Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
చంద్రుడిపై లగ్జరీ హోటల్..బుకింగ్స్ స్టార్ట్..భూమిపై బోర్ కొడితే చందమామ దగ్గరికి!
మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మన పెద్దలు తరుచూ చెబుతూ ఉంటారు. దీనిని నిరూపించే సంఘటనలు అనేకం జరిగాయి కూడా. ఒకప్పుడు ఆరుబయట మంచంపై పడుకుని నక్షత్రాలను లెక్కబెడుతూ, ఆ చంద్రుడిని చూస్తూ అనేక కలలు కంటుండేవాళ్లం.
చందమామని చూపిస్తూ అన్నం తినిపించేవాళ్లు తల్లిదండ్రులు. ఏదో ఒక రోజు ఆ చందమామ దగ్గరికి వెళితే బాగుండు అని చాలామంది అనుకుంటారు. ఒకప్పుడు కేవలం కలగా మాత్రమే మిగిలిన చంద్రయానం, నేడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ పుణ్యమా అంటూ విలాసవంతమైన పర్యాటక యాత్రగా రూపుదిద్దుకుంటోంది.

అయితే చంద్రుడి మీదకు వెళ్లడమే కాదు అక్కడ ఓ హోటల్ లో కొద్దిరోజులు బస చేసే సౌకర్యం కూడా వచ్చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్(GRU Space)అనే స్టార్టప్ సంస్థ చంద్రుడి మీద ఒక హోటల్ కట్టేందుకు రెడీ అయ్యింది.
హోటల్ నిర్మాణ పనులు ప్రారంభం అప్పుడే
అయితే చంద్రుడిపై హోటల్ నిర్మాణ పనులు 2029లో ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. చందమామపై రేడియేషన్, విపరీతమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, చంద్రుని మట్టితోనే ప్రత్యేకమైన ఇటుకలను తయారు చేసే టెక్నాలజీని GRU Space కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
2032 నాటికల్లా చందమాద మీద ఉండే తమ హోటల్ కి అతిథులను తీసుకెళ్లాలని ఫ్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హోటల్ రూమ్స్ కు స్ంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అధికారికంగా స్టార్ట్ చేసింది.
హోట్ రూమ్ ధర వివరాలు
ప్రారంభ ఆఫర్ కింద ఒక్కొక్కరికి సుమారు రూ.2.2 కోట్లు కాగా, డిమాండ్ పెరిగే కొద్దీ ఈ ధర రూ.9 కోట్ల వరకు పెరుగుతుంది. ఇక ప్రయాణం, బస అంతా కలిపి ఈ అరుదైన ట్రిప్ విలువ సుమారు రూ.90 కోట్లు పైమాటే అని కంపెనీ చెబుతోంది.
కేవలం డబ్బుంటే సరిపోదు ప్రయాణికులు దాదాపు 1 లక్ష రూపాయలు నాన్ రీఫండబుల్ గా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత కఠినమైన మెడికల్ టెస్టులు, ఫైనాన్షియల్ చెకింగ్ వంటి వాటిల్లో పాస్ అయితేనే టికెట్ ఖరారవుతుంది.

ఈ ఐడియా వెనుక ఉన్నదెవరు
అమెరికాకు చెందిన స్కైలర్ చాన్ అనే 22 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ గ్యాడ్యుయేట్ 2025లో GRU స్పేస్ కంపెనీని ప్రారంభించాడు. చిన్నతనం నుంచి తనకు స్పేస్ అంశాలపై ఇష్టం ఉండేదని,తాను అసలు ఆస్ట్రోనాట్ కావాలి అనుకున్నానని, తనకు ఇష్టమైన వర్క్ ను చేస్తున్నందకు చాలా చాలా అదృష్టవంతుడిగా తనను తాను భావిస్తున్నట్లు చాన్ చెప్పారు.
మూన్ హోటల్ ప్రాజెక్ట్.. Y కాంబినేటర్ అనే ప్రసిద్ధ స్టార్ట్-అప్ యాక్సిలరేటర్ నుంచి పుట్టింది. స్పేస్ ఎక్స్, అండూరిల్ వంటి ప్రముఖ కంపెనీలతో సంబంధం ఉన్న ఇన్వెస్టర్ల నెంచి చాన్ ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ ప్రాజెక్ట్ విజయవంతమైతే కోట్ల మంది మానవ జీవితాలు చంద్రుడు, అంగారక గ్రహాలపై జన్మిస్తాయని చాన్ తెలిపారు.
ప్రస్తుతం ఈ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోయినా, భవిష్యత్తులో విమాన ప్రయాణంలాగే అంతరిక్ష ప్రయాణం కూడా చౌకగా మారవచ్చని, మరింత మంది జాబిల్లిపై అడుగుపెట్టవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications