Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Fathers Day 2023: ఫాదర్స్ డే నాడు తండ్రిని సంతోషం పెట్టడం ఎలా.. అని తెగ ఆలోచిస్తున్నారా?
ఫాదర్స్ డే.. తండ్రులకు ప్రత్యేకమైన ఈ రోజు తమ తండ్రులకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని, వారిని సంతోష పెట్టాలని, వారితో కలిసి సమయం గడిపి వారికి మధురమైన అనుభూతులు పంచి పెట్టాలని అనుకుంటారు. మీరు కూడా మీ తండ్రిని సంతోష పెట్టాలని అనుకుంటుంటే.. పెద్దగా ఖర్చు పెట్టకుండానే, ఖరీదైన సర్‌ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వకుండానే మీ ఫాదర్ ను సంతోష పెట్టవచ్చు. అది వారిలో ఎక్కడలేని ఆనందాన్ని కూడా తీసుకువస్తుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాత ఫోటోలను రీక్రియేట్ చేయండి:
పాత ఫోటోల చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకుని ఉంటాయి. కేవలం ఫోటోను చూస్తే అనేక జ్ఞాపకాలను అన్‌లాక్ చేయవచ్చు. మీరు మీ తండ్రికి సంబంధించిన కొన్ని పాత ఫోటోలను సేకరించండి. చిన్న నాటి చిత్రాలు, వారితో ఆనందంగా గడిపిన క్షణాలు, ఎక్కడికైనా టూర్లకు వెళ్లినప్పుడు, వారితో నవ్వుతూ గడిపినప్పుడు, వారు మిమ్మల్ని ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటోలు సేకరించి ఓ స్క్రాప్ బుక్ తయారు చేయండి. ఆయా ఫోటోలకు మీకు నచ్చిన క్యాప్షన్ ఇవ్వండి.. మై డాడ్ మై హీరో, నాన్నతో అలనాటి జ్ఞాపకాలు లాంటి ఏదైనా క్యాప్షన్ ఇచ్చి పాత ఫోటోలను రీక్రియేట్ చేయండి.
2. లెటర్ రాయండి:
ఇదో పాత పద్ధతి, కానీ ఎఫెక్టివ్. మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చి దానిని ఓ పేపర్ పై పెట్టాలి. మాట్లాడుతున్నప్పుడు మనసులోని భావాలు చెప్పడానికి పదాలు దొరకవు. కానీ లెటర్ రాస్తున్నప్పుడు ఆలోచించి మంచి మంచి పదాలు వాడుతూ లెటర్ రాయవచ్చు. మీకు మీ తండ్రి అంటే ఎంత ప్రేమో తెలుపుతూ ఆ లెటర్ లో రాయవచ్చు. చిన్ననాటి సందర్భమైనా ఉదాహరణగా అందులో పేర్కొనవచ్చు. అలా ఉదాహరణ చెబుతూ మీరే నా హీరో లాంటి క్యాప్షన్ ఇస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి ఓ గొప్ప తండ్రిని పొందినందుకు మీరెంత సంతోషంగా ఉన్నారో మనస్ఫూర్తిగా చెప్పండి.
3. పిక్నిక్:
తండ్రులు సాధారణంగా పనిలో ఉన్నప్పుడు ఇంట్లో వినోదాన్ని కోల్పోతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదించడానికి కుటుంబ విహారయాత్రకు వెళ్లండి. మంచి లొకేషన్ ను ఎంచుకోండి. మీ నాన్నకు ఇష్టమైన కొన్ని ఆహారపదార్థాలను ప్యాక్ చేయండి. పిక్నిక్ ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి.
4. తండ్రితో కలిపి బయటకెళ్లడం:
ఈ ఫాదర్స్ డే నాడు మీ తండ్రిని డేట్ కు తీసుకెళ్లండి. డేట్ అంటే కేవలం ఆడామగా మాత్రమే చేస్తారనుకుంటే పొరబడినట్లే. రోజంతా మీరు వారితో గడపండి. పార్కులు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్స్.. ఇంకా ఎక్కడికైనా కలిసి వెళ్లి ఆహ్లాదంగా, సంతోషంగా గడపండి. ఇది వారికి పని నుంచి విశ్రాంతి ఇవ్వడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. మీక్కూడా తండ్రితో గడిపిన మధురమైన అనుభూతులు దక్కుతాయి.



Click it and Unblock the Notifications