Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
దీపావళి రోజు ఈ తప్పు చేయకండి.. చేస్తే మీ కంటికే ప్రమాదం.. అది ఏదంటే?
హిందువులు జరుపుకునే అతిపెద్ద పండగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి అంటేనే వెలుగులు.. పటాకులు సందడి గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ దీపావళి రోజు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటారు. బాణాసంచాల కాల్పులు, వెలుగుల మధ్యలో అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ప్రమాదానికి కారణమవుతాయి. అందుకే బాణాసంచాలు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ముఖ్యంగా బాణాసంచా పేలే సమయంలో కళ్ళలో నిప్పు రవ్వలు పడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి నుంచే వచ్చే పొగ కంటితో పాటు ఊపిరితిత్తులకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఈ దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఒకవేళ బాణాసంచా కంటిలో పడితే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఏమి చేయాలి.. ఏమి చేయకూడదంటే..
సాధారణంగా పటాకులు కాల్చే సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు రవ్వలు కంట్లో పడే అవకాశముంది. ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళను రుద్దవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న తప్పు, అజాగ్రత్త పని చేయడం వల్ల కంటి చూపు శాశ్వతంగానే కోల్పోయే ప్రమాదం ఉందట. కంటిని శుభ్రంగా కడిగి వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

అలాగే బాణాసంచా కాల్చిన తరువాత మీ చేతులను, మీ పిల్లల చేతులను శుభ్రంగా కడగాలి. ఎందుకంటే బాణాసంచా తయారీలో అనేక రకాల రసాయన పదార్థాలు వాడతారు. ఇవి కడగకుండా అలానే తింటే, లేదా ఇతర పనులు చేస్తే ఆ రసాయనాలు మీ శరీరంలో చేరి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి.
అలాగే అందులోని రసాయనాలతో ఉన్న చేతులను కడగకుండా కళ్ళను తాకితే.. కళ్ళ మంట, కళ్ళకు దురద, కళ్ళు ఎర్రగా మారుతాయని, అందుకే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి సూచిస్తున్నారు. అలాగే పిల్లల చేతులను సైతం శుభ్రంగా కడగాలి.
ఇంటి చిట్కాలను దూరం చేయండి..
బాణాసంచా కాల్చే సమయంలో పొరపాటున నిప్పు రవ్వ కంట్లో పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి చిట్కాను పాటించొద్దు. ఏదైనా సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఇంటి చిట్కాలు పాటిస్తే కంటి చూపుకే ప్రమాదం ఏర్పడే అవకాశముంది. కళ్ళలోని రెటీనా చాలా సున్నితమైనవి కాబట్టి.. కంట్లో నిప్పు రవ్వ పడితే.. వెంటనే చల్లటి నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. అప్పటికీ ఏదైనా సమస్య ఉన్నట్లు అనిపిస్తే వైద్యులను సంపాదించాలి.
ఈ విషయాలు మర్చిపోవద్దు..
బాణాసంచా కాల్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కళ్లద్దాలు ధరించి బాణా సంచా కలిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. నిప్పు రవ్వలు కంట్లో పడే పాటు, వాటి నుంచి వెలువడే పొగ కంట్లోకి చేరకుండా రక్షిస్తుంది. తద్వారా కంటి సమస్యలు కొంచెం దూరం అవుతాయి. అంతేకాదు చేతుల్లోనే పేలే పటాకులను పేల్చవద్దు. అలాగే పిల్లల చేతికి బాణాసంచా ఇచ్చి కాల్చనివ్వోద్దు.
దీపావళి అనేది సంతోషాల పండగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగ. ప్రతీ ఇంట్లో సంతోషాల హరివిల్లు నెలకొనే పండగ. అలాంటి పండగ రోజు చిన్న చిన్న తప్పులు, అజాగ్రత్త కారణంగా దుఃఖాలు నింపుకోకండి. అలాగే మనల్ని రక్షిస్తున్న ఈ ప్రకృతిని కాపాడేందుకు కాలుష్యహీనమైన టపాకులను కాల్చండి.



Click it and Unblock the Notifications