Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Wallet Tips: పర్సులో ఇవి పెట్టుకుంటే అప్పులు, ఖర్చులు పెరుగుతాయి
Wallet Tips: వాలెట్.. డబ్బు, క్రెడిట్, డెబిట్ కార్డులు, కొన్ని కాగితాలు, ఇతర గుర్తింపు కార్డులు ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వాలెట్ వాడే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చిరిగిన నోట్లు వాలెట్ లో ఉంచుకోవద్దు. కొన్ని తప్పులు చేయడం వల్ల పర్సులోకి చేరాల్సిన డబ్బు కాస్త ఖర్చుల రూపంలో బయటకు పోతుంది. అలాగే అప్పులు కూడా పెరిగిపోతాయి.

వాలెట్ వాడే వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.

1. నోట్లు, చిల్లర
వాలెట్ లో నోట్లు, చిల్లర పెట్టుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నోట్లను చిల్లరను కలిపి ఉంచవద్దు. చిల్లరను చప్పుడు చేయకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఉంచాలి.

2. మరణించినవారి ఫోటో
జీవితానికి అత్యంత సన్నిహితులు ఎవరైనా చనిపోతే, ఆ వ్యక్తితో తమకు ఉన్న అనుబంధాన్ని తెలియజేసేందుకు కొందరు వారి ఫోటోను పర్సులో పెట్టుకుంటారు. అయితే వారిపై ప్రేమ ఉన్నా వారి ఫోటోలను పర్సులో పెట్టుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఉంచితే వాస్తు దోషం, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

3. తాళం చెవి
చాలా మందికి తమ పర్సు లోపల తాళం చెవి పెట్టుకునే అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. పర్సులో తాళం చెవి ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఖర్చులూ పెరుగుతాయి.

4. దేవుని ఫోటో
చాలా మందికి ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ పర్సులో దేవుని ఫోటో కూడా పెట్టుకోవద్దని శాస్త్రం చెబుతోంది. దీని వల్ల అప్పులు పెరిగి జీవితంలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5. పాత బిల్లులు
కరెంటు బిల్లులు, రెస్టారెంటు బిల్లులు, ఏదైనా కొంటే ఇచ్చే బిల్లులను పర్సులో పెట్టుకోవద్దు. పాత బిల్లులను వాలెట్ లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

6. నోట్లు మడవొద్దు
కొంత మంది పర్సులో నోట్లను మడిచి పెడతారు. మరికొందరు అలాగే మడవకుండా పెట్టేస్తారు. అయితే నోట్లను మడిచి పెట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయట. అందుకే నోట్లను మడవకుండా అలాగే ఉంచాలని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

7. చిరిగిన నోట్లు
పర్సులో చిరిగిన నోట్లను పెట్టుకోవద్దట. చిరిగిన నోట్లు పర్సులో పెట్టుకుంటే చిరిగిన బతుకు అవుతుందని చెబుతుంటారు. మీకు ఎవరైనా చిరిగిన నోటు ఇస్తే సాధ్యమైనంత త్వరగా వాటిని వదిలించుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

8. పర్సు ఏ జేబులో పెట్టుకోవాలి
పర్సును ఎడమ వైపు జేబులో పెట్టుకోవడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎడమ వైపు జేబులో ఉంచుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి.

9. శ్రీ యంత్రం
పర్సులో శ్రీ యంత్రం నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. దీని వల్ల ఆదాయం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications