Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Megastar Chiranjeevi Birthday పుడితే చిరంజీవిలాగే పుట్టాలి, ఈ బర్త్ డేకి మెగాస్టార్ కు ఓ ప్రత్యేకత ఉంది తెలుసా
Megastar Chiranjeevi Birthday Special మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా దేశ విదేశాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కుల మతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. వారివారి మతాల ఆచారాలకు అనుగుణంగా పండుగలు చేసుకునే అభిమానులు మతం పక్కన పెట్టి అందరూ కలిసి చేసుకునే అతి పెద్ద పండుగ ఆగస్టు 22వ తేదీ అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఎంత కష్టపడి నేడు మెగాస్టార్ అయ్యారో అనే విషయం సినీ అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.
చిరంజీవి ఎంత డబ్బు, పేరు సంపాధించినా ఆయన ఆహారపు అలవాట్లు, ఆయన కష్టపడే తీరు ఆయన్ను నేటికి మెగాస్టార్ గా నిలబెట్టింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించినా చిరంజీవి మాత్రం ఆయన ఆహారపు అలవాట్లు మార్చుకోలేదు, కష్టపడే తీరు, ప్రతిరోజు వ్యాయామం చెయ్యడం మరిచిపోలేదు. సినిమాల్లోకి వచ్చే సమయంలో ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో ఇప్పటికే అవే అహార అలవాట్లు పాటిస్తున్నారు, క్రమం తప్పకుండా ఇప్పటికీ వ్యాయామం చెయ్యడం వలనే చిరంజీవి నేటికి అంత ఈజీగా డ్యాన్స్ లు చేస్తూ యువతరం హీరోలతో డ్యాన్స్ ల్లో పోటీపడుతున్నారు. చిరంజీవి నేటిగా కచ్చితంగా డైట్ ఫాలో అవుతున్నారు.

స్వయంకృషి
చిరంజీవి ఏ క్యారెక్టర్ చేసినా ఆయన అలాగే ఆ పాత్రలో ఒదిగిపోతారు. చిరంజీవిని మాత్రం మాస్ హీరోగా నిలెట్టిన సినిమా ఖైదీ అని తెలిసిందే. ఖైదీ తరువాత పూర్తి మాస్, కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న చిరంజీవి జీవితాన్ని మార్చేసింది మాత్రం దర్శకుడు కె. విశ్వనాథ్. అప్పటికే మాస్ హీరో అయిన చిరంజీవితో స్వయంకృషి అనే సినిమా తియ్యడానికి కె విశ్వనాథ్ సిద్దం అయ్యారని తెలిసి అప్పట్లో సినీ పరిశ్రమలోని చాలా మంది నవ్వుకున్నారు.
నంది అవార్డులు
అయితే చెప్పులు కుట్టుకునే సాంబయ్య క్యారెక్టర్ ను చిరంజీవిని పరిచయం చేసి ఆయనతో స్వయంకృషి సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేసిన కె విశ్వనాథ్ తనను విమర్వించిన వారికి గట్టి గుణపాఠం చెప్పారు. స్వయంకృషి సినిమా నంది అవార్డులు సొంతం చేసుకుంది. స్వయంకృషి సినిమాతో చిరంజీవిలో ఉన్న మరో నటుడు బయటకు వచ్చారు. తరువాత అదే చిరంజీవితో అపద్బాంధవుడు అనే సినిమా తీసిన కె. విశ్వనాథ్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది అవార్డు వచ్చింది. ఆపద్బాందవుడు సినిమా మొత్తం ఐదు నంది అవార్డులు సొంతం చేసుకుంది.

మూడు జాతీయ అవార్డులు
ఇక చిరంజీవి సొంతంగా నిర్మించి ఆయన నటించిన సినిమా రుద్రవీణ అయితే సమాజంలోని చాలా మందిలో మార్పు తీసుకువచ్చింది. రుద్రవీణ సినిమాతో నటుడిగా తను సంతోషంగా ఉన్నా ఇక ముందు అబిమానులు కోరుకునే సినిమాలు తియ్యడానికి ప్రధాన్యత ఇస్తానని చిరంజీవి పలు సందర్బాల్లో చెప్పారు. రుద్రవీణ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికే ఎవరిగ్నీన్ సాంగ్స్ అని చెప్పాలి. రుద్రవీణ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాకు జాతీయ అవార్డు వచ్చింది. చిరంజీవి సొంతంగా నిర్మించిన రుద్రవీణ సినిమాకు మూడు జాతీయ అవార్డులతో పాటు నాలుగు నంది అవార్డులు వచ్చాయి.

నేటి యువ నటీనటులు ఆయన్ను ఆదర్శంగా
చిరంజీవి- కోదండరామిరెడ్డి, చిరంజీవి- కె. రాఘవేంద్రరావు, చిరంజీవి- రవిరాజ పినిశెట్టి ఇలా చాలా మంది దర్శకులతో చిరంజీవి హీరోగా నటించిన సినిమాలు తెలుగు సినీ ఇండ్రస్ట్రీలో రికార్డులు తిరగరాశాయి. తెలుగు, హిందీ, కన్నడ సినిమాల్లో చిరంజీవి నటించారు. కన్నడలో సిపాయి, శ్రీమంజునాథ సినిమాల్లో చిరంజీవి నటించారు. రెండు కన్నడ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమా హీరో అంటే చిరంజీవి అని నేటి యువ నటీనటులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అందుకే చిరంజీవి నేడు మెగాస్టార్ అయ్యారు..
రాత్రికి రాత్రి మెగాస్టార్ అయిపోలేదు
ఇమేజ్ పక్కన పెట్టి ప్రయోగాలు చేసిన చిరంజీవి అంచెలు అంచెలుగా ఎదుగుతూ నేడు మెగాస్టార్ అయ్యారు. చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రి మెగాస్టార్ అయిపోలేదు. ఆయన కష్టపడి ఎవరి సహాయ సహకారాలు, మద్దతులేకుండా స్వయంకృషితో నేడు మెగాస్టార్ అయ్యారు. చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి మాట అంటే ఆయన అభిమానుల జవదాటడు. అలాగే అభిమానులను ఎంతో ప్రేమతో చూసుకునే చిరంజీవి నా అభిమానులు లేకుంటే నేను లేను అని చాలా సందర్బాల్లో చెప్పారు.

ప్రజలకు సేవ చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్
గురువారం చిరంజీవి జరుపుకుంటున్న పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. సీఎం కావాలని, ప్రజలకు సేవ చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చిన మెగాస్టార్ చీరంజీవి తరువాత అనివార్య కారణాలతో రాజకీయాలకు దూరం అయ్యారు. చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తరువాత మెగాస్టార్ అడుగుజాడల్లోనే రాజీకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ పెట్టిన తరువాత 10 ఏళ్ల పాటు అనేక అవమానాలు ఎదుర్కొన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

ఇండస్ట్రీలో బతికితే చిరంజీవిలాగే బతకాలి
తన తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడనే ఆనందలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు చాలా సంతోషంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. సినిమా హీరోగా, రాజకీయాల్లో సత్తా చాటుకున్న తమ్ముడు పవన్ కల్యాణ్ ను చూసి చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ పుట్టిన రోజును తిరుమలలో జరుపుకుంటున్నారు. పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకోవడానికి మెగాస్టార్ చీరంజీవి ఇప్పటికే తిరుమల చేరుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో బతికితే చిరంజీవిలాగే బతకాలి అంటూ నేటి యువతరం హీరోలకు మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా నిలిచారు.



Click it and Unblock the Notifications











