Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వీకెండ్స్ ఎంజాయ్ చేయాలా..? హైదరాబాద్‌కు దగ్గర్లోని ఈ ప్రాంతాలకు వెళ్లండి
వీకెండ్ వచ్చేసింది.. ఎప్పుడూ థియేటర్లు, రెస్టారెంట్లు, పార్కులేనా.. ఎక్కడికైనా కొద్ది దూరంలో ఉన్న కొత్త ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా. ఉదయం వెళ్లి సాయంత్రం వరకు వచ్చేలా..
మరీ ఎక్కువ దూరంగా కాకుండా హైదరాబాద్ సిటీకి చుట్టు పక్కల వెళ్లడానికి ఏవైనా టూరిస్ట్ స్పాట్స్ గురించి వెతుకుతున్నారా. మీ లవర్‌తో లేదా దంపతులు.. బైక్ పై కూడా వెళ్లగలిగే అద్భుతమైన, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు హైదరాబాద్ చుట్టూ పక్కల ఉన్నాయి.

1. అనంతరగిరి హిల్స్:
ప్రకృతి రమణీయమైన పర్యాటక ప్రాంతం. హైదరాబాద్ కు దగ్గర్లోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిరుజల్లులు కురుస్తుంటే అనంతగిరి హిల్స్ సందర్శించడం అత్యద్భుతంగా ఉంటుంది. ఔటరి రింగ్ రోడ్డు, చేవెళ్ల మీదుగా వికారాబాద్ వైపు వెళ్లవచ్చు. హిల్ స్టేషన్ లో ఎంజాయ్ చేశాక.. దగ్గర్లోనే సరస్సు ఉంటుంది. అక్కడ బోటింగ్ లాంటివి కూడా చేయవచ్చు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ అద్భుతమైన జ్ఞాపకాలను ఇస్తుంది.

2. మెదక్ ఫోర్ట్:
హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ గుండా ప్రయాణించి మెదక్ కు చేరుకోవచ్చు. మెదక్ కోట..ఆనాటి రాజుల వైభవాన్ని కళ్లకు కడుతుంది. 12 శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించి ఈ కోటను వీక్షించవచ్చు. ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటుంది. మెదక్ ఫోర్ట్, మెదక్ ఛర్చి, పోచారం డ్యామ్, పోచారం వైల్డ్ లైఫ్ సాంక్చూరీ సందర్శించవచ్చు. చితాల్, బారాసింగ్, సాంబార్ జింకలకు ఈ అభయారణ్యం ప్రసిద్ధి.

3. భువనగిరి ఫోర్ట్:
భువనగిరిలోని ఎత్తైన కొండపై ఉండి కోట మంచి పర్యాటక ప్రదేశం. ఈ ఎత్తైన కొండ ఎక్కడం కొంత సవాలుతో కూడుకుని ఉంటుంది. 10 వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల పాలనలో ఈ ఫోర్ట్ ను నిర్మించినట్లు చెబుతారు. ఏకశిలపై నిర్మించిన కోట ఇది. ట్రెక్కింగ్ ను ఇష్టపడే వారికి ఇది మంచి ప్రదేశం. ప్రకృతి కూడా ఆకట్టుకునేలా ఉంటుంది.

4. ఉస్మాన్ సాగర్ లేక్:
హైదరాబాద్ నుంచి చాలా దగ్గర్లోనే ఉంటుంది. శంకర్ పల్లి మీదుగా ఉస్మాన్ సాగర్ లేక్ వద్దకు చేరుకోవచ్చు. ఉస్మాన్ సాగర్ లేక్లేదా గండిపేట్ లేక్ అని పిలుస్తారు. ఇక్కడ ఓషన్ పార్క్ వాటర్ పార్క్, లేక్ పక్కనే గండిపేట్ పార్కు సందర్శించవచ్చు. రాత్రి పూట బస చేయడానికి రిసార్ట్ లు కూడా ఉంటాయి.

5. యాదగిరిగుట్ట:
ఈమధ్యకాలంలో పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది యాదగిరిగుట్ట. నేషనల్ హైవే 163 మీదుగా చక్కగా ఎంజాయ్ చేస్తూ లాంగ్ డ్రైవ్ ను ఆస్వాదించవచ్చు. మీ వీకెండ్ ట్రిప్ కు స్పిరిచ్యూవల్ టచ్ ఇవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్. ఇక్కడికి దగ్గర్లోనే సురేంద్రపురి మైథలాజికల్ పార్కు కూడా ఉంటుంది.

6. రాచకొండ ఫోర్ట్:
వీకెండ్స్ లో ప్రకృతి చెంత ఎంజాయ్ చేయాలనుకుంటే రాచకొండ కోట మంచి సందర్శనీయ ప్రాంతం. కుటుంబసభ్యులతో కలిసి కూడా వెళ్లి ఆస్వాదించగలిగేలా ఉంటుంది. చుట్టూ చెట్లు, ఎత్తైన కొండలతో.. సిటీకి దగ్గర్లో ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే వెళ్లడానికి బెస్ట్ ప్లేస్.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications