Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
Gandhi Jayanti 2025 Wishes: ఆయన లేనిదే మనకు స్వేచ్ఛ లేదు..గాంధీ జయంతి విషెస్ ఇలా చెప్పండి..
ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని బారతదేశం సెలబ్రేట్ చేసుకుంటుంది.మహాత్మ గాంధీ పుట్టిన ఈ రోజుని మనదేశంలోనే ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. 1869, అక్టోబర్ 2న గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో జన్మించిన గాంధీజీ తన జీవితాన్ని భారత స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలకు గుర్తింపుగా 2007లో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు విషెస్ ఎలా అందంగా చెప్పుకోవచ్చో ఇక్కడ చూడండి.
ఇలా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్పుకోండి
-జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
-సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడిని స్మరించుకుందాం. గాంధీ జయంతి శుభాకాంక్షలు.
-మహాత్ముని ఆదర్శాలు, ఆశయాలు మన జీవితాలకు మార్గదర్శకాలు కావాలని కోరుకుంటూ.. గాంధీ జయంతి శుభాకాంక్షలు.
-అహింసే ఆయుధంగా, ప్రేమనే మార్గంగా చూపిన బాపూజీకి నివాళులు అర్పిస్తూ.. గాంధీ జయంతి శుభాకాంక్షలు.

-మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం.
-సబర్మతి ఆశయాలను మన జీవితంలో పాటిద్దాం. గాంధీ జయంతి శుభాకాంక్షలు 2024.
-సత్యం, శాంతి, సేవల స్ఫూర్తిని నింపుకున్న రోజు గాంధీ జయంతి. శుభాకాంక్షలు.
-ప్రపంచానికి అహింస గొప్పదనాన్ని చాటిచెప్పిన మహనీయుడికి శతకోటి వందనాలు.
-బాపూజీ చూపిన మార్గంలో నడుద్దాం, దేశాభివృద్ధికి తోడ్పడదాం. హ్యాపీ గాంధీ జయంతి.
-భారతావని గర్వించదగ్గ మహాపురుషుడి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు.
స్పూర్తిదాయకమైన గాంధీ కోట్స్
-ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి- మహాత్మా గాంధీ
-బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి- మహాత్మా గాంధీ
-కంటికి కన్ను అనుకుంటే ప్రపంచం మొత్తం అంధులతోనే నిండిపోతుంది- మహాత్మా గాంధీ
-సత్యమే దేవుడు- మహాత్మా గాంధీ
-మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే - మహాత్మా గాంధీ
-మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది- మహాత్మా గాంధీ
-ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి - మహాత్మా గాంధీ
-అహింసకు మించిన ఆయుధం లేదు- మహాత్మా గాంధీ
-భవిష్యత్తు అనేది మీరు ఈ రోజు ఏం చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది- మహాత్మా గాంధీ
కవితాత్మకంగా చెప్పాలంటే..
-అహింసా జ్యోతి వెలిగించి, దేశానికి వెలుగునిచ్చిన యుగపురుషుడు. గాంధీ జయంతి శుభాకాంక్షలు.
-సత్యమనే కొండపై నిలిచిన మహావృక్షం, తరతరాలకు నీడనిచ్చే ఆశయాల మూలపురుషుడు.
-శాంతికి పర్యాయపదం, అహింసకు చిరునామా, భారత స్వాతంత్ర్యానికి మారుపేరు మహాత్మా గాంధీ.
-ఖాదీ దారం ప్రతి అణువులో దేశభక్తిని నింపిన మహానుభావుడు. హ్యాపీ గాంధీ జయంతి
-రఘుపతి రాఘవ రాజారాం.. భజనతో దేశాన్ని ఏకం చేసిన బాపూజీకి మా నివాళులు.

సోషల్ మీడియా స్టేటస్ కోసం
-సత్యమే నా మార్గం, అహింసే నా ఆయుధం. మన జాతిపితకు వందనం.
-బాపూజీని స్మరిస్తూ..మార్పు మనలోనే మొదలవ్వాలి.
-గాంధీ గారు ఇచ్చిన అతిపెద్ద పాఠం నిజాయితీ.
-ప్రపంచం శాంతితో ఉండాలంటే మనలో శాంతి ఉండాలి. గాంధీ జయంతి శుభాకాంక్షలు.
-అక్టోబర్ 2 కేవలం సెలవు దినం కాదు, ఒక స్ఫూర్తి దినం.
-ఖాదీ వేషధారణలో కనిపించిన ఆ మహనీయుడి ఆశయాలను గౌరవిద్దాం.
-అహింస, సత్యం ఎప్పటికీ చెరిగిపోని నిత్య సత్యాలు. హ్యాపీ గాంధీ జయంతి 2025.
-ఆయన లేనిదే మనకు స్వేచ్ఛ లేదు. జాతిపితకు నివాళులు.



Click it and Unblock the Notifications