Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
దంపతుల మధ్య సుఖం, సౌఖ్యం కోసం.. పడగ్గదిలో ఏం చేయాలో తెలుసా?
ప్రేమ, ఆకర్షణ, నమ్మకం, గౌరవం.. దాంపత్యబంధం సాఫీగా, హాయిగా, కలకాలం సాగడానికి ఇవన్నీ చాలా అవసరం. ఆరోగ్యకరమైన సంబంధానికి ఇరువురి మధ్య సాన్నిహిత్యం కావాలి. ఒకరితో ఒకరు కలిసి ఉండాలన్న కోరిక ఉండాలి. ఇవన్నీ ఉన్నా.. కొన్ని సార్లు దంపతుల మధ్య కలహాలు జరగడం సాధారణమే. అయితే వాటిని త్వరగా పరిష్కరించుకోవాలి. అలా కాకుండా దంపతులు ఇద్దరూ నిత్యం గొడవ పడుతూ, మాట్లాడితేనే కోపగించుకుంటూ, సాన్నిహిత్యం లేక, శృంగారానికి కూడా దూరం కావడం వల్ల ఆ దాంపత్య ఎక్కువ కాలం నిలవలేదు.

దంపతుల మధ్య గొడవలకు చాలానే కారణాలు ఉండొచ్చు. అలాగే వాస్తు శాస్త్రం కూడా ఓ కారణంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో కొన్ని పనులు చేయడం వల్ల, లేదా చేయకపోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం.
బెడ్ స్థానం
పడకగదిలో పడుకునే మంచం సరైన దిశలో లేకపోవడం వల్ల దంపతుల మధ్య నిత్యం కలహాలు జరుగుతాయి. సాన్నిహిత్యం సన్నగిల్లుతుంది. బెడ్రూములో బెడ్ దక్షిణం లేదా నైరుతి దిశలో ఉండాలి. అలా కాకుండా ఎటూ కాకుండా పెట్టుకోవడం వల్ల సమస్యలు తప్పవు. రిలేషన్‌షిప్ లో అనేక సమస్యలు వస్తాయి.
బెడ్ నైరుతి వైపు ఉంచడం వల్ల పురుష శక్తి కేంద్రాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇద్దరు భాగస్వాముల మధ్య సానుకూల ప్రకంపనలు సృష్టించబడతాయి. నైరుతి దిశ పురుష శక్తి స్థానం. ఇది సంబంధంలో స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
రెండు మ్యాట్రెస్‌లు ఉండొద్దు
దంపతులు పడుకునే మ్యాట్రెస్ ఎప్పుడూ ఒకటే అయి ఉండాలి. రెండు మ్యాట్రెస్ లను ఒక దగ్గరగా ఉంచి పడుకోవద్దు. రెండు మ్యాట్రెస్ లు ఉండటం వల్ల దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. మనస్పర్థలు వస్తాయి. అలాగే బెడ్ ఎప్పుడూ తలుపుకు ఎదురుగా ఉంచకూడదు. కొద్దిగా పక్కకు ఉండేలా చూసుకోవాలి,
రంగు, వెలుతురు
పడకగదిలో గోడలపై ఉపయోగించే రంగులు తేలికైనవిగా ఉండాలి. అలాగే ఆహ్లాదకర రంగులనే ఎంచుకోవాలి. బెడ్రూములో పింక్ లేదా పీచు షేడ్ అయితే మంచిది. గులాబీ, ఎరుపు రంగులను కూడా ఉపయోగించవచ్చు.
ఎడమ వైపున పడుకోవాలి
వాస్తు ప్రకారం భార్య భర్తకు ఎడమ వైపున పడుకోవాలి. కుడివైపు పడుకోవడం వల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కలహాలు జరగవచ్చు. ఉన్నట్టుండి గొడవ జరిగి సాన్నిహిత్యం దెబ్బతినవచ్చు.
అద్దం ఎక్కడ ఉండాలంటే
పడకగదిలో ఉంచే అద్దం బెడ్ కు అభిముఖంగా ఉండకూడదు. బెడ్ పై నిద్రించే వారు నేరుగా అద్దంలో చూస్తే కనిపించకుండా కొద్దిగా పక్కను అద్దం ఉంచుకోవాలి. ఒకవేళ అద్దం నేరుగా బెడ్ కు అభిముఖంగా ఉంటే.. దాని వల్ల దాంపత్య సమస్యలు, లైంగిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇతర చోట్ల పెట్టుకోలేని పరిస్థితి, స్థలం లేని పరిస్థితుల్లో.. రాత్రి పడుకునే ముందు, బెడ్ పై శృంగారం చేసుకునే సమయంలో అద్దానికి టవల్ లేదా దుప్పటి కప్పడం మంచిది.
చనిపోయిన వారి ఫోటోలు ఉంచకూడదు
బెడ్రూములో చనిపోయిన వారి ఫోటోలు, విగ్రహాలు ఉంచకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. దంపతుల ఫోటోలు ఉంచడానికి పశ్చిమ దిశ, కుటుంబ ఫోటో ఉంచడానికి నైరుతి దిశ ఉత్తమం.
జంట బొమ్మలు
బెడ్రూము అంటే దంపతులను సూచిస్తుంది. అలాంటి పడక గదిలో ఏదైనా బొమ్మలు ఉంచాలనుకుంటే.. జంటగా ఉన్న వాటినే ఎంచుకోవాలి. బాతులైనా, పక్షులైనా, జంతువులు అయినా జంటగా రెండు ఉన్న బొమ్మలనే ఎంచుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications