుల పాటు ఉండొచ్చు. ఈ దేశాల పౌరులు అమెరికాకు టూరిజం పరంగా, మెడికల్ పరంగా, వ్యాపార పరంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసేందుకు,ఏదైనా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఎలాంటి వీసా అవసరం లేకుండా జస్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ESTA) కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు.

41 దేశాలు ఏవీ? భారత్ కూడా ఈ లిస్ట్ లో ఉందా?
అమెరికా వీసా మినహాంపు ఇచ్చిన 41 దేశాల లిస్ట్ లో..తైవాన్, ఖతార్, జపాన్, ఇటలీ, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, ఐస్ లాండ్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, యూకే, బెల్జియం, చిలీ, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరి, లాట్వియా, లీచెస్టయిన్, సౌత్ కొరియా, శాన్ మారినో, సింగపూర్, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్, పోలాండ్, స్విట్జర్లాండ్, మాల్టా, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్,పోర్చుగల్,రొమేనియా ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా అమెరికా వెళ్లి 3 నెలలు ఉండొచ్చు. అదే సమయంలో ఈ 41 దేశాలకు అమెరికా ప్రజలు ఎలాంటి వీసా లేకుండా వెళ్లొచ్చు కూడా. అయితే ఈ జాబితాలో భారత్ లేకపోవడం కొంచెం నిరాశపర్చే విషయమే. భారతీయులు రెగ్యులర్ ప్రాసెస్ ద్వారానే అమెరికా వీసా పొందాల్సి ఉంటుంది.
వాళ్లకి మాత్రం
ఈ 41 దేశాలకు చెందిన పౌరులు ఎవరైనా జనవరి 12,2021 తర్వాత నార్త్ కొరియా,ఇరాన్ లేదా క్యూబాకి ట్రావెల్ చేసి ఉంటే వాళ్లకి మాత్రం ఫ్రీ స్కీమ్ కింద అమెరికా వీసా రావడం చాలా కష్టతరమవుతుంది.



Click it and Unblock the Notifications