Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
అగ్నిమాపక యంత్రాల్లో మీకు కనీసం 'ABC' లైనా తెలుసా? లేదా?
ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లలో ఎన్ని రకాలు ఉంటాయో అన్న విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఈ అగ్నిమాపక యంత్రాల్లో ఐదు ప్రాథమిక రకాలు ఉంటాయి.
ప్రమాదవశాత్తు మంటలు చెలరేగితే ఆర్పడానికి కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, దుకాణాలు ఫైర్ పోర్టబుల్ ఎక్స్‌టింగ్విషర్లు ఉంచుతారు. ఎక్కడైన మంటలు చెలరేగితే వీటితో ఆర్పవచ్చు. అయితే చాలా మందికి వీటిని ఎలా వాడాలో కూడా సరిగ్గా తెలియదు.
అది పక్కన పెడితే.. ఈ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లలో ఎన్ని రకాలు ఉంటాయో అన్న విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండదు. ఈ అగ్నిమాపక యంత్రాల్లో ఐదు ప్రాథమిక రకాలు ఉంటాయి.
ఫైర్, ఎక్స్‌టింగ్విషర్ రకాలు:

క్లాస్ A:
క్లాస్ A మంటల్లో సాధారణ మండే పదార్థాలు, దుస్తులు, కలప, కాగితం, రబ్బరు, ప్లాస్టిక్ లు ఉంటాయి. ఈ సాధారణ మండే పదార్థాలతో కూడిన మంటలను ఆర్పడానికి A రేటింగ్‌తో కూడిన ఎక్స్‌టింగ్విషర్లు తయారు చేయబడతాయి.
క్లాస్ B:
క్లాస్ B మంటలు గ్యాసోలిన్, ఆల్కహాల్, చమురు ఆధారిత పెయింట్స్, లక్కలు వంటి మండే ద్రవాలు ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మంటలు సంభవిస్తే క్లాస్ B ఎక్స్‌టింగ్విషర్లను వాడాలి.
ఇక్కడ గమనికలో ఉంచుకోవాల్సిన విషయం ఉంది. మండే వాయువులతో మంటలు సంభవిస్తే ముందుగా ఇంధన సరఫరాను నియంత్రించాలి. ఆ తర్వాతే ఎక్స్‌టింగ్విషర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలి. లేదంటే పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.
క్లాస్ C:
క్లాస్ C మంటలు శక్తితో కూడిన విద్యుత్ పరికరాలను కలిగి ఉంటాయి. C రేటింగ్‌తో కూడిన ఎక్స్‌టింగ్విషర్లు శక్తితో కూడిన విద్యుత్ పరికరాలతో కూడిన మంటల కోసం రూపొందించబడతాయి.

క్లాస్ D:
క్లాస్ D మంటల్లో మెగ్నీషియం, టైటానియం, సోడియం వంటి మంటే లోహాలు ఉంటాయి. D రేటింగ్ తో ఉన్న ఎక్స్‌టింగ్విషర్లు మండే లోహాలతో కూడిన మంటలను ఆర్పడానికి రూపొందించబడతాయి.
లోహాల ద్వారా మంటలు ఏర్పడిన సమయంలో ఎక్స్‌టింగ్విషర్ల కంటే కూడా ఇసుకతో మంటలు ఆర్పివేయడానికి ప్రయత్నించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
క్లాస్ K:
క్లాస్ K మంటల్లో కూరగాయల నూనెలు, జంతు నూనెలు, కొవ్వులు ఉంటాయి. K రేటింగ్‌తో కూడిన ఎక్స్‌టింగ్విషర్లు ఇలాంటి పదార్థాలతో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పడానికి క్లాస్ K ఎక్స్‌టింగ్విషర్లు రూపొందించబడతాయి.
మల్టీపర్పస్ ఎక్స్‌టింగ్విషర్లు:
BC రేటింగ్ తో కూడిన ఎక్స్‌టింగ్విషర్లతో మండే ద్రవాలు, విద్యుత్ పరికరాల ద్వారా మంటలు చెలరేగినప్పుడు వాటిని ఆర్పేందుకు వాడొచ్చు. అలాగే ABC ఎక్స్‌టింగ్విషర్లు మండే పదార్థాలు, మండే ద్రవాలు, విద్యుత్ పరికరాల ద్వారా మంటలు సంభవించినప్పుడు వాటిని ఆర్పేందుకు వాడొచ్చు.



Click it and Unblock the Notifications
