Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Robot IVF: ప్రపంచంలోనే మొదటిసారి రోబోతో ఐవీఎఫ్.. కవల పిల్లల జననం
సాంకేతికత కొంత పుంతలు తొక్కుతోంది. రోజురోజుకూ వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా ఓ రోబో సాయంతో చేసిన ఐవీఎఫ్ సక్సెస్ అయింది. ఒకే కాన్పులో ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.
రోబో ద్వారా అండంలోకి శుక్రకణాలు:
స్పెయిన్ లోని బార్సిలోనాకి చెందిన ఇంజినీర్లు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఐవీఎఫ్ పద్ధతిలో అండంలోకి ఇంజెక్షన్ ద్వారా శుక్ర కణాలు ప్రవేశ పెడతారు. సాధారణంగా ఈ పద్ధతిని వైద్యులే చేస్తారు. ఈ క్లిష్టమైన పద్ధతిని తొలిసారిగా రోబో సాయంతో అండంలోకి శుక్రకణాలు ప్రవేశ పెట్టారు శాస్త్రవేత్తలు. రెండు పిండాలు అభివృద్ధి చెంది, 9 నెలల తర్వాత ఇద్దరు పండంటి ఆడ పిల్లలు జన్మించారు.

ఐవీఎఫ్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ:
ఈ ప్రయోగం న్యూయార్క్ సిటీలోని న్యూహోప్ ఫెర్టిలిటీ సెంటర్ లో జరిగింది. ఐవీఎఫ్ పద్ధతి సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి ఎంతో అనుభవం ఉన్న వైద్యులు చేస్తుంటారు. సాధారణంగానే ఐవీఎఫ్ కు లక్షల్లో ఖర్చవుతుంది. చాలా మంది సామాన్యులకు ఐవీఎఫ్ అందని ద్రాక్షలా మారింది. తాజాగా చేసిన రోబో ఐవీఎఫ్ అందుబాటులోకి వస్తే.. ఐవీఎఫ్ కు అయ్యే ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంది.
ప్లే స్టేషన్-5 కంట్రోలర్‌ను వాడి..:
ఈ ప్రయోగం చేపట్టిన ఇంజినీర్లకు ఫెర్టిలిటీ అంశంపై పెద్దగా అనుభవం ఏమీ లేదు. సూదిలాంటి సన్నని రోబోను ఉంచేందుకు.. సోనీ ప్లే స్టేషన్-5 కంట్రోలర్ ను వాడారు. అందులో శుక్రకణాలు నింపారు. కెమెరా ద్వారా మానవ అండాన్ని చూసిన రోబో.. తనంతట తానే ముందుకు వెళ్లి అండంపై శుక్రకణాలను చొప్పించింది.
అక్కడికి రెండు రోజుల వ్యవధిలో అవి ఫలదీకరణం చెంది, పిండాలుగా మారినట్లు ఇంజినీర్లు తెలిపారు. 9 నెలల తర్వాత ఇద్దరు ఆడపిల్లలు జన్మించినట్లు ఎంఐటీ టెక్నాలజీస్ పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐవీఎఫ్ తో పోలిస్తే రోబో ఐవీఎఫ్ కు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
త్వరలోనే అందరికీ అందుబాటులోకి..:
ఈ రోబోను ఓవర్ ట్యూర్ లైఫ్ అనే స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. అతి తక్కువ ఖర్చుతో ఆటోమేటిక్ ఐవీఎఫ్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు ఈ ప్రయోగం ప్రారంభం మాత్రమేనని తెలిపారు. ఈ సాంకేతికతను భవిష్యత్ లో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని నిపుణులు తెలిపారు.



Click it and Unblock the Notifications