Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
Happiest Country : ఈ దేశమే అత్యంత సంతోషకరమైన దేశమట.. దానికి కారణం..?
ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలున్నాయ్.. అభివృద్ధి చెందుతున్న దేశాలూ ఉన్నాయ్.. వెనకబడిన దేశాలు కూడా ఉన్నాయ్.. అయితే అత్యంత సంతోషకరమైన దేశాల లిస్ట్ కూడా తాజాగా విడుదల చేశారు. ఎంత అభివృద్ధి చెందినప్పటికీ సంతోషంగా లేకపోతే శూన్యం లాగే అనిపిస్తుంది. దేశాలు అభివృద్ధి చెందడంతో పాటు ఆ దేశాల్లో సంతోషం కూడా అలాగే వుండాలి. కానీ అభివృద్ధికి, సంతోషానికి సంబంధం లేకుండా సంతోషకరమైన దేశాల జాబితా బయటకు వచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ కొన్ని ప్రాతిపదికలమై సంతోషకరమైన జాబితాలను విడుదల చేసింది.
ఈ సారి సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇలా వరుసగా ఏడాసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అభవృద్ది చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకోవాలా లేక సంతోషకరమైన దేశాలను ఆదర్శంగా తీసుకోవా అనేది ఆయా దేశాల ప్రభుత్వాలు, నాయకులు నిర్ణయాలు తీసుకోవాలి. సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానంలో ఉండడానికి గల కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యం విషయంలో అక్కడి ప్రజలకు ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వం పూర్తి భద్రతను కల్పిస్తుంది. ఆదాయం, మంతం, వర్గంతో సంబంధం లేకుండా అందరు ఫిన్‌ల్యాండీయులకు ఆరోగ్య భద్రతను కల్పించడం కూడా సంతోషకరమైన దేశంగా నిలవడానికి కారణమైంది. సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యం చాలా ముఖ్యం.
ఫిన్‌ల్యాండ్‌లో పనిచేస్తున్న అందరి ఉద్యోగులకు పనిగంటలు చాలా తక్కువగా ఉంటాయ్. ప్రైవేట్ సంస్థల్లో కూడా పనిగంటలు తక్కువగా ఉండేలా అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కుటుంబాలను సమయం కేటాయించి వారికి ప్రధాన్యం ఇవ్వాలని ప్రజల్ని ఫిన్‌ల్యాండ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
అందరు ఫిన్‌ల్యాండీయులకు ప్రైమరీ స్కూలు నుంచి యూనివర్సిటీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కేవలం విద్య మాత్రమే కాకుండా పిల్లల్లో విశ్వాసాన్ని కూడా పెంపొందించే ప్రయత్నం చేశారు.
ఫిన్‌ల్యాండ్‌లో ప్రత్యేకంగా ఉండే సౌనా కల్చర్ కూడా అభివృద్దికి పరోక్షంగా దోహదపడిందంటున్నారు. సౌనా కల్చర్ అంటే ఆవిరి స్నానాలు. ఈ ఆవిరి స్నానాల ద్వారా సామాజిక సంబంధాలను పెంపొందించాలని అక్కడి ప్రభుత్వ ఉద్దేశ్యం. మొత్తం ఫిన్‌ల్యాండ్‌లో 30 లక్షల ఆవిరి స్నానాలున్నాయ్.
ఫిన్‌ల్యాండ్‌లో అవినీతి లేకపోవడం, ఉన్నా ఎప్పటికప్పుడు దాన్ని కంట్రలోల్ చేయడం వల్ల కూడా ఫిన్‌ల్యాండ్ సంతోషకరమైన దేశంగా నిలిచింది. అన్ని దేశాలతో పోలిస్తే ఫిన్‌ల్యాండ్‌లో అవినీతి చాలా తక్కువగా వుంది.
అక్కడి మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలు పొందడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫిన్‌ల్యాండ్ మహిళలకు అన్ని రకాలుగా భద్రతను కల్పిస్తున్నారు. విద్యా వ్యవస్థలోనే వీటికి సంబంధించిన విషయాలను నేర్పడం ప్రారంభిస్తారు. ఉద్యోగ సంస్థల్లో కూడా వారికి సమాన వేతనం వచ్చేందుకు, సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
అయితే ఫిన్‌ల్యాండ్ సంతోషకరమైన దేశంగా నిలవడానికి మరో ముఖ్య కారణం అక్కడి జనాభా చాలా తక్కువగా ఉండడం. తక్కువ జనాభా ఉండడం వల్ల ప్రభుత్వానికి చర్యలు తీసుకోవడానికి అనుకూత పరిస్థితులు ఎక్కువగా ఉంటాయ్. తాజా 2024 సంవత్సరం ప్రకారం ఫిన్‌ల్యాండ్ జనాభా రూ.55 లక్షలకు పైగా వుంది. గత ఏడు సంవత్సరాలుగా ఫిన్‌ల్యాండ్ మాత్రమే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటోంది. సంతోషకరమైన దేశాల జాబితాలో మొత్తం 143 దేశాల్లో భారత్ 126వ స్థానంలో నిలిచింది.



Click it and Unblock the Notifications