Latest Updates
-
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే!
Ayudha Puja Wishes 2025: జై భవానీ..ఆయుధ పూజ శుభాకాంక్షలను ఇలా అందంగా చెప్పుకోండి
హిందూ సంస్కృతిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఆయుధ పూజ ఒకటి. దసరా జరుపుకునే ఒరక్కరోజు ముందు ఆయుధ పూజ జరుపుకుం్టారు. ఆయుధ పూజ..మన జీవన ప్రయాణంలో మనకు తోడుగా నిలిచే ప్రతి వస్తువుకు కృతజ్ఞతలు తెలిపే ఒక గొప్ప ఉత్సవం. ఆయుధ పూజనాడు మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వాహనాలు, పరికరాలను పూజించడం ద్వారా జరుపుకుంటాం. ఈ ఏడాది అంటే 2025లో ఆయుధ పూజ అక్టోబర్ 1న వస్తుంది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు,సన్నిహితులకు పంపగల కొన్ని శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.
సాధారణ శుభాకాంక్షలు
-మీకు,మీ కుటుంబ సభ్యులకు ఆయుధ పూజ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.
-మన జీవితంలో విజయాన్ని అందించే ప్రతి పనిముట్టుకు వందనం. అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-ఈ ఆయుధ పూజ మీ ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పండుగ శుభాకాంక్షలు.

-శరన్నవరాత్రులలోని ఈ పవిత్రమైన రోజున అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీరు చేసే పనిలో నైపుణ్యం, మీ జీవితంలో విజయం కలగాలని కోరుకుంటూ మీకు ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మన జీవనోపాధికి ఆధారమైన ఆయుధాలను పూజించుకునే ఈ శుభదినాన అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను.
-పనిని దైవంగా, పనిముట్లను దైవ స్వరూపంగా భావించే ప్రతి ఒక్కరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-ఈ ఆయుధ పూజ మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, మీ కృషికి తగిన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.
సంప్రదాయబద్ధమైన శుభాకాంక్షలు
-దుర్గా మాత, సరస్వతీ మాత, లక్ష్మీ దేవి ఆశీస్సులతో మీ ఆయుధాలు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
-మహిషాసుర మర్దిని శక్తితో మీలోని చెడు నశించి, మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-అమ్మవారి చల్లని దీవెనలతో మీ పనిముట్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనిచేయాలని కోరుకుంటున్నాను.
-ఆ సరస్వతీ దేవి జ్ఞానాన్ని, ఆ లక్ష్మీ దేవి ధనాన్ని, ఆ దుర్గా మాత ధైర్యాన్ని మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ ఆయుధ పూజ.
-ఈ పవిత్ర దినాన మీ ఇంట ఆనందపు దీపాలు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వ్యాపారులకు, ఉద్యోగులకు
-మీ వ్యాపారంలో ఉపయోగించే ప్రతి పరికరం మీకు లాభాల పంట పండించాలని కోరుకుంటూ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ వృత్తిలో ఉన్నతిని, మీ వ్యాపారంలో అభివృద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ విజయదశమి, ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ కలం, మీ కంప్యూటర్, మీ ఆలోచనలు.. మీ విజయానికి ఆయుధాలు. అవి ఎల్లప్పుడూ పదునుగా ఉండాలని ఆకాంక్షిస్తూ హ్యాపీ ఆయుధ పూజ.
-మీ ఆఫీసులోని ప్రతి పరికరం మీకు శుభాన్ని, లాభాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-ఈ ఏడాది మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
-మీ శ్రమకు, మీ నైపుణ్యానికి గుర్తింపు లభించాలని ఆకాంక్షిస్తూ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ వ్యాపార ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి విజయపథంలో సాగాలని కోరుకుంటున్నాను.

విద్యార్థులకు
-పుస్తకాలే మీ ఆయుధాలు, జ్ఞానమే మీ బలం. సరస్వతీ దేవి కటాక్షంతో పరీక్షలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ కలం కత్తి కన్నా పదునుగా మారి మీ భవిష్యత్తును బంగారుమయం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
-చదువుల తల్లి సరస్వతీ దేవి ఆశీస్సులతో మీరు విజ్ఞానవంతులు కావాలని కోరుకుంటూ, ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ జ్ఞానమనే ఆయుధంతో అజ్ఞానమనే చీకటిని తొలగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
-మీ ప్రతిభకు పదును పెట్టి, విజయాలను సాధించాలని కోరుకుంటూ విద్యార్థి మిత్రులందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
డ్రైవర్లు, కార్మికులు, కళాకారులకు
-మీ వాహనమే మీ జీవనాధారం. అమ్మవారి దయతో మీ ప్రయాణాలు సురక్షితంగా, సాఫీగా సాగాలని కోరుకుంటూ, ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ చేతిలోని పనిముట్లు అద్భుతాలు సృష్టించాలని, మీకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభాకాంక్షలు.
-మీ స్టీరింగ్ తిప్పిన ప్రతిసారీ విజయం మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నాను. డ్రైవర్ సోదరులందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ చేతిరాత, మీ కుంచె, మీ ఉలి.. అన్నీ మీకు విజయాన్నే అందించాలి. కళాకారులందరికీ శుభాకాంక్షలు.
-మీ శ్రమకు తగ్గ ఫలితం మీ పనికి తగిన గౌరవం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

స్ఫూర్తిదాయకమైన కోట్స్
-ఆయుధం అంటే కేవలం కత్తి కాదు మనల్ని ఉన్నతంగా నిలిపే ప్రతీ వస్తువూ ఆయుధమే. వాటిని గౌరవిద్దాం.
-శ్రమకు దక్కిన గౌరవం ఈ ఆయుధ పూజ.
-పనిముట్టును పూజించడం అంటే మన వృత్తిని, మనల్ని మనం గౌరవించుకోవడమే.
-నీ లక్ష్యాన్ని ఛేదించే సాధనమే నీ అసలైన ఆయుధం. దానికి నమస్కరించు.
-కష్టపడి పనిచేసే చేతులకు, వాటికి సహకరించే ఆయుధాలకు ఇదే మా వందనం.
-ఆత్మవిశ్వాసం అన్నింటికన్నా గొప్ప ఆయుధం. దానిని ఎల్లప్పుడూ మీ వెంటే ఉంచుకోండి.
-సరైన ఆయుధాన్ని, సరైన సమయంలో వాడటమే విజయానికి రహస్యం.
-మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుడిచ్చిన ప్రతి అవకాశమూ ఒక ఆయుధమే.
-జ్ఞానం, ధైర్యం, నైపుణ్యం.. ఇవే మన అంతిమ ఆయుధాలు.
సోషల్ మీడియా కోసం
-అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-విజయానికి తొలిమెట్టు, మీ ఆయుధానికి వందనం.
-మీ పని, మీ జీవితం వర్ధిల్లాలి. హ్యాపీ ఆయుధ పూజ.
-అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-మీ వృత్తియే మీకు దైవం. ఆయుధ పూజ శుభాకాంక్షలు.
-శుభం, లాభం, విజయం..ఈ ఆయుధ పూజ మీకు అన్నీ అందించాలి.
-నైపుణ్యానికి వందనం, పనిముట్టుకు అభివందనం.
-జై భవాని. అందరికీ ఆయుధ పూజ, విజయదశమి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications











