హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా..

హిందువులు ఘనంగా జరుపుకునే పెద్ద పండుగల్లో దసరా ఒకటి. నవరాత్రులు అంటే తొమ్మదిరోజులు అమ్మవారిని నవదుర్గలుగా పూజించిన తర్వాత వచ్చే పదవ రోజే దసరా. దీనిని విజయదశమి అని కూడా పిలుస్తారు. లోకాలను పట్టిపీడించే మహిషాసురుడు అనే రాక్షసుడితో దుర్గామాత తొమ్మది రాత్రులు, పది పగళ్లు భీకర యుద్దం చేసి పదవ రోజున నరకాసురుడిని చంపేసింది. లోకకళ్యాణం కోసం దుర్గమ్మ సాధించిప ఈ విజయానికి గుర్తుగా నవరాత్రుల తర్వాత దసరాని జరుపుకుంటారు.

దసరా సాయంత్రం జమ్మి చెట్టుకు పూజ చేయడం తెలంగాణలో ముఖ్యమైన ఆచారం. దసరా రోజున జమ్మి ఆకును బంగారంగా భావించి బంధుమిత్రులు, పెద్దలకు ఇచ్చి వాళ్ల ఆశీర్వాదం తీసుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ష పక్ష దశమి తిథి నాడు దసరా పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరాని ఈ ఏడాది అక్టోబర్ 20(మంగళవారం) జరుపుకుంటారు. దసరా సందర్భంగా మీ కుటుంబసభ్యులు, దూరంగా ఉన్న బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

Happy Dussehra Wishes in Telugu 2026 Best Vijayadashami Quotes WhatsApp Status

సాధారణ శుభాకాంక్షల మెసేజ్ లు

-మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దసరా 2026 శుభాకాంక్షలు.

-ఈ విజయదశమి మీ లైఫ్ లో కొత్త వెలుగులు తీసుకురావాలని, సిరిసంపదలు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..హ్యాపీ దసరా 2026.

-ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ దసరా.

-నవరాత్రులు పుణ్యఫలం మీకు కలగాలని ప్రార్థిస్తూ..మీకు, మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు.

-జమ్మి ఆకు బంగారం మాదిరిగానే మీ జీవితం కూడా బంగారుమయం కావాలి. విజయదశమి 2026 శుభాకాంక్షలు.

-పాలపిట్ట దర్శనం లాగే మీ లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ దసరా 2026.

-విజయదశమి పర్వదినం మీ లైఫ్ లో కొత్త ఆశలకు నాంది పలకాలి, సంతోషాలు వెల్లివిరియాలి. హ్యాపీ దసరా.

-కనకదుర్గమ్మ శక్తి మీకు ఎల్లప్పుడూ తోడుండాలి. 2026 విజయదశమి శుభాకాంక్షలు.

-మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని దుర్గమ్మని ప్రార్థిస్తున్నా..హ్యాపీ దసరా.

-పాపాలను హరించే ఆ పరాశక్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. దసరా పండుగ శుభాకాంక్షలు.

-ఆయుధపూజ శుభాకాంక్షలు.మీ వృత్తిలో మరింత రాణించాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. హ్యాపీ దసరా

-బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు దసరా పండుగ శుభాకాంక్షలు.

సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్!సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్!

విజయదశమి కోట్స్

-ధర్మం ఎప్పుడూ జయిస్తుంది, అధర్మం అంతమవుతుంది. ఇదే విజయదశమి మానవాళికి ఇచ్చే గొప్ప సందేశం.

-నిజమైన విజయం అంటే ఇతరులను ఓడించడం కాదు, మనలోని చెడును జయించడం.

-దుర్గామాత శౌర్యం, పరాక్రమం ప్రతి మహిళలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపాలి.

-శక్తి స్వరూపిణి ఆరాధనతో మనసుకు శాంతి, జీవితానికి సార్థకత చేకూరుతుంది.

-మంచి మనసుతో చేసే ఏ ప్రయత్నానికైనా విజయదశమి రోజే శుభారంభం.

-బంగారం పంచుకుందాం, బంధాలను పెంచుకుందాం. అదే జమ్మి ఆకు పంపిణీలోని అంతరార్థం.

-విజయం వైపు అడుగులు వేయడానికి భయాన్ని వీడటమే మనం వేయాల్సిన తొలి మెట్టు.

Happy Dussehra Wishes in Telugu 2026 Best Vijayadashami Quotes WhatsApp Status

వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్ లు

-అందరికీ 2026 విజయదశమి శుభాకాంక్షలు.

-దుర్గామాత ఆశీస్సులు మనందరిపై చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.

-విజయదశమి అంటేనే విజయానికి తొలి అడుగు. అందరికీ సకల శుభాలు కలుగుగాక.

-మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయుధ పూజ శుభాకాంక్షలు.

-సత్యమే గెలుస్తుంది. ధర్మమే నిలుస్తుంది. విజయదశమి శుభాకాంక్షలు.

-శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు, సంతోషాలకు ఆరంభం.

-మనలోని కోపం, అసూయ, ద్వేషాలను దహనం చేద్దాం. ప్రేమను పంచుదాం. హ్యాపీ దసరా.

-అందరి ఇళ్లలో ఆనందాల సిరులు కురిపించే విజయదశమి శుభాకాంక్షలు.

-ఏ పని చేపట్టినా అందులో మీకు దిగ్విజయం కలగాలి. దసరా శుభాకాంక్షలు.

దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..

ఆధ్యాత్మిక మెసేజ్ లు

-మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడిన చాముండేశ్వరి మీ ఇంట కొలువై ఉండాలి. మీకు నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

-నవదుర్గల ఆశీస్సులు మీపై కురిసి, మీ ఆత్మకు శాంతి, మనసుకు అపారమైన ప్రశాంతత చేకూరాలి. జై మాతా దీ.

-త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరాయుగంలో పాండవులు విజయాలు సాధించిన ఈ పవిత్రమైన రోజు మీ జీవితంలో నూతన అద్భుతాలు సృష్టించాలి.

-ఆపదలను బాపే ఆపద్బాంధవి, దుర్గతులను నాశనం చేసే దుర్గామాత మీ కష్టాలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

-కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు అంతఃశత్రువులను జయించడమే నిజమైన ఆధ్యాత్మిక విజయం. హ్యాపీ దసరా.

-దసరా పండుగ రోజున జమ్మి చెట్టుని పూజిస్తే శని దోషాలు తొలగిపోయి, సర్వ కార్య సిద్ధి కలుగుతుంది. మీకు జమ్మి పూజ శుభాకాంక్షలు.

-సరస్వతీ దేవి కరుణతో మీకు జ్ఞానం, లక్ష్మీ దేవి దయతో సంపద, పార్వతీ దేవి ఆశీస్సులతో బలం చేకూరాలి. దసరా శుభాకాంక్షలు.

-దసరా అంటే దశ-హర (పది పాపాలను హరించడం). మీలోని ప్రతికూలతలు తొలగిపోయి దైవభక్తి వెల్లివిరియాలి.

-అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే జ్యోతితో పారద్రోలే ఆధ్యాత్మిక పర్వదినమే దసరా. భక్తితో అమ్మను కొలుద్దాం.

-ఆయుధాలను గౌరవించడం ద్వారా మన వృత్తిపట్ల, శ్రమపట్ల దైవభావాన్ని పెంచుకునేదే ఆయుధ పూజ పరమార్థం. అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు.

-అపరాజితా దేవిని ఈ రోజు స్మరించడం ద్వారా మీ జీవితంలో ఓటమి అన్నదే లేకుండా, సర్వత్రా జయం కలగాలని ప్రార్థిస్తున్నాను.

-ఈ విజయదశమి మీలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పి, సమాజానికి మేలు చేసే సత్కార్యాల వైపు నడిపించాలని ఆశిస్తున్నాను. దసరా 2026 శుభాకాంక్షలు.

Story first published: Monday, October 19, 2026, 17:13 [IST]
Desktop Bottom Promotion