Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Dog Love: యజమానిని వదిలి ఉండలేక ఓ శునకం సాహసం.. 27 రోజులు, 64 కిమీల ప్రయాణం
కుక్కలు .. కొంత మంది ఈ మాట వింటేనే భయపడిపోతారు. మరికొంత మంది తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. కుక్కలను పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది పప్పీలను పెంచుకుంటున్నారు. తమ కన్నబిడ్డలకంటే కూడా ఎక్కువగా వాటిపై ప్రేమ కురిపిస్తున్నారు.
మనం ఓ ముద్దు అన్నం వేస్తేనే.. మన ఇంటికి కాపాలా కాసే కుక్కలు.. ఇంత ప్రేమ చూపిస్తే అవి కూడా తిరిగి అదే ప్రేమను చూపిస్తాయి. నమ్మాలి అనిపించట్లేదా.. ఈ కథ చదివితే కచ్చితంగా అవునంటారు.

లాస్ట్ పావ్స్ ఎంతో ఇష్టంగా గోల్డెన్ రిట్రీవర్ అనే కుక్కను కొనుగోలు చేశాడు. దానికి కూపర్ అనే పేరు పెట్టుకొని ఏడాది పాటు చాలా ప్రేమను చూపిస్తూ పెంచుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ యజమాని దాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే తన మనసుకు నచ్చకపోయినా.. మరో వ్యక్తికి దాన్ని ఇవ్వాలని చూశాడా యజమాని. ఈ క్రమంలోనే ఓ కుటుంబానికి తన ముద్దుల కూపర్ ను అప్పగించేశాడు. వాళ్ల కూడా యజమాని ఇంటికి వచ్చి మరీ దాన్ని తీసుకెళ్లారు.
కారులోంచి దూకేసి పరుగో పరుగు:
అయితే ముందుగా ఆ కుక్కకు విషయం అర్థం కాలేదేమో. చాలా సేపు దిగాలుగా కూర్చున్న ఆ కుక్క.. కొత్త యజమాని ఇంటికి సమీపిస్తుండగా కారు లోంచి దూకేసింది. వారికి అందకుండా పరుగులు తీసింది. ఎలాగైనా సరే తన పాత యజమానిని కలవాలని చూసింది. దాదాపు 64 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఒంటరిగా తన తండ్రి లాంటి యజమానిని చేరుకుంది.
ఉత్తర ఐర్లాండ్ లోని కౌంటీ టైరోన్ లోని తన కొత్త యజమాని ఇంటికి వచ్చిన వెంటనే కారు నుండి దూకేసి పారిపోయింది ఆ కుక్క. కొత్త యజమాని ఎంత వెతికినా దొరకలేదు. అయితే కొన్ని రోజుల పాటు ఆ కుక్క ప్రయాణం చేసింది. పగలు కాకుండా కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే అది ప్రయాణాలు చేయడం ప్రారంభించింది. పొలాలు, అడవులు, గుట్టలు.. ఇలా అన్నీ దాటుకుంటూ తన యజమానిని కలిసింది. ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంబడి, అర్థరాత్రులు మాత్రమే అది ప్రయాణం చేయడం గమనార్హం.
27 రోజుల తర్వాత యజమాని ఇంటికి:
ఏది ఏమైనా 27 రోజుల పాటు ఆ కుక్క ప్రయాణం చేసి తన యజమాని ఇంటికి చేరుకుంది. దాన్ని చూసిన యజమాని వెంటనే దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించాడు. అసలు ఆహారం, ఆశ్రయం, ఎవరి సహాయం లేకుండా తనను ఎలా చేరుకుందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని యజమాని లాస్ట్ పావ్స్ చెబుతున్నారు.
అయినా.. కొత్త యజమాని వద్దే కూపర్:
ప్రస్తుతం కూపర్.. నిగెల్ ఫ్లెమింగ్ అనే కొత్త యజమాని దగ్గరే ఉంది. తన పాత యజమాని పలు కారణాల వల్ల కూపర్ ను పెంచుకోలేకపోయాడు. తిరిగి ఆ యజమానికే అప్పగించాడు. అయితే దాదాపు నెల రోజుల పాటు అది ఆహారం లేకుండా ఉండడంతో.. చాలా వీక్ గా ఉందని చెప్పారు. అందుకే దానికి బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నామన్నారు. లాస్ట్ పావ్స్ చేసిన సాయం మర్చిపోలేమన్నారు. ఇంత తెలివైనా, ప్రేమ కల్గిన కుక్కను తాము పొందడం చాలా సంతోషంగా ఉందని వివరించారు.
నిగె్ ఫ్లెమింగ్‌కు కూపర్‌ను దత్తత ఇచ్చిన తర్వాత పలుసార్లు లాస్ట్ పాన్స్ కూపర్‌ను చూసేందుకు వెళ్లాడు. అప్పుడు కూపర్ ఆనందానికి అవధుల్లేవు. తన పాత యజమానిని చూసి ఎగిరి గంతేసింది కూపర్. తనకు అందిస్తున్న ఆహారం, తనకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించాడు లాస్ట్ పాన్స్. కూపర్‌ను ఎలా చూసుకోవాలో కొత్త యజమానికి పలు సూచనలు చేశాడు.



Click it and Unblock the Notifications