Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రికార్డు సృష్టించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా అరుదైన రికార్డు!
2024వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలవుతుంది. 2024లో చాలా విశేషాలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి. అలాగే ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఎంతోమంది గూగుల్‌లో సెర్చ్ చేయబడ్డారు.
అయితే 2024లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ వ్యక్తుల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు? పవన్ కళ్యాణ్ సాధించిన రికార్డు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గూగుల్ సెర్చ్ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?
వినీష్ ఫోగట్
వినీష్ ఫోగట్ ఇండియాకు చెందిన ఒక రెజ్లర్. ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆమె కేవలం 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. బంగారు పథకం సాధిస్తుందనుకున్న సమయంలో ఆమెపై అనర్హత పాడడం యావత్ దేశాన్ని కలిసి వేసింది. దీంతో ఆమె గురించి ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేశారు. అలాగే ఒలింపిక్స్ నుంచి ఇంటికొచ్చిన ఆమెకు పలు ప్రభుత్వాలు బహుమతులు ప్రకటించాయి. దీంతో పాటు ఆమె 2024 హర్యానా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంతో ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో వినీష్ ఫోగట్ తొలి స్థానంలో నిలిచారు.
నితీష్ కుమార్
ఈ జాబితాలో బీహార్ సీఎం నితీష్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. నితీష్ కుమార్ బీహార్ కూటమి నుంచి బయటికొచ్చి ఇండియా కూటమి స్థాపనకు కృషి చేయడం, మళ్ళీ బీజేపీతో చేతులు కలిపి మళ్ళీ సీఎం అవ్వడం ఇలా అనేక ఘటనల కారణంగా ఆయన దేశంలో ఎక్కువ మంది సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆయన రెండో స్థానంలో నిలిచారు.
చిరాగ్ పాశ్వాన్
ఈ జాబితాలో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ మూడో స్థానంలో నిలిచారు. బీహార్‌లోని జముయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై కేంద్ర మంత్రుల జాబితాలో కూడా చోటు దక్కించుకోవడంతో ఆయన పేరును అత్యధికంగా సెర్చ్ చేయడం ప్రారంభించారు.
హార్దిక్ పాండ్యా
గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన పేర్ల జాబితాలో హార్దిక్ పాండ్య పేరు నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడం, అలాగే కుటుంబ పరమైన సమస్యల్లో చిక్కుకోవడంతో ఆయన వార్తల్లో నిలిచాడు. క్రికెట్, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయన నాలుగో స్థానంలో నిలిచారు.
పవన్ కళ్యాణ్
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిదో స్థానంలో నిలిచారు. అలాగే ప్రపంచంలో అత్యధికంగా సెర్చ్ చేసిన నటుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఏపీ ఎన్నికల్లో ఆయన రాణించడం, కేంద్ర రాజకీయాల్లో కూడా తనదైన పాత్ర పోషించడం వల్ల ఆయన పేరును అత్యధికంగా సెర్చ్ చేశారు.
శశాంక్ సింగ్
ఈ జాబితాలో ఆరో స్థానంలో పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ ఆరో స్థానంలో నిలిచారు. గత ఐపీఎల్ సీజన్‌లో అతను అద్భుతమైన ప్రదర్శన చేయడం, అలాగే ఈసారి ఆయన పంజాబ్ కెప్టెన్‌గా ఉండబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన పేరు గూగుల్ సెర్చ్ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.
పూనమ్ పాండే
భారత నటి, మోడల్ పూనమ్ పాండే ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. తాను క్యాన్సర్‌తో మరణించినట్లు వార్తలు పంచుకోవడంతో పాటు ఇతర రూమర్స్ కారణంగా ఆమె వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఎక్కువగా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
రాధికా మర్చంట్
అనంత్ అంబానీని పెళ్లి చేసుకున్న రాధికా మర్చంట్ పేరు కూడా ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన పేర్ల జాబితాలో ఉంది. అనంత్ అంబానీని పెళ్లి చేసుకోవడం కారణంగా ఆమె ఎవరు అని తెలుసుకోవడానికి చాలా మంది ఆమె పేరును గూగుల్ చేయడంతో అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాలో ఆమె పేరు వచ్చింది.



Click it and Unblock the Notifications