Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ రెస్టారెంట్‌లో FREEగా ఏదైనా ఎంతైనా తినొచ్చు.. రెస్టారెంట్ ఎక్కడుందంటే?
మన దేశంలో ఎన్నో కేఫ్‌లు ఉన్నాయి. ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అవన్నీ డబ్బులు తీసుకొని మనకు భోజనాన్ని అందిస్తాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో ఉన్న ఓ హోటల్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా భోజనం అందిస్తుంది. ఆ రెస్టారెంట్ ఎందుకు అలా ఉచితంగా భోజనం పెడుతుంది? డబ్బులకు బదులు ఏం తీసుకుంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గార్బేజ్ కేఫ్
డబ్బులు లేకుండా ఉచితంగానే భోజనం చేయాలనుకుంటే ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లాలో ఉన్న గార్బేజ్ కేఫ్‌కు వెళ్లాల్సిందే. ఈ కేఫ్‌లో డబ్బులకు బదులు ప్లాస్టిక్ తీసుకొని భోజనం ఇస్తారు. ప్లాస్టిక్ సీసాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తీసుకొచ్చే వారికి ఇక్కడ భోజనం ఫ్రీ. మన దేశంలోనే ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే మొట్ట మొదటి సారి. అంబికాపూర్ ఇండియాలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన నగరాల్లో ఒకటి.

ఆ నగరాన్ని అంతే పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, పర్యావరణనాన్ని స్థిరీకరణ చేసేందుకు, పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు ఆ కేఫ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అలాగే దేశంలోనే తమ నగరం అత్యంత పరిశుభ్రమైన నగరంగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సదరు కేఫ్ నిర్వాహకులు వెల్లడించారు.
ఎంత ప్లాస్టిక్ ఇవ్వాలంటే?
నివేదికల ప్రకారం అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా ఈ కేఫ్ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తుంది. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆలూ చాప్, ఇడ్లీ, సమోసా, బ్రెడ్ చాప్ ఇలా పలు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అలాగే ఒక కిలో ప్లాస్టీ వ్యర్థాలు ఇస్తే.. మధ్యాహ్నం పూట ఆరోగ్యకరమైన ఫుల్ మీల్స్ అందిస్తుంది. అందులో నాలుగు రోటీలు, రెండు రకాల కూరలు, పప్పు, అన్నం, సలాడ్, పెరుగు, పచ్చడి, అప్పడాలు అందిస్తారు. ఈ విధమైన భోజనాలను ఆ కేఫ్ ప్లాస్టిక్ తీసుకొచ్చే వారికి అందజేస్తోంది.
ప్లాస్టిక్ లేకపోయినా తక్కువ ధరలోనే..
ప్లాస్టిక్ లేకపోయినా చాలా తక్కువ ధరకే ఈ కేఫ్‌లో భోజనాలు అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఆహరం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు రకాల రేట్లతో మూడు రకాల బోజనాలను ఈ కేఫ్ అందజేస్తోంది. 40 రూపాయల భోజనంలో పప్పు, అన్నం, సలాడ్, సాధారణమైన కూరలు అందజేస్తారు.
అదే 50 రూపాయల థాలిలో నాలుగు రోటీలు, పప్పు, అన్నం, సలాడ్, పాపడ్, ఊరగాయలు, రెండు సాధారణ కూరలు అందజేస్తారు. అదే విధంగా 70 రూపాయల భోజనంలో.. పనీర్ కూర, రెండు రకాల కూరలు, అన్నం, పప్పు, ఊరగాయ, పాపడ్, సలాడ్, రోటీలు, ఇలా అన్ని రకాలను కలిపి అందజేస్తారు.
వినూత్నమైన ఆలోచనలతో వ్యాపారం ప్రారంభించిన ఈ గార్బేజ్ కేఫ్ అతి తక్కువ కాలంలో దేశ ప్రజల గుర్తింపు పొందింది. దీని గురించి విన్న ప్రజలు ఇలాంటి కేఫ్‌లు తమ నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని, పర్యావరణం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.



Click it and Unblock the Notifications