Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వంకాయ మంచిదా? చెడ్డదా?..ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు
వంకాయ పేరు వినగానే కొందరు అబ్బా అనుకుంటే..మరికొందరు ఆహా అనుకుంటారు. సాధారణంగా చాలామంది వంకాయ చేసే కూరలను తినడానికి ఇష్టపడరు..అయితే సరిగ్గా వండాలే కానీ వంకాయ కూర మరే ఇతర కూరకు రాదు. వంకాయ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఓ అద్భుతమైన వరం. ఆరోగ్యానికి మేలు చేసే అనేక లక్షణాలు వంకాయలో ఉంటాయి. మినరల్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయ ఇది.
గుండె పనితీరును మెరుగుపరచడం నుంచి మలబద్ధకాన్ని నివారించడం వరకు, బరువును అదుపులో ఉంచడం నుంచి శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందించడం వరకు వంకాయ ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అయితే మార్కెట్ నుండి పుచ్చులు, చేదు విత్తనాలు లేని సరైన వంకాయను తెచ్చుకోవడం ఒక కళ. పుచ్చులు లేని, తాజా వంకాయలను గుర్తించడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

మేలిమి వంకాయను ఎంచుకునే మార్గాలు
మెరిసే చర్మమే మంచికి చిహ్నం
వంకాయ పై చర్మం నునుపుగా, నిగనిగలాడుతూ, గట్టిగా ఉంటే అది ఫ్రెష్ కాయ అని అర్థం. చర్మంపై ముడతలు, మచ్చలు, చిన్న రంధ్రాలు లేదా పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే లోపల ఏదో సమస్య ఉన్నట్టే. అలాంటి వాటికి దూరంగా ఉండండి.
తొడిమ చెప్పే నిజం
వంకాయ తొడిమ (కాడ) పచ్చగా, ఫ్రెష్ గా ఉందంటే ఆ కాయను ఇటీవలే చెట్టు నుంచి కోశారని అర్థం. తొడిమ ఎండిపోయి, గోధుమ రంగులోకి మారితే అది పాత కాయని లేదా లోపల మెత్తబడిందని గ్రహించాలి.
నొక్కి చూడండి
వంకాయను మీ వేలితో నెమ్మదిగా నొక్కి చూడండి. నొక్కిన ప్రదేశం వెంటనే తిరిగి యథాస్థితికి వస్తే అది దృఢంగా, తాజాగా ఉన్న మంచి కాయ. అలా కాకుండా వేలి ముద్ర అక్కడే పడిపోయి, లోపలికి గుంటలా ఏర్పడితే అది లోపల పాడైపోయిందని లేదా పురుగులు చేరాయని సంకేతం.
బరువుతో బేరీజు వేయండి
పరిమాణంలో పెద్దగా ఉండి, చేతిలోకి తీసుకున్నప్పుడు తేలికగా అనిపించే కాయలు లోపల పుచ్చులు పట్టి బోలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి దాని పరిమాణానికి తగిన బరువు ఉన్న, కాస్త చిన్నగా, దృఢంగా ఉన్న కాయలను ఎంచుకోవడం ఉత్తమం. ఈసారి మార్కెట్ కు వెళ్లినప్పుడు ఈ చిట్కాలు పాటించి, పుచ్చులు లేని, రుచికరమైన వంకాయలను ఇంటికి తెచ్చుకోండి.
విత్తనాల విషయం
గుండ్రంగా, మధ్యస్థ పరిమాణంలో ఉన్న వంకాయలలో సాధారణంగా విత్తనాలు తక్కువగా ఉంటాయి. అదే పొడవుగా లేదా చాలా పెద్దగా ఉన్న కాయలలో గింజలు, పీచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
నిల్వ చేసే విధానం
వంకాయలను ఇంటికి తెచ్చిన తర్వాత వాటిని నేరుగా ఫ్రిజ్ లో పెట్టవద్దు. అతిశీతల ఉష్ణోగ్రత వల్ల అవి త్వరగా నల్లగా మారిపోతాయి. వాటిని ఒక కాగితంలో లేదా పొడి వస్త్రంలో చుట్టి అప్పుడు ఫ్రిజ్ లోని కూరగాయల అరలో ఉంచండి. రెండు, మూడు రోజుల్లోగా వాడుకుంటే వంకాయ తాజాదనాన్ని, అసలైన రుచిని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications