Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎంత కడిగినా టాయిలెట్ పసుపు మరకలు పోవట్లేదా? జస్ట్ ఇలా చేశారంటే తల తల మెరిసిపోతుంది!
టాయిలెట్స్ ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇంట్లో వాళ్లు అనారోగ్యాల బారిన పడటం గ్యారెంటీ. టాయిలెట్స్ ని క్లీన్ చేయడానికి ఫినాయిల్,యాసిడ్ వంటివి వాడుతుంటారు. అయితే వీటి వాసన భరించలేం..ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అయితే కొందరు ఎన్ని రకాల క్లీనర్లు వాడినా కూడా టాయిలెట్ లోని పసుపు రంగు మరకలు,దుర్వాసన పోవు. అయితే సింపుల్ చిట్కా ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. కూల్ డ్రింక్ వాడి టాయిలెట్ ని మెరిసేలా చేయవచ్చు. కోకాకోలా లేదా అలాంటి కార్బోనేటేడ్ శీతల పానీయాలు టాయిలెట్ క్లీనర్‌గా అద్భుతంగా పనిచేస్తాయంట.
కూల్ డ్రింక్స్‌తో టాయిలెట్ శుభ్రం చేయడం ఎలా?
కోకాకోలా లేదా అలాంటి శీతల పానీయాలలో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లం తుప్పు, సున్నపు మరకలు, మొండి మరకలను కరిగించగల శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ లోని కార్బోనేషన్ (బుడగలు) మురికిని వదులుస్తుంది. దీనివల్ల టాయిలెట్ బ్రష్‌తో రుద్దడం కూడా చాలా సులువు అవుతుంది. మరో ముఖ్య విష యం ఏంటంటే..ఇది రసాయన క్లీనర్ల మాదిరి హానికరం కాదు. దీన్ని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.

ఉపయోగించే విధానం
మొదటగా రెండు కప్పుల కోకాకోలాను నేరుగా టాయిలెట్ సీటులో పోయాలి. మరకలు ఎక్కువగా ఉన్న చోట పడేలా చూసుకోండి. ఇలా పోసిన తర్వాత కనీసం రెండు గంటలపాటు అలాగే వదిలేయాలి. పాత మరకలు లేదా మొండి మరకల కోసం అయితే రాత్రంతా వదిలేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత టాయిలెట్ బ్రష్ తో సున్నితంగా రుద్ది ఫ్లష్ చేయండి. అంతే మీ టాయిలెట్ మెరిసిపోతూ, ఎలాంటి దుర్వాసన లేకుండా ఫ్రెష్ గా ఉంటుంది.
మరింత ఎఫెక్టివ్ గా క్లీన్ చేయడానికి చిట్కాలు
కూల్ డ్రింక్ ని కొద్దిగా వేడి చేయడం వల్ల అందులోని ఆమ్లం మరింత బాగా పనిచేస్తుంది. దీనివల్ల శుభ్రపరచడం చాలా వేగంగా జరుగుతుంది. మరక మరీ ఎక్కువగా ఉంటే స్ప్రే బాటిల్‌లో కోకాకోలా, వైట్ వెనిగర్‌లను సమాన పరిమాణంలో కలిపి స్ప్రే చేయండి. దీనికి ఒక చెంచా బేకింగ్ సోడా జోడించడం వల్ల శుభ్రపరిచే శక్తి మరింత పెరుగుతుంది.
మరక అంచు కింద ఉంటే కొంత టిష్యూను కోక్‌లో నానబెట్టి అంచు కింద ఒక గంట పాటు ఉంచండి. తర్వాత తొలగించి ఫ్లష్ చేయండి. వారానికి ఒకసారి ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల టాయిలెట్ ఎల్లప్పుడూ శుభ్రంగా,ఫ్రెష్ గా ఉంటుంది. కొత్త మరకలు ఏర్పడకుండా నివారించవచ్చు.



Click it and Unblock the Notifications