Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తెలుగు స్టార్ యూట్యూబర్, యాక్టర్ ప్రసాద్ అరెస్ట్.. ఎందుకంటే?
తెలుగు స్టార్ యూట్యూబర్, టాలీవుడ్ యాక్టర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిపై లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తెలుగులో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో నటిస్తున్న ప్రసాద్.. ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎందుకు అరెస్ట్ చేశారంటే
మావిడాకులు, పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబర్ ప్రసాద్ బెహరా కమిటీ కుర్రూళ్ళు సినిమాతో పాపులర్ అయ్యారు. అయితే అతను నటిస్తున్న మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న యువతి, ప్రసాద్ తనను అసభ్యకరంగా తాకుతున్నారని, తన గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధిస్తున్నారంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

యువతి ఏం చెప్పిందంటే?
ప్రసాద్‌తో తాను పెళ్లివారమండి అనే వెబ్ సిరీస్‌లో నటించానని అప్పుడు ప్రసాద్ తనను అసభ్యకరంగా తాకారని ఫిర్యాదులో పేర్కొంది. అప్పుడు ఆ షూటింగ్ నుంచి తాను తప్పుకున్నానని, ఒక సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నానని తెలిపారు. సంవత్సరం తరువాత తనకు ప్రసాద్ నటిస్తున్న మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చిందని, అప్పటికీ కూడా అతని ప్రవర్తన మారలేదని చెప్పారు.
షూటింగ్ సమయంలో తనను అసభ్యకరంగా తాకేవాడని, తన బ్యాక్ గురించి అసభ్యకరంగా మాట్లాడేవారని చెప్పారు. తనను టచ్ చేయడం, లొకేషన్‌లో మీద పడే ప్రయత్నం చేయడం వంటివి చేస్తున్నాడని, అతని భాష కూడా సరిగ్గా లేదని తెలిపారు. ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరి ముందు తన బ్యాక్‌ను అసభ్యకరంగా తాకాడని, ఎందుకని ప్రశ్నిస్తే జోక్ అని నవ్వేశారని పేర్కొంది.
తరచూ తన బ్యాక్ గురించి అసభ్యకరంగా మాట్లాడడం, తనను టచ్ చేయడం, తనతో లైంగిక విషయాల గురించి మాట్లాడడం, తన ముఖంపై పెరుగుతున్న వెంట్రుకలను కూడా హేళన చేస్తూ మాట్లాడడం చేస్తున్నారని, ఇది తనను తీవ్రంగా బాధిస్తుందని చెప్పారు. తనను షూట్ ఉన్నన్ని రోజులు లైంగికంగా వేధించే ప్రయత్నం చేస్తున్నాడని అందులో చెప్పుకోచ్చింది. కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఈనెల 14వ తేదీన ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాగా ప్రసాద్ ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు.



Click it and Unblock the Notifications