Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ కిస్, ఫ్రెంచ్ టోస్ట్.. ఇవేవీ ఫ్రాన్స్‌కు చెందినవి కావా?
ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా మంది తినే ఉంటారు. అలాగే ఫ్రెంచ్ కిస్‌లను సినిమాల్లో చూసే ఉంటారు, కొందరు నేరుగా ఫీలయ్యే ఉంటారు, ఫ్రెంచ్ టోస్, ఫ్రెంచ్ మానిక్యూర్, ఫ్రెంచ్ బ్రెయిడ్.. చాలా మంది వీటి గురించి వినే ఉంటారు. ఫ్రెంచ్, ఫ్రెంచ్ అని ఉంది కదా..
అవన్నీ ఫ్రాన్స్ లో మొదటి ఆవిష్కరించబడి ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ ఫ్రెంచ్ అనే పేరు పెట్టి పిలిచే చాలా వస్తువులు, ఆహారాలు ఫ్రాన్స్ కు చెందినవి కావు. ఫ్రెంచ్ కిస్‌కు ఫ్రాన్స్‌కు ఏ సంబంధం లేదు. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్‌ను బెల్జియంలో మొదట తయారు చేశారు. అలాంటి కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్:
ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలిచే ఆలూతో చేసే ఫ్రైస్ కు ఆ పేరు పెట్టింది అమెరికన్లు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రెంచ్ మాట్లాడే బెల్జియన్లు ఈ ఫ్రైస్ తినే వారట. వాటిని అమెరికన్లు మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలవడంతో వాటికి ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది.
ఫ్రెంచ్ కిస్:
ఫ్రాన్స్ బాగా రొమాంటిక్ దేశం కదా అలా ఈ ఫ్రెంచ్ కిస్ ను కూడా వాళ్లే కని పెట్టి ఉంటారని చాలా మంది అనుకుంటారు. నాలుకలో కిస్ చేసుకునే ఈ రకమైన కిస్‌కు ఫ్రాన్స్ కు ఏ సంబంధమూ లేదు. ఈ రకమైన కిస్ ను మొదట్లో ఫ్లోరెంటైన్ కిస్ గా పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బ్రిటీష్, అమెరికన్ సైనికులు.. తమ భార్యలకు, ప్రియురాళ్లకు చాలా ఉద్వేగంతో ఈ రకమైన కిస్ లు ఇచ్చారట. ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఈ కిస్ ఇవ్వడంతో ఫ్రెంచ్ కిస్ అనే పేరు వచ్చిందని అంటారు.
ఫ్రెంచ్ టోస్ట్:
ఫ్రెంచ్ టోస్ట్ అని పిలిచే ఆహార పదార్థానికి కూడా ఫ్రాన్స్ తో సంబంధం లేదు. టోస్ట్ పురాతన రోమన్ కాలం నుంచి వచ్చిందని చాలా మంది అంటారు. మరికొందరు టోస్ట్ ను మొదట ఇంగ్లాండ్ వాసులు తినే వారని చెబుతారు.
ఫ్రెంచ్ బ్రెయిడ్:
ఫ్రెంచ్ బ్రెయిడ్ చాలా పాపులర్ అయిన హెయిర్ స్టైల్. ఇది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చిందేం కాదు. ఈ రకమైన హెయిర్ స్టైల్ ను మొదట నార్త్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు చెబుతారు. గ్రీకు, సెల్టిక్ కళల్లో ఈ రకమైన హెయిర్ స్టైల్ కనిపిస్తుందని కూడా అంటారు.
ఫ్రెంచ్ హార్న్:
కొమ్ముల నుంచి తయారు చేసిన వాయిద్యం నుంచి ఈ పేరు వచ్చింది. ఫ్రెంచ్ హార్న్ కు ఫ్రాన్స్‌కు ఏ సంబంధమూ లేదు. 17వ శతాబ్దంలో జర్మనీలో మొదట దీనిని తయారు చేసినట్లు చెబుతారు. ఈ ఫ్రెంచ్ హార్న్ ను.. కేవలం హార్న్ అని మాత్రమే పిలవాలని ఇంటర్నేషన్ హార్న్ సొసైటీ కూడా చెప్పడం గమనార్హం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications