Latest Updates
-
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు!
పగలు వాచ్‌మెన్, రాత్రి కోడర్.. కట్ చేస్తే సెక్యురిటీ గార్డ్ గా పనిచేసిన కంపెనీలోనే పెద్ద సాఫ్ట్ వేర్ డెవలపర్
కష్టంతో పాటు సాధించాలన్న తపన ఉంటే కోరుకున్నది ఏదో ఒక రోజు తప్పక వస్తుంది అని నిరూపించాడు అబ్దుల్ అలిమ్. పెద్దగా చదువుకోలేదు, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏదైనా ఉద్యోగం చేయాలని చేతిలో కేవలం రూ.1000లతో ఇంటి నుంచి వచ్చేశాడు.
రెండు నెలలు పస్తులుండి,కాళ్లరిగేలా రోడ్ల మీద తిరిగి చివరికి సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం సంపాదించాడు. కట్ చేస్తే కొద్దినెలల్లోనే పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజీనీర్ అయ్యాడు. నేడు చాలామందికి అతనొక ఇన్సిరేషన్ గా మారిపోయాడు.

అబ్దుల్ అలిమ్ కథేంటీ
తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్దుల్ అలిమ్ తన లింక్డిన్ ప్రొఫైల్ లో తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతి వరకు చదువుకున్న అబ్దుల్..2013లో ఒకరోజు ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకొని ఇంట్లో నుంచి 1000 రూపాయలలో ఇంటి నుంచి వచ్చేశాడు. అందులో 800 రూపాయలు ఖర్చుతో రైలు టిక్కెట్ కొన్నాడు.
ఆ తర్వాత రోడ్లపైనే 2 నెలల పాటు గడిపాడు. ఈ సమయంలో అనేక కష్టాలను అనుభవించాడు. తర్వాత జోహో(zoho)ఆఫీస్ బయట సెక్యురిటీ గార్డ్ గా ఉద్యోగం సంపాదించాడు.
జోహో కంపెనీ దగ్గర సెక్యురిటీ గార్డుగా అబ్దుల్ పనిచేస్తున్న సమయంలో అతనిలో ఉన్న ఆశక్తిని గమనించిన అదే కంపెనీలో పనిచేసే ఓ సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి..అబ్దుల్ తో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఆ ఉద్యోగి అబ్దుల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకున్నాడు. అబ్దుల్ గురించి తెలుసుకున్నఆ సీనియర్ ఉద్యోగి షాక్ అయ్యాడు.
అబ్దుల్ కి హెచ్ టీఎంల్ బాగా తెలుసు అని గ్రహించాడు. అబ్దుల్ కి తాను ప్రోగ్రామింగ్ గురించి మరింత వివరంగా చెప్తాను అని అన్నాడు.దీంతో అబ్దుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో అబ్దుల్ కెరీర్, లైఫ్ రెండు పూర్తిగా మారిపోయాయి.
ఇక ప్రోగ్రామింగ్ గురించి బాగా నేర్చుకోవాలన్న ఉత్సాహంతో డబుల్ షిఫ్ట్ లలో సెక్యురిటీ గార్డుగా పనిచేయడం మొదలు పెట్టాడు అబ్దుల్. ప్రతి రోజు రాత్రి తన సెక్యురిటీ గార్డ్ డ్యూటీని ఫినిష్ చేయడం,తర్వాత ఆ సీనియర్ ఉద్యోగి దగ్గర నుంచి కోడింగ్,సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ గురించి నేర్చుకోవడం చేసేవాడు. ఇలా 8 నెలలు తీవ్రంగా కష్టపడి నేర్చుకున్నాడు.
దీంతో తనే సొంతంగా ఒక యాప్ క్రియేట్ చేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ సీనియర్ ఉద్యోగి అబ్దుల్ క్రియేట్ చేసిన యాప్ ని తన మేనేజర్ కి చూపించాడు. ఆ మేనేజర్ కు అబ్దుల్ పనితనం బాగా నచ్చి జాబ్ ఇవ్వాలని నిర్ణంచుకున్నాడు. దీంతో అబ్దుల్ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. జోహోలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యాడు.



Click it and Unblock the Notifications