Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఇంట్లో చెత్త బుట్ట ఈ దిక్కులో ఉంచితే ఆర్థిక సమస్యలు, కలహాలు, కష్టాలు చుట్టుముడతాయి
వాస్తు జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో, అన్నీ వస్తువులు వాస్తు ప్రకారం పాటిస్తే, ఉంచితే జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా, హాయిగా సాగుతుంది. కొన్ని కొన్ని పొరపాట్లు, తెలియక చేసే తప్పుల వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం విపరీతమైన ప్రభావం పడుతుంది. సమస్యలు చుట్టుముడతాయి.
ఇంట్లో రకరకాల వస్తువులు ఇష్టమొచ్చినచోట్ల పెడుతుంటాం. కానీ వాస్తు ప్రకారం అలా చేయడం సరికాదు. వస్తువులను సరైన దిశలో ఉంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. తప్పు దిశలో ఉంచినట్లయితే చెడు ఫలితాలు వస్తాయి. ప్రతి ఇంట్లో చెత్త బుట్ట, డస్ట్ బిన్ ఉంటుంది. చెత్త డబ్బా నుంచి వెలువడే శక్తి ఇంటి గమనాన్ని మారుస్తుంది. ఇంట్లోని చెత్త డబ్బాలు, పనికిరాని వస్తువులను వేసేందుకు డబ్బా ఉపయోగిస్తుంటాం. ఇంట్లోని వ్యర్థాలను తొలగించేందుకు ఉపయోగిస్తాం.

వాస్తు శాస్త్రం ప్రకారం చెత్త డబ్బాలను ఇష్టమొచ్చిన చోట ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి సమస్యలు సృష్టిస్తాయి. అందుకే ఇంట్లోని వ్యర్థాలను పారబోసేందుకు వాడే చెత్త డబ్బాను సరైన దిశలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
చెత్త డబ్బా వాస్తు చిట్కాలు:
పిల్లలు చదువుకునే గదిలో చెత్త డబ్బాలను ఉంచితే చదువుపై ఆసక్తి తగ్గుతుంది. అలాగే బెడ్రూము చెత్త డబ్బా ఉంచే సంబంధాలు దెబ్బతింటాయి. దీని వల్ల ప్రశాంతత కూడా కోల్పోతారు. అలాగే ఇంట్లో సరైన దిశలో ఉంచకపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మొదలవుతాయి. వ్యాపారస్తులు అయితే లాభాల స్థానంలో నష్టాలు ఎదురవుతాయి. చెల్లింపులు కూడా నిలిచిపోవచ్చు. సంస్థల్లో పని చేసే వ్యక్తులు సహోద్యోగుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. దీని వలల్ కెరీర్ పురోగతి కూడా ప్రభావితం అవుతుంది. డస్ట్‌బిన్ తూర్పు-ఆగ్నేయం, దక్షిణ-నైరుతి మరియు పశ్చిమ-వాయువ్య దిశలలో ఉంటే, సానుకూల శక్తి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఉంటుంది. స్పష్టమైన ఆలోచన, వృత్తిపరమైన అవకాశాలు మరియు అదృష్టాన్ని ఇస్తుంది. డస్ట్‌బిన్‌ను ఏ దిక్కుల్లో పెట్టకూడదో చూద్దాం.
ఈశాన్యం:
ఈశాన్య దిశలో డస్ట్ బిన్ ఉంచడం వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. అలాగే లక్ష్యాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.
తూర్పు:
చెత్తను తూర్పు దిశలో ఉంచడం వల్ల వ్యక్తిగత ప్రాముఖ్యత క్రమంగా తగ్గుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారి దృష్టిలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. వ్యాపారులు భారీ నష్టాలు ఎదుర్కొంటారు.
ఆగ్నేయ:
డస్ట్‌పాన్‌ను ఈ దిశలో ఉంచడం వల్ల సంపద ఇంటికి చేరకుండా అడ్డుకుంటుంది. అలాంటి ఇంట్లో నివసించే వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఏదైనా మంచి జరగబోతుంటే, అవకాశాన్ని అడ్డుకోవడానికి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications