Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తెలుగుదనం ఉట్టిపడే పండుగ..అట్ల తద్ది విషెస్ ఇలా అందంగా చెప్పుకోండి
తెలుగువాళ్లు ముఖ్యంగా మహిళలు,యువతులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అట్ల తద్ది. ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష తదియ నాడు అట్ల తద్ది పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ప్రధానంగా గౌరీ దేవిని పూజిస్తారు. రెండు ముఖ్య ఉద్దేశాలతో ఈ పండుగను జరుపుకుంటారు. పెళ్లి కానీ అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే గౌరి దేవి అనుగ్రహంతో మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు. పెళ్లయిన స్త్రీలు ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం సుఖంగా ఉంటాడని, దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటదని నమ్ముతారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అట్టతద్ది పండుగను జరుపుకుంటున్నారు.
ఈ పండుగకు ప్రత్యేకమైన నైవేద్యం అట్లు. 11 అట్లను నైవేద్యంగా పెడతారు. గౌరీ దేవి పూజ పూర్తయ్యాక 11 అట్లు, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు వంటి వాటిని ఒక ముత్తైదువుకు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్ది వాయనం అమ్మా, పుచ్చుకోండి అని అంటారు, పుచ్చుకున్న వారు నిత్య సుమంగళిగా వర్ధిల్లు అని దీవిస్తారు. ఈ పండుగలో ముఖ్యమైన వినోద అంశం ఊయల ఊగడం. చెట్లకు కట్టిన పెద్ద పెద్ద ఉయ్యాలల్లో ఊగుతూ, పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు. ఇవాళ అట్ల తద్ది సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు విషెన్ ను ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

అట్లతద్ది విషెస్ ఇలా చెప్పండి
-తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన అట్ల తద్ది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
-మీ దాంపత్య జీవితం సాఫీగా సాగాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ..అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ఈ అట్ల తద్ది పండుగ మీ ఇద్దరి బంధాన్ని మరింత బలంగా, మధురంగా మార్చాలని ఆశిస్తూ.. హృదయపూర్వక శుభాకాంక్షలు.
-మీ భర్త ఆయుష్షు పెరగాలని, మీరు వందేళ్లు సుఖంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ.. హ్యాపీ అట్ల తద్ది.
-చంద్రుడి వెలుగు మీ జీవితంలో కొత్త కాంతులు నింపాలని, నిండు నూరేళ్లు మీ బంధం పదిలంగా ఉండాలని కోరుకుంటూ... అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ప్రతి అట్ల తద్ది మీ ఇద్దరి మధ్య ప్రేమను, అనుబంధాన్ని రెట్టింపు చేయాలని ఆశిస్తూ..అట్ల తద్ది శుభాకాంక్షలు.
-మంచి భర్త లభించాలని కోరుకునే ప్రతీ ఆడపడుచు కల నెరవేరాలని, వైవాహిక జీవితాలు ఆనందమయం కావాలని కోరుకుంటూ అట్ల తద్ది శుభాకాంక్షలు.
-మీ వైవాహిక బంధానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, సంతోషకరమైన జీవితం మీ సొంతం కావాలని..అట్ల తద్ది పండుగ శుభాకాంక్షలు.
-ఊయల ఊపులా మీ జీవితం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాలని..అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ఈ వ్రతం మీ జీవితంలో కొత్త ఆనందాన్ని, కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలని..అట్ల తద్ది శుభాకాంక్షలు.
-అట్లు, వాయనాలు, పాటలు, ఆటలతో కూడిన ఈ పండుగ రోజున, మీ ఇంటిల్లిపాదికి అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ఈ పండుగ రోజున వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ, మన బంధాలను మరింత బలోపేతం చేసుకుందాం. హ్యాపీ అట్ల తద్ది.
-ఆటలు, పాటలు, సరదాలతో గడిపే ఈ పండుగ రోజున తెలుగు ఆడపడుచులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు.

-కొత్త పెళ్లి కూతుర్లకి, పెళ్లి కాని ఆడపిల్లలకి, సుమంగళిలకి..అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు.
-అట్ల తద్ది కేవలం వ్రతం కాదు, ఇది భార్యభర్తల అనుబంధానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక.
-శివపార్వతుల అనుగ్రహం, చంద్రుని చల్లని దీవెనలు మీ వైవాహిక జీవితానికి బలంగా నిలవాలని కోరుకుంటున్నాను. అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ఏ శుభకార్యానికైనా, బంధానికైనా ఆయుష్షు, ఆరోగ్యం ముఖ్యం. అట్ల తద్ది ఈ రెండింటినీ అందిస్తుంది.
-ఈ అట్ల తద్దికి మీ ఇల్లు సిరిసంపదలతో కళకళలాడాలని, ప్రతిరోజూ పండుగ వాతావరణమే ఉండాలని ఆశిస్తున్నాను.
-గౌరీ దేవి ఆశీస్సులతో మీరు, మీ ప్రియమైనవారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని.. అట్ల తద్ది శుభాకాంక్షలు.
-తెలుగుతనం ఉట్టిపడేలా, చీరకట్టు, అలంకరణతో సంప్రదాయాన్ని నిలబెట్టే ప్రతి ఆడపడుచుకి ప్రత్యేక అట్ల తద్ది శుభాకాంక్షలు.
-ఉమాదేవి ఆశీస్సులతో మీ జీవితం సకల శుభాలతో నిండిపోవాలని అట్ల తద్ది శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications