Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
చదువులో ఫెయిల్..తొలి ఉద్యోగ ప్రయత్నంలో ఫెయిల్..పోయిన చోటే 7సార్లు వరుస విజయాలు..నేడు లక్షలమందికి స్పూర్తి
స్కూల్ లో ఫెయిల్ అయ్యాడు..టీచర్లు ఎగతాలి చేశారు..నీ వల్ల కాదు వదిలెయ్యి అన్నారు. అయితే తన మనసు మాట మాత్రమే విన్నాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యాడు..అయినా వదల్లేదు..ఎవ్వరూ ఊహించని రేంజ్ కి ఎదిగాడు. లక్షల మందికి ఇప్పుడు అతడొక స్పూర్తి. అతడి పేరు వింటేనే కొందరికి మనసులో తెలియని పులకరింత. బలమైన నమ్మకం, పట్టుదల,అంకిత భావం ఉంటే సాధించలేదని ఏదీ ఉండదు, విజయానికి వయస్సుతో సంబంధం ఉండదు అని నిరూపించిన అతడే పంకజ్ యాదవ్.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ చిన్న పట్టణంలో జన్మించిన పంకజ్ యాదవ్..మొదట్లో చదువుల్లో చాలా వెనుకబడి ఉండేవాడు. కుటుంబానికి చెందిన బెల్లం షాపులో తనవంతు సాయం అందిస్తూ స్కూల్ కి వెళ్లి చదవుకుంటేవాడు. అయితే చదువుల్లో బాగా వెనుకబడిపోయి మూడు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు. దీంతో టీచర్ క్లాసురూమ్ లో అందరిముందు పంకజ్ ని ఎగతాలి చేశాడు. 60 శాతం మార్కులు సాధిస్తేనే జీవితంలో ఏదైనా సాధించగలరు అని ఆ సమయంలో టీచర్ అన్న మాటలు పంకజ్ మైండ్ లో స్టోర్ అయిపోయాయి. ఆ మాటే అతడి జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది.

తన విలువ ఏంటే ఫ్రూవ్ చేయడానికి పంకజ్ ఇంటికి వెళ్లి నేను కొద్ది రోజులు షాపులో పనిచేయను చదువు మీద ఫోకస్ పెట్టాలని అని తండ్రితో అన్నాడు. తండ్రికి కూడా దానికి ఓకే చెప్పాడు. అంతేకాకుండా నువ్వు 60శాతం మార్కులు సాధిస్తే నీకు క్రికెట్ కిట్ కొనిస్తా అని కూడా తండ్ర పంకజ్ కి వాగ్దానం చేశాడు. దీంతో పంకజ్ తమ బెల్లం షాపులోని స్టోర్ రూమ్ లో ఒక మూలన తన స్టడీ కోసం ఒక చాప, ఒక టేబుల్ ఏర్పాటు చేసుకొని మొదలుపెట్టాడు. ఆ తర్వాత 60 శాతం కాదు ఏకంగా స్కూల్ టాపర్ అయ్యాడు.
ఆ దెబ్బతో పంకజ్ లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఎలాంటి అడ్డంకులను అయినా అధిమగించి గెలిచితీరవచ్చు అనే నమ్మకం అతడిలో బలపడింది. క్రమంగా పంకజ్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పెద్ద కార్పొరేట్ కంపెనీ ఉద్యోగం వచ్చింది. పెళ్లి అయ్యింది..ఒక పిల్లాడు పుట్టాడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో 30 ఏళ్ల వయస్సులో పంకజ్ కి మనసులో ఏదో అనుకున్నది చేయలేకపోయానేమో అని ఒక బాధ వచ్చింది.
సివిల్ సర్వీస్ లోకి అడుగుపెట్టాలని భావించాడు. గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. మంచిగా ఉన్న జీవితాన్ని ఎందుకు కరాబ్ చేసుకుంటావ్ అని ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవ్వరూ చెప్పినా పంకజ్ వినలేదు. ఉదయం జాబ్, సాయంత్రం పిల్లలు, కుటుంబంతో గడపడం,రాత్రి గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం చేశాడు. తొలిసారి యూపీఎస్సీ ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహపడలేదు. కోచింగ్ సెంటర్లు, మాక్ టెస్టుల మీద ఆధారపడలేదు. తనను తానే క్రమశిక్షణ నియ్ంత్రించుకొని సోషల్ మీడియాను పూర్తిగా దూరం పెట్టేసి సక్సెస్ కోసం తన సొంత స్ట్రాటజీ డిజైన్ చేశాడు. ఆ తర్వాత 6 రాష్ట్ర సివిల్ సర్వీస్ ఎగ్జా మ్స్ లో(PCS-Provincial civil service)ర్యాంకులు సాధించాడు. నీకు ప్యాషన్ ఉంటే వయస్సు, పరిస్థితులు ఏవీ నిన్ను ఆపలేవు అని పంకజ్ యాదవ్ అంటున్నారు. .కష్టపడటం, క్రమశిక్షణ, ఫోకస్ విజయానికి ఈ మూడే ముఖ్యమైనవి పంకజ్ చెప్పారు.



Click it and Unblock the Notifications