Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
ఇలాంటి కలలు వస్తున్నాయా? పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నట్లే!
నిద్రపోతే కలలు రావడం చాలా సహజం. కొందరికి భయానక కలలు, పీడ కలలు వస్తుంటాయి. మరికొందరికి నిజ జీవిత ఘటనలే వస్తుంటాయి. ఇంకొందరికి ఏదైనా వస్తువులు కనిపించడం, కొత్త వ్యక్తిని కలుసుకోవడం, ఏదైనా సాధించడం ఇలా రకరకాల కలలు వస్తుంటాయి. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం.. నిద్రలో వచ్చే కలలను బట్టి భవిష్యత్తును అంచనా వేయవచ్చు.

కొన్ని కలలు వస్తుంటే వాటి వల్ల భవిష్యత్తులో ఏం జరగబోయే అవకాశం ఉందో తెలుసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని కలలు వస్తుంటే కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డట్లే అంటున్నారు. మరి ఆ కలలు ఏంటో తెలుసుకుందామా..
* కలలో ఉంగరం పెట్టుకున్నట్లు లేదా ఉంగరం ధరించినట్లు కనిపిస్తే త్వరలోనే మీరు ప్రేమించే, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి పెళ్లి ఖాయం అవుతుందని అర్థం.
* కలలో తల్లిదండ్రులు కలిసి కనిపించడం శుభసూచకం. ఇలాంటి కల వివాహాన్ని సూచిస్తుంది. త్వరలోనే ఘనంగా పెళ్లి జరుగుతుందని అనుకోవచ్చు.
* కలలో అందమైన పనితన కలిగిన దుస్తులు, దుస్తులపై అందంగా ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాంటివి కనిపిస్తే అందమైన బాగస్వామి లభిస్తారని అర్థం చేసుకోవచ్చు.
* కలలో జాతర జరుగుతున్నట్లు, ఆ జాతరకు మీరు వెళ్లినప్పుడు కలలో కనిపిస్తే మీ జీవితంలోకి సంబరాలు క్యూ కడతాయని అర్థం. త్వరలోనే మంచి జీవిత భాగస్వామిని మీ లైఫ్ లోకి ఆహ్వానిస్తారని స్వప్న శాస్త్రం చెబుతోంది.
* కలలో మీకు గడ్డం ఉన్నట్లు కనిపించినా, గడ్డం నిమురుతున్నట్లు, గడ్డం పెంచుకున్న తర్వాత ముఖాన్ని చూసుకుంటున్నట్లు కనిపిస్తే ప్రేమ వ్యవహారం కొలిక్కి రాబోతుందని అర్థం.
* కల వచ్చినప్పుడు అందులో మీరు కొత్త చెప్పులు కొంటున్నా, కొత్త చెప్పులు ధరించినట్లు కనిపించినా అది శుభాన్ని సూచిస్తుంది. త్వరలో మీరు జత కట్టబోయే వ్యక్తితో ఏడడుగులు వేస్తారని అర్థమని స్వప్న శాస్త్రం చెబుతోంది
* రైలులో ప్రయాణం చేస్తున్నట్లు, ఆ రైలు ప్రయాణాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తే ఎగిరి గంతేయవచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే త్వరలోనే కళ్యాణ ఘడియలు మొదలు అవుతాయని, మంచి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వస్తారని రైలు ప్రయాణాన్ని సంకేతంగా భావించాలి.
* అడవిలో ఒంటరిగా లేదా ఎవరో ముఖం సరిగ్గా గుర్తు పట్టలేని వ్యక్తితో నడుస్తున్నా, సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్నా వివాహ బంధంలోకి త్వరలోనే అడుగు పెడుతున్నారని అర్థం చేసుకోవాల్సింది.
* జుట్టు దువ్వుకున్నా, జుట్టు సరి చేసుకుంటున్నట్లు కలలో కనిపించినా అది పెళ్లిని సూచిస్తుందట. కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి అందంగా తయారవుతున్నారని ఆ కల అర్థమని స్వప్న శాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
