Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హ్యాపీ కనుమ 2026..ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు ఇలా విషెస్ చెప్పండి
సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు.. పల్లె పచ్చదనానికి, రైతు కృతజ్ఞతకు నిలువుటద్దం కనుమ. భోగి మంటల వెచ్చదనం, మకర సంక్రాంతి లక్ష్మీ