Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే!
వర్షాకాలంలో మేఘాలయ..భూమి మీద స్వర్గం..ఇది చూసి నేరుగా ట్రిప్ కి వెళ్లిపోండి
మేఘాలయ..ఈ పేరు వినగానే చాలామందికి ఒళ్లు పులకరిస్తుంది. అబ్బా జీవితంలో ఒక్కసారి అయినా మేఘాలయ వెళ్లాలి,అక్కడి ప్రకృతిలో సేద తీరాలని చాలమందికి ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా మేఘాలయ ఫొటోలు,వీడియోలు కనబడితే వాటికి తెగ లైకులు కొట్టేస్తుంటారు..వావ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెట్టేస్తుంటారు. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ పేరుకు తగ్గట్లుగానే మేఘాలకు నిలయం. పారదర్శకమైన నదులు, నిటారుగా ఉండే జలపాతాలు, లోతైన లోయలు,పచ్చని కొండలతో ఉండే మేఘాలయ చూడాలంటే అదృష్టం ఉండాలని చాలామంది అనుకుంటారు.
వర్షాకాలంలో మేఘాలయ ట్రిప్ అంటే ఇక జీవితంలో ఇదొక్కటి సరిపోతుంది అన్నట్లు అనిపించడం ఖాయం. వర్షాకాలంలో మేఘాలయ అసలు అందాలను బయటపెడుతుంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో ఒకటైన చిరపుంజి, మాసిన్రామ్ ఇక్కడే ఉన్నాయి. మేఘాలయంలో వర్షాకాలం కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, అది ఆత్మను స్పృశించే అనుభవం. మేఘాల సవ్వడి, జలపాతాల హోరు, పచ్చదనం పరిచిన తివాచీలు ఇవన్నీ మీ జీవితంలో మరచిపోలేని ఒక అధ్యాయాన్ని లిఖిస్తాయి. వర్షాల వల్ల రోడ్లు జారుడుగా మారినా, ఆ అందం చూసిన తర్వాత ఆ ఇబ్బందులు చిన్నవిగా అనిపిస్తాయి.

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్లిలని అనిపిస్తే..ఎలా వెళ్లాలి,ఎక్కడికి వెళ్లాలన్న టెన్షన్ చాలామందిలో ఉంటుంది. దీంతో చాలామంది అంతదూరం ఏం పోతామ్ లే అని వెనకడుగు వేస్తుంటారు. అయితే ఈ వర్షాకాలంలో మేఘాలయ ట్రిప్ ను ఎలా చేయాలి, ఏ రోజు ఏయే ప్రదేశాలను సందర్శించవచ్చు వంటి ఫుల్ డీటెయిల్స్ సఫారీ సూత్ర అనే ట్రావెల్ కంపెనీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఉంచింది.
వర్షాకాలంలో మేఘాలయ ట్రిప్ ను ఇలా ఆస్వాదించండి
మొదటి రోజు: గౌహతి నుండి షిల్లాంగ్ కు ఆహ్లాదకరమైన పయనం
మేఘాలయ చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం అసోం రాజధాని గౌహతికి రౌలు సర్వీసులు, ఫ్లైట్స్ ఉంటాయి. మేఘాలయ వెళ్లాలి అంటే ముందుగా గౌహతికి చేరుకోవాలి. గౌహతి నుంచి రోడ్డు మర్గంలో కొండల రాణి అని పేరుపొందిన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు చేసే ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దారిలో వర్షాకాలపు మేఘాలు కమ్మిన 'ఉమియామ్ లేక్' మనోహర దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మదిగా కొండ ప్రాంతపు జీవనశైలికి అలవాటు పడండి.
రెండవ రోజు: షిల్లాంగ్ అందాల అన్వేషణ
తూర్పు స్కాట్లాండ్ గా కూడా పిలువబడే షిల్లాంగ్ పట్టణపు సజీవ వీధుల్లో నడుస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు కనపడతాయి. పొగమంచుతో నిండిన ఎలిఫెంట్ ఫాల్స్ అందాలను, వార్డ్స్ లేక్ ప్రశాంతతను ఆస్వాదించండి. ఆ తర్వాత షిల్లాంగ్ పీక్ నుండి నగరం మొత్తాన్ని పక్షుల్లా వీక్షించడం ఓ గొప్ప అనుభూతినిస్తుంది. వర్షపు చినుకులు పడుతున్న వేళ, వేడివేడి మోమోలు తింటూ ఈ నగరాన్ని చుట్టిరండి. షిల్లాంగ్ లో దోశ,ఇడ్లీ దొరికే ఓ మద్రాస్ రెస్టారెంట్ కూడా ఉందండోయ్..కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా టేస్ట్ బాగుంటుంది.
మూడవ రోజు: చిరపుంజి (సోహ్రా)
షిల్లాంగ్ నుంచి ట్యాక్సీలు, బస్సు లేదా క్యాబ్ ల ద్వారా చిరంపుంజీ చేరుకోండి. భూమిపై అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో ఒకటి చిరపుంజి ఇక్కడ వర్షాకాలం ఒక పండుగలా ఉంటుంది. ఆకాశం నుండి జాలువారుతున్నట్లు కనిపించే నోహ్ కా లికై ఫాల్స్, ఏడు పాయలుగా ప్రవహించే సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ తమ పూర్తి శక్తితో గర్జిస్తూ ఉంటాయి. ఆ దృశ్యం మిమ్మల్ని అబ్బురపరుస్తుంది. అలాగే, మౌస్మాయి కేవ్స్ లో చేసే సాహస యాత్ర మీ ప్రయాణంలో మరో మరుపురాని ఘట్టం. ఇక్కడ మీరు ఉండటానికి అద్భుతమైన హోం స్టేలు కూడా ఉంటాయి.

