Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి,మీకు చాలా హెల్ప్ అవుతాయి
ప్రస్తుతం ఉన్న కాలంలో అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది ఆన్‌లైన్ బెట్టింగ్. చాలా మంది ఈ ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. వేలకు వేలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవచ్చనే ఆశలో పడిపోయి ఉన్న వాటిని కూడా కోల్పోతున్నారు. వాటిని తిరిగి సంపాదించుకునేందుకు మళ్ళీ అప్పులు చేయడం మొదలు పెడుతున్నారు. వీటి వల్ల మనిషి తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నాడు. అయితే ఈ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకోకూడదంటే ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేము బెట్టింగ్ ఆడమని ప్రోత్సహించడం లేదు. బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరం. కానీ కొంతమంది ఎంత చెప్పినప్పటికీ వినకుండా ఆ ఊబిలోకి వెళ్తూనే ఉంటారు. దీని కారణంగా వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత చెప్పినా వినకుండా బెట్టింగ్‌లో డబ్బులు పెట్టాలని అనుకునే వ్యక్తులు ఈ టిప్స్ పాటించడం వల్ల డబ్బులు పోగొట్టుకోకుండా ఉండారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోకుండా ఉండేందుకు కొన్ని సూచనలు:
బడ్జెట్ నిర్ణయించుకోండి
బెట్టింగ్ కోసం మీరు ఎన్ని నిధులను ఖర్చు చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించండి. మీరు నిర్ణయించిన బడ్జెట్‌ను మించకుండా ఖర్చు చేయడం ముఖ్యం. ఒకవేళ మీకు ఆ నిధులతో డబ్బులు వస్తే వాటిని విత్‌డ్రా చేసుకోండి. ఒకవేళ రాకపోతే అక్కడైతే వదిలేయండి.
స్పష్టమైన అవగాహనతో ఆడండి
మీరు ఆడుతున్న గేమ్‌ను, గెలిచేందుకు దానిలో తీసుకోవాల్సిన వ్యూహాలను అర్థం చేసుకోవాలి. అదృష్టంపై మాత్రమే ఆధారపడకుండా, అవగాహనతో జాగ్రత్తగా ఆడండి. అలా ఆడినప్పుడు డబ్బులు పోకుండా ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టంపైనా ఆధారపడితే డబ్బులు పోయే ఆస్కారం ఉంటుంది.
వ్యసనంగా మారకుండా ఉండండి
బెట్టింగ్ ఏదైనా మోజుగా మారితే, అది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కాబట్టి, గెలిచినా లేదా ఓడినా, మీ ఆటను నిర్దిష్ట పరిమితులలో ఉంచడం చాలా ముఖ్యం. అది వ్యసనంగా మారకముందే మీరు దాని బారి నుంచి బయటపడాలి. వాటి ఊబిలో చిక్కుకోకుండా ఉండాలి.
ఆఫర్లను జాగ్రత్తగా ఆలోచించండి
చాలా ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తాయి. వాటి వల్ల మోసాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆన్లైన్ బెట్టింగ్‌లో ఆఫర్లు వస్తే వాటి గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలి. గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే బోల్తా పడడం ఖాయం
సహాయం తీసుకోండి
మీరు బెట్టింగ్ వ్యసనంగా మార్చుకుంటే, దానిని నియంత్రించడం కష్టం అవుతుంది. అప్పుడు, కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయంతో సమస్యను పరిష్కరించుకోండి. ఆ బెట్టింగ్ మాయలో నుంచి బయటపడింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు:
ఆర్థిక నష్టం: బెట్టింగ్‌లో డబ్బు కోల్పోవడం, తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు.
మానసిక ఒత్తిడి: గెలిచినా, ఓడినా మీరు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ సమస్యలు: ఎక్కువ సమయం బెట్టింగ్‌లో గడిపితే, ఇది కుటుంబ సభ్యులతో గొడవలకు దారితీయవచ్చు.
నేరాలు: కొన్ని సందర్భాలలో, ఆన్‌లైన్ బెట్టింగ్ నేరాలకు పాల్పడే మార్గాలను కూడా చూపిస్తుంది.



Click it and Unblock the Notifications