Latest Updates
-
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా..
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి
సాధారణంగా గంగానది అనగానే ముందుగా మదిలో మెదిలే చిత్రం ఉరకలెత్తే దాని ప్రవాహం, పరవళ్లు తొక్కు పవిత్ర జలాలు గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఆథ్యాత్మిక నగరరమైన హరిద్వారాల్ లో గంగానది ప్రవాహం మాయమైంది. హరిద్వార్ వెళ్లిన ప్రతి హిందూ భక్తులు అక్కడ హర్ కీ పౌరీ అనే ప్రముఖ ఘాట్ లో తప్పనిసరిగా పుణ్య స్నానం చేస్తారు. అక్కడ పారే గంగానది ప్రవాహం దగ్గర స్నానమారచరిస్తూ ఎప్పుడూ భక్తులతో కిటకటలాడే ఆ చోట ఇప్పుడు నీటి ప్రవాహం కనుమరుగైపోయింది.
పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది యాత్రికులు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే.. భక్తులు నదిలో స్నానం చేయడానికి బదులుగా మెట్లపై నిలబడి మగ్గులు, లోటాలు, చిన్న చిన్న పాత్రలతో నీటిని సేకరించి ఒంటిపై పోసుకుంటున్నారు. గంగానది ఎడిపోయింది చూడండంటూ ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కారణం ఏమిటి?
వాస్తవానికి గంగానది నేచురల్ గా ఏమీ ఎండిపోలేదు. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఎగువ గంగా కాలువ (హరిద్వార్ నుంచి కాన్పూర్ వరకు వెళ్లే కాలువ) వార్షిక నిర్వహణ పనుల కోసమే ఈ నీటిని నిలిపివేశారు. కాలువలో పూడికతీత, కట్టల నిర్వహణ, మరమ్మతులు, శుభ్రపరిచే పనుల కోసం అక్టోబర్ 20 నుంచి సుమారు 20 రోజుల పాటు ఈ కాలువ మూసివేత కొనసాగుతుంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గింది.

రాబోయే 2027 అర్ధ కుంభమేళాకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు ఈ సమయాన్ని వినియోగించుకుని మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ విషయాన్ని యూపీ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వికాస్ త్యాగి కూడా ధృవీకరించారు. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ గంగా హారతి కోసం సుమారు 200 క్యూసెక్కుల నీటిని మాత్రం హర్ కీ పౌరి వద్ద అందుబాటులో ఉంచుతున్నారు. నవంబర్ 8వ తేదీ, అంటే ధంతేరస్ పండుగ నాటికి నీటి సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
నిరాశలోనూ భక్తుల అచంచల విశ్వాసం
నీటి కొరత ఉన్నప్పటికీ భక్తుల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. ముందస్తు సమాచారం తెలియక వచ్చిన వారు కాస్త నిరాశకు గురైనా, తమ పవిత్ర ఆచారాలను మాత్రం వదల్లేదు. పాత్రలతో నీళ్లు పోసుకుని పుణ్యం పొందినట్లు భావిస్తున్నారు.



Click it and Unblock the Notifications
