Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆ దేశంలో శవాలనైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ.. అన్నం బయట పడేయొద్దు, ఎక్కడో తెలుసా?
చాలా మంది తప్పకుండా సందర్శించాలనుకునే దేశాల జాబితాలో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈ సుందరమైన దేశంలో పర్యటించాలని చాలా మంది ఆశపడతారు. ఫ్రాన్స్ అనగానే కొంత మందికి ఈఫిల్ టవర్ గుర్తుకువస్తే, మరికొంత మందికి ఫ్రెంచ్ వైన్, ఇంకొంత మందికి ఫ్రెంచ్ పెర్‌ఫ్యూమ్‌లు గుర్తుకువస్తాయి. ఫ్రెంచ్ కిస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ టోస్ట్ లాంటివి కూడా మదిలో మెదులుతాయి. అయితే ఈ దేశంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా దాగున్నాయి.

ఫ్రాన్స్ లోని కొన్ని ఆచార సాంప్రదాయాలను, నిబంధనలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ఫ్రాన్స్ గురించి అలాంటి కొన్ని ఆసక్తికరమైన, విచిత్రమైన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.
1. ఏప్రిల్ ఫిష్:
ఏప్రిల్ 1వ తేదీ రోజు చాలా మంది ఏప్రిల్ ఫూల్ అనుకుంటారు. అయితే ఫ్రాన్స్ లో మాత్రం ఏప్రిల్ ఫూల్ డేను కొద్దిగా విచిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజు కాగితంతో తయారు చేసిన చేప బొమ్మలను మనుషుల వీపులపై అతికిస్తారు. అనంతరం ఏప్రిల్ ఫిష్ అంటూ విష్ చేసుకుంటారు. ఫ్రాన్స్ లో ఇది ఆచారంగా వస్తోంది.
2. నత్తలకు ఫుల్ డిమాండ్:
ఫ్రాన్స్ లో నత్తలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడి ప్రజలు చాలా ఇష్టంగా నత్త గుల్లలను లాగించేస్తుంటారు. ఒక ఫ్రెంచ్ పౌరుడు ఏడాదిలో కనీసం 500 నత్తగుల్లలను తింటుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంత ఇష్టంగా తింటుంటారు.
3. వైట్ డ్రెస్ మొదలైంది ఇక్కడే:
చర్చిలో పెళ్లిళ్లు చాలా మంది చూసే ఉంటారు. ఆ సమయంలో వధువు తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ ఆచారం మొదట ఫ్రాన్స్ లోనే పుట్టిందట. 1499 సంవత్సరంలో తొలిసారిగా కింగ్ 12వ లూయిస్ భార్య, వాళ్ల పెళ్లికి తెల్లని దుస్తులు ధరించిందట. అప్పటి నుంచి చర్చిల్లో జరిగే పెళ్లిళ్లలకు వధువులు తెలుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు.
4. శవాలను కూడా పెళ్లి చేసుకోవచ్చు:
పెళ్లి ఖాయమైన తర్వాత లేదంటే.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్న లవర్స్ లో ఒకరు ఏదైనా కారణం చేత మరణిస్తే ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలా మరణించిన వాళ్లను కూడా ఫ్రాన్స్ లో పెళ్లి చేసుకోవచ్చు. అయితే చనిపోయిన వారు.. తమని ప్రేమిస్తున్నారని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకున్న వారికి మాత్రమే ఇలా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది.
5. ఆహారాన్ని బయట పడేయొద్దు:
ఫ్రాన్స్ లో ఆహారాన్ని బయట పడేయకూడదు. అలా పారేయడం చట్ట ప్రకారం నేరం. ఆహారం పడేస్తూ ఎవరైనా పట్టుబడితే కఠినంగా శిక్షిస్తారు కూడా. రెస్టారెంట్లకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఒకవేళ ఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ఛారిటీలకు లేదా ఫుడ్ బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుంది.
6. 20 నిమిషాల పాటే రాజుగా..:
ఫ్రాన్స్ లో కేవలం 20 నిమిషాలు మాత్రమే తన రాజ్యాన్ని పాలించిన రాజు ఒకరు ఉన్నారు. ఆ రాజు పేరు లూయిస్ XIX(లూయిస్ ఆంటోయిన్). తన తండ్రి పదవీ విరమణ చేసే ముందు తన కుమారుడిని తదుపరి రాజుగా ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న లూయిస్ XIX.. తనకు ఆ పదవి వద్దని చెప్పి పదవీ విరమణ చేసేశాడు. అలా 20 నిమిషాల పాటు రాజ్యాన్ని పాలించిన రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











