Latest Updates
-
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట!
ఇవాళ శ్రావణ శనివారం, ఈ వస్తువులు దానం చేస్తే శనిదోషం తొలగిపోతుంది
శ్రావణ మాసంకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన నెల. ఈ మాసంలో చేసే పూజలతో ఎక్కువ ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో చేసే శివపూజ వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి అంటారు. అలాగే శ్రావణ శని వారం రోజు కొన్ని రకాల దానాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని, దోషాలు తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయని చెబుతారు.
హిందూ ఆచారాల ప్రకారం శని దేవుడిని కర్మ ఫలిలాలు ప్రసాదించే దైవత్వంగా భావిస్తారు. ఓ వ్యక్తి చేసే పనులు వల్ల కర్మ ఫలాలు అందుకుంటాడు. గత జన్మలో లేదా ఈ జన్మలో చేసే కొన్ని పనుల వల్ల శుభ, అశుభ ఫలితాలు వస్తాయి. అవి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా శని ప్రభావం వల్ల జీవితంలో సంతోషంగా లేదా కష్టాలమయంగా ఉంటుంది. శని దోషం ఉన్న వ్యక్తులు ఏ పని తలపెట్టినా అందులో ఓటమే ఎదురవుతుంది. జీవితంలో సుఖసంతోషాలు ఉండవు. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం ఉండదు, దంపతుల మధ్య సౌఖ్యం లేక తరచూ గొడవలు జరుగుతుంటాయి.

ఈ శని దోషాన్ని తొలగించుకోవడానికి శనివారం కొన్ని రకాల పనులు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శని దేవుడిని ఆరాధించాడనికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు ఈ రోజుల కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే శుభ ఫలితం ఉంటుంది. మరి శనివారం రోజు చేయాల్సిన దానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నల్ల నువ్వులు:
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. శనివారం రోజు సాయంత్రం 1.25 కిలోల నల్ల నువ్వులను దానం చేయాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఇలా వరుసగా 5 శనివారాలు చేస్తే.. జీవితంలోని సమస్యలు దూరం అవుతాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
నల్ల వస్త్రాలు:
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే నల్ల వస్త్రాలు, బూట్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. శనివారం రోజు సాయంత్రం వేళ అవసరంలో ఉన్న వారికి నల్ల వస్త్రాలు, బూట్లు లేదా చెప్పులు దానం చేయాలి. ఆ దానం పొందిన వ్యక్తులు సంతోషిస్తే శని దోషం తొలగిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాధుల నుంచి బయటపడతారు.
ఇనుప వస్తువులు:
ఇనుమును శని దేవునికి సంబంధించిన వస్తువుగా పరిగణిస్తారు. శనివారం రోజు ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. జాతకంలో శని ప్రభావం ఉంటే అవసరమైన వారికి ఇనుప పాత్రలు, పాన్, గ్రిడ్ లేదా పటకారు లాంటివి దానం చేయండ మంచిది.
గుర్రపు నాడా:
గుర్రం కాలుకు వేసిన నాడాను ఉపయోగించే అనేక సమస్యలను తొలగించుకోవచ్చు. శుక్రవారం రోజు గుర్రపు నాడాను ఆవాల నూనెలో ముంచి, దానిని శనివారం ప్రధాన మీద U ఆకారంలో అమర్చుకోవాలి. ఇలా చేస్తే దోషాలు తొలగిపోతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications