Latest Updates
-
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి
న్యూడ్ ఫొటోలు పంపారు..పడుకోమన్నారు..టీమిండియా ఆటగాళ్ల చీకటి కోణం బయటపెట్టిన అనయ!
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కుతురు అనయ బంగార్ తాజాగా చేసిన సంచలన ప్రకటనలు కేవలం క్రికెట్ అభిమానులనే కాకుండా యావత్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. ఒకప్పుడు అబ్బాయిగా గ్రౌండ్ లో మెరుపులు మెరిపించిన అనయ యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి వాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన అనయ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనయ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతమంది మాజీ క్రికెటర్లు తనకు న్యూడ్ ఫొటోలు పంపారని, లైంగికంగా వేధించారని..తమతో పడుకోవాలంటూ అసభ్యకరమైన ప్రతిపాదనలు చేశారని అనయ ఇంటర్వ్యూలో బాంబు పేల్చింది. కారులో కూర్చున్న సమయంలో ఒకప్పటి స్టార్ క్రికెటర్ నుంచి ఎదురైన షాకింగ్ అనుభవాన్ని గురించి అనయ చెప్పిన మాటలు వింటే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే.
తండ్రి వల్లనే నిజం దాచ్చిపెట్టి
అనయ అసలు పేరు ఆర్యన్. ట్రాన్ ఉమెన్ గా మారాక తన పేరుని అనయగా మార్చుకుంది. గతేడాది ఫస్ట్ టైం అనయ..ట్రాన్స్ ఉమెన్ గా మారిన విషయాన్ని ధైర్యంగా ప్రకటించుకుంది. . 8 ఏళ్ల వయస్సు నుంచే తన తల్లి కబోర్డ్ లో ఉన్న ఆడోళ్ల బట్టలు వేసుకుని.. అద్దంలో చూసుకొని మురిసిపోయి తాను అమ్మాయినని..తాను కూడా అమ్మాయిలా అవ్వాలి అనుకుంటున్నా అని అంటుండేదాన్నని అనయ చెప్పింది. 12 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనయ..ట్రాన్స్ ఉమెన్ గా మారాలని తనకు చిన్నప్పటి నుంచే ఉన్నా కూడా తన తండ్రి ఓ సెలబ్రిటీ కావడంతోనే తన నిజస్వరూపాన్ని ఎంతోకాలం దాచి ఉంచాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తి చేసింది.

సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, యశస్వి జైశ్వాల్ వంటి ప్లేయర్స్ తో క్రికెట్ ఆడిన రోజులను ఇంటర్వూలో అనయ గుర్తుచేసుకుంది. వాస్తవానికి అనయ క్రికెట్ కెరీర్ అద్భుతంగానే సాగింది. కూచ్ బెహర్ ట్రోఫీ నుంచి ఇంగ్లీష్ క్రికెట్ క్లబ్ దాకా తన బ్యాట్,బంతితో అద్భుతాలు చేసింది. 2019లో జాతీయ అండర్-19 టోర్నమెంట్ (కూచ్ బెహార్ ట్రోఫీ)లో పుదుచ్చేరి తరపున ఆడుతున్నప్పుడు అనన్య అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 300 పరుగులు చేసింది.. అందులో ఒక అద్భుతమైన 150 పరుగుల ఇన్నింగ్స్, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్ లో కూడా తన సత్తా చాటి 20 వికెట్లు పడగొట్టింది.18 ఏళ్ల వయస్సులో ఇంగ్లాడ్ లోని లీసెస్టర్ షైర్ లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడింది. అంతకుముందు ముంబైలోని ప్రఖ్యాత ఇస్లాం జింఖానా క్లబ్ కు ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.
కొంతమంది టీమిండియా ఆటగాళ్లు తనకు న్యూడ్ పిక్స్ పంపారని..తన పక్కనే వచ్చి కూర్చొన్నప్పుడు వాటిని చూపించి తనవి కూడా పంపాలని అడిగేవాళ్లని అనయ చెప్పింది. తన పరిస్థితి గురించి ఓ మాజీ క్రికెటర్ తో చెప్పినప్పుడు..అతను రా కారులో కూర్చో రూమ్ కి వెళ్లి పడుకుందాం అని అన్నాడని..ఆ మాటలు విని షాక్ అయ్యా అని అనయ చెప్పింది. అనయ వ్యాఖ్యలు భారత క్రికెట్ లో పెను దుమారం రేపుతోంది. క్రికెట్ వరల్డ్ లో కొంత సపోర్ట్ తో పాటు కొంత వేధింపులు కూడా ఉన్నాయంటూ అనయ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత భారత క్రికెట్ లో ఇప్పటికీ ట్రాన్స్ ఫోబియా, లైంగిక వేధింపుల మనస్తత్వం సజీవంగా ఉందా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. క్రీడారంగంలో మహిళల పట్ల, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల పట్ల ఉన్న వివక్ష, వేధింపుల గురించి తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.
2023లో బ్యాన్
ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ట్రాన్స్ జెండర్ అథ్లెట్లను పాల్గొనడానికి వీలు లేకుండా 2023 నవంబర్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌల్సిల్(ICC) ఓ కొత్త పాలసీని తీసుకొచ్చింది.
తండ్రి సైతం దిగ్గజ కోచ్
అనయ తండ్రి సంజయ్ బంగా భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన కోచ్ లలో ఒకరు. క్రికెటర్, కోచ్ గా ఆయన తనదైన ముద్ర వేశారు. టీమిండియా తరపున 12 టెస్టులు, 15 వన్డేలకు ప్రాతినిధ్యంవ వహించారు. మహారాష్ట్రకి చెందిన సంజయ్ బంగార్.. IPLలో పంజాబ్ కింగ్స్ (PBKS),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వంటి అగ్రశ్రేణి జట్లకు కోచ్ గా పనిచేశారు. అంతేకాకుండా టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ గా కూడా ఆయన సేవలందించారు.



Click it and Unblock the Notifications