నాల్గవ రోజు: లైవ్ రూట్ బ్రిడ్జ్ ట్రెక్ - ప్రకృతి మహాద్భుతం
ఈ రోజు మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది. చిరంపుంజీ నుంచి నాంగ్రియాత్ గ్రామానికి వెళ్లి, అక్కడి నుండి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్(రెండు అంతస్తుల సజీవ వేర్ల వంతెన) ట్రెక్ ప్రారంభించండి. చెట్ల వేర్లను పెంచి, వాటిని వంతెనలుగా మలచిన ఈ ప్రకృతి అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. పచ్చని అడవి గుండా, చిరుజల్లుల మధ్య సాగే ఈ ట్రెక్ ప్రతి అడుగులోనూ ఓ కొత్త మ్యాజిక్‌ను సృష్టిస్తుంది.
ఐదవ రోజు: డౌకి నది,మావ్లిన్నాంగ్
5వ రోజు మనం రెండు ప్రత్యేకమైన ప్రదేశాలను చూడండి. ముందుగా డౌకి నది దగ్గరకు వెళ్లండి. వర్షాకాలంలో నీటి ప్రవాహం కొద్దిగా ఎక్కువగా ఉన్నా, కొన్ని ప్రదేశాలలో నీటి అడుగున ఉన్న రాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఆ స్ఫటికంలాంటి స్వచ్ఛమైన నీటిలో పడవ ప్రయాణం చేస్తుంటే పడవ నీటిపై కాకుండా గాలిలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడే మీరు బంగ్లాదేశ్-భారత్ సరిహద్దును కూడా చూడొచ్చు..ఇదొక మర్చిపోలేని అనుభూతినిస్తుంది. ఆ తర్వాత ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచిన మావ్లిన్నాంగ్ సందర్శించండి. దాని చక్కని వీధులు, గ్రామస్తుల ఆతిథ్యం మిమ్మల్ని కట్టిపడేస్తాయి.

ఆరవ రోజు: తిరుగు ప్రయాణం - గుండె నిండా మధుర జ్ఞాపకాలతో
ఈ అద్భుతమైన ప్రయాణానికి వీడ్కోలు పలికే రోజు. షిల్లాంగ్ లో స్థానిక మార్కెట్లలో కాస్త షాపింగ్ చేస్తూ, అక్కడి కేఫ్ లలో వేడి వేడి కాఫీ తాగుతూ మీ ప్రయాణపు జ్ఞాపకాలను నెమరువేసుకోండి. ఆ తర్వాత, గుండె నిండా పచ్చని ప్రకృతి జ్ఞాపకాలతో గౌహతికి తిరుగు ప్రయాణం కండి.



Click it and Unblock the Notifications











