Latest Updates
-
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
Exclusive text Interview with Kumari aunty: కుమారి ఆంటీ బిజినెస్ ట్రిక్స్.. ఆమె సక్సెస్ కారణం అదేనట!
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలకు కుమారి ఆంటీ గురించి తెలిసే ఉంటుంది. రోడ్డు పక్కన ఓ చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకొని ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆవిడ.. ఒక్క సారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సైతం ఆమె వ్యక్తిగతంగా కలవగలిగే స్థాయికి ఎదిగిపోయారు. అయితే ఆమెకు ఈ విజయం, సక్సెస్, గౌరవం అంత సులభంగా రాలేదు. దాని వెనుక ఎన్నో కష్టసుఖాలు ఉన్నాయని కుమారి ఆంటీ చెబుతుంటారు. అయితే ఈ స్టోరీలో ఆమె విజయానికి కారణం ఏంటి? ఆమె అంత గొప్ప విజయం సాధించడానికి ఆమె అనుసరించిన విధానాలేంటి? ఆమె సాధించిన లక్ష్యాలేంటి అనే విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
కుమారి ఆంటీ మాటల్లో ఆమె సాధించిన విజయాలు ఏంటో తెలుసుకుందాం..
"నేను ఒక సాధారణ మహిళను. అందరిలాగానే నేనుకూడా రోజువారీ కూలికి వెళ్తుండే దానిని. కానీ ఆ డబ్బులు ఏవీ సరిపోకపోవడంతో ఒక అయిదు సంవత్సరాల క్రితం ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. నాకు కూడా అందరిలాగానే మన ఫుడ్ అమ్ముడుపోతుందా? మనం ఈ వ్యాపారంలో సక్సెస్ అవ్వగలమా? అనే ఆలోచనలు వచ్చేవి. కానీ నా లక్ష్యం ఆ ఆలోచలను తుడిచేసి, నేను ఏం చేయాలని అనుకుంటున్నానో ఆ వైపుకు నన్ను నడిపించాయి. ఎంతో కష్టాలు పడుతూ మొదటి రోజు వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను.

కానీ మొదటి రోజు మేము అనుకున్నంత స్థాయిలో మాకైతే వ్యాపారం జరగలేదు. నా ఆహరం బాగోలేదా? నేనేమైనా లోపం చేస్తున్నానా అనే ఆలోచనలు నా మెదడులో మెదులుతుండేవి. ఈ క్రమంలోనే నా భర్త, నా పిల్లలు, నా బంధుమిత్రులందరూ నాకు సహకారంగా నిలిచారు. నువ్వు చేస్తున్న పనిని అలానే చేసుకుంటూ వెళ్ళు ఎదో ఒక రోజు నువ్వు విజయం సాధిస్తావని చెప్పేవారు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్లాను. కొన్ని రోజులకు నా వ్యాపారం అద్భుతంగా జరగడం మొదలయ్యింది.
నా స్టాల్ దగ్గరికి వచ్చి అన్నం తినే ప్రతి ఒక్కరినీ ప్రేమగా చూసుకుంటాను. ఎందుకంటే అన్నం పెట్టేవారిని ఎవరైనా అమ్మ అని పిలుస్తారు. అందుకే నేనొక అమ్మగా.. వారికి అన్నం పెడుతున్నానని భావిస్తాను. అందుకే నా స్టాల్‌కి వచ్చి భోజనం చేసే వారందరినీ నాన్న, అమ్మ అని చెప్పడం అలవాటు అయిపోయింది. కానీ నాకే తెలియకుండా అలా పిలవడం నా మెయిల్ USPగా మారింది. క్రమక్రమంగా నా వ్యాపారం పెరగడం మొదలయ్యింది. రోజులు గడుస్తున్నాయి, వ్యాపారం వృద్ధి చెందింది, అలాగే డబ్బు కూడా బాగా రావడం మొదలయ్యింది. ఈ క్రమంలోనే ఓ చిన్న వీడియో నా జీవితాన్నే మార్చేసింది.
మలుపు అదే..
నా వ్యాపారం వృద్ధి చెందినట్లుగానే మన దేశంలో సోషల్ మీడియా వినియోగం కూడా బాగా వృద్ధి చెందింది. ఈ క్రమంలోనే ఓ రోజు నా దగ్గరికి వచ్చిన కస్టమర్ బిల్ ఎంత అయ్యిందని అడగగా.. మీది మొత్తం వెయ్యి అయ్యింది, రెండు లివర్లు ఎక్స్‌ట్రా అని చెప్పాను. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. అప్పటి నుంచి నా బిజినెస్ టర్న్ అయ్యింది.
ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేను సుపరిచితురాలిని అయ్యాను. నా స్టాల్ దగ్గరికి వచ్చే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. తండోపతండాలుగా జనం రావడం మొదలుపెట్టేశారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం నా రీల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నా రీచ్ పెరిగింది. అలాగే మీడియా సంస్థలు కూడా ఇంటర్వ్యూలు తీసుకోవడంతో.. నా బిజినెస్ రాకెట్ దూసుకెళ్లినట్లు దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఓ సీరియల్‌లో కూడా నటించాను. ఇప్పుడు కాస్త పాపులారిటీ తగ్గినప్పటికీ.. బిజినెస్ మాత్రం యథాతథంగానే ఉంది. నా వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. ఈ ప్రయాణాలు నేను అనుకున్న లక్ష్యాలకంటే ఎక్కువగానే నేను సాధించాను. నేను కేవలం నా కుటుంబం సంతోషంగా ఉండేలా ఆర్ధిక స్వతంత్రం పొందాలని అనుకున్నాను. కానీ దేవుడు ఆర్ధిక స్వతంత్రంతో పాటు నాకు పాపులారిటీని కూడా ఇచ్చాడు. ఏకంగా సీఎం గారిని కలిసేంత అవకాశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా మహులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీరు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. మీరు తలుచుకుంటే గొప్ప గొప్ప లక్ష్యాలను సైతం చిటికెలు సాధించగలరు. దానికి ఉదారహణ నేనే. కాకపోతే నువ్వు చేస్తున్న పనిలో నిజాయితీ ఉండాలి నువ్వు చేసే పనిపై నీకు నమ్మకం ఉండాలి. అప్పుడు ఎలాంటి విజయమైనా, ఎలాంటి లక్ష్యమైన మీ కాళ్ళ ముందు మోకరిల్లాల్సిందే"



Click it and Unblock the Notifications