Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
FIFA & MERS: ఫిఫా అభిమానులకు పొంచి ఉన్న కొత్త వైరస్ ముప్పు
FIFA & New Virus: ఖతార్‌లో ఫిఫా వరల్డ్ అట్టహాసంగా సాగుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పసికూనలు అనుకున్న జట్లు హేమాహేమీ జట్లను మట్టికరిపిస్తున్నాయి. ఖతార్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ దేశాల నుండి ఖతార్‌కు మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన అభిమానులకు ఆయా దేశాల ఆరోగ్య శాఖలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అదేంటి ఫుట్‌బాల్ అభిమానులకు ఆరోగ్య శాఖలు హెచ్చరికలు చేయడం ఏమిటీ అనుకుంటున్నారా..

ఫిఫా వరల్డ్ కప్ అభిమానులకు కొత్త వైరస్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖతార్‌లో మ్యాచ్‌లు చూసి తమ దేశాలకు తిరుగు ప్రయాణం అవుతున్న అభిమానుల నుండి కొత్త వైరస్ ఆయా దేశాల్లో వ్యాప్తి చెందవచ్చని ఆందోళన చెందుతున్నారు.
కేమెల్ ఫ్లూ(Camel Flu) లేదా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(Middle East Respiratory Syndrome - MERS) మెర్స్ గా పిలిచే ఈ వైరస్ ఒంటెల నుండి మనుషులకు వ్యాపిస్తుంది.

కేమెల్ ఫ్లూ అంటే ఏంటి?
పేరులో ఉన్నట్లుగానే ఒంటెల నుండి మనుషులకు సోకే వైరస్ ఇది. ఈ వైరస్‌ను తొలిసారిగా 2012 లో సౌదీ అరేబియాలో గుర్తించారు. 2012 నుండి ఇప్పటిదాకా సుమారు 27 దేశాల్లో ఈ కేమెల్ ఫ్లూ వైరస్‌ను గుర్తించారు. 2012 నుండి 2022 అక్టోబర్ వరకు ఈ వైరస్ సోకిన వారిలో 35 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో జ్వరం, దగ్గు, విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో, వృద్ధుల్లో, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహంతో బాధపడేవారిలో ఈ వైరస్ ప్రాణాంతకం కావొచ్చని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు.

అభిమానులకు హెచ్చరికలు
ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వివిధ దేశాల నుండి ఫుట్‌బాల్ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళ్తున్నారు. వీరి ద్వారా ఆయా దేశాల్లో కేమెల్ ఫ్లూ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెర్స్‌ను తక్కువ అంచనా వేయరాదని, కరోనా మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఖతార్‌కు వెళ్లిన అభిమానులు ఒంటెలకు దూరంగా ఉండాలని, వండని మాంసాలను తినొద్దని, పాశ్చరైజ్ చేయని పాలు తాగొద్దని వివిధ దేశాల ఆరోగ్య శాఖ సూచనలు ఇస్తున్నాయి



Click it and Unblock the Notifications