Latest Updates
-
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది,ఇక్కడి జీవన విధానం ఎలా ఉంది?
మనదేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలని,అప్పుడే దేశం డెవలప్ అవుతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఇక పెళ్లాం పిల్లలు, ఫ్యామిలీ అంటూ ఏం లేకుండా గొడ్డులాగా ఆఫీసులో పనిచేస్తూనే ఉండాలా అంటూ సామాన్య ప్రజలు నారాయణ మూర్తి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి. దేశం అభివృద్ధి చెందాలంటే మానవ సంబంధాలను తగ్గించుకొని అన్ని గంటలు కష్టపడనక్కర్లేదు..సాధారణ పని గంటల్లో ఉద్యోగులు పనిచేస్తున్న బాగా డెవలప్ అయిన చాలానే ఉన్నాయని మరికొందరు నారాయణ మర్తికి కౌంటర్స్ ఇచ్చారు.
అయితే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 7 సార్లు సంతోషకరమైన దేశాల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది ఆ దేశం. ఆ దేశమే ఫిన్లాండ్. ఫిన్లాండ్ దేశ రాజకీయ వ్యవస్థ,పని వ్యవస్థ,విద్య, ఆరోగ్యం అన్నీ సూపర్. ఇక్కడి ప్రజల జీవనశైలి,అనుసరించే సాధారణ చిట్కాలు మిగతా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ దేశం ప్రత్యేకత ఏమిటి, ఇక్కడి ప్రజల జీవనశైలి ఇతర దేశాల కంటే ఎలా భిన్నంగా ఉంటుందో ఇక్కడ చూడండి.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఒత్తిడితో కూడిన జీవితం పెరుగుతోంది. ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి, పనివేళల కారణంగా సమస్య పెరుగుతోంది. అయితే ఫిన్లాండ్ దీనికి విరుద్ధంగా ఉంది. ఇక్కడి ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా 7 సార్లు అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారణంగా ఈ దేశ ప్రజల జీవనశైలి గురించి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ దేశంలో ప్రజలు సంతోషంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం ఇక్కడ పని సమయం. ఇక్కడ ప్రజలు తమ పని, వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. తల్లిదండ్రులు వారి కుటుంబాలు, పిల్లలతో సమయం గడపడానికి సెలవు ఇవ్వబడుతుంది. అలాగే ఇక్కడి ఉద్యోగులు పుష్కలమైన సెలవుల కారణంగా తమ కుటుంబాలతో ఆనంద క్షణాలను గడుపుతున్నారు. ఇది పరోక్షంగా కుటుంబ బంధాన్ని పెంచడానికి, ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
ఫిన్లాండ్ విద్యావ్యవస్థ కూడా బాగుంది. అంగన్‌వాడీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ ప్రజలకు ఉచిత విద్య లభిస్తుంది. అలాగే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సేవలు ఉచితం. అలాగే పురుషులు, మహిళలు కూడా ఇక్కడ సమాన ఉపాధి అవకాశాలను పొందుతారు.



Click it and Unblock the Notifications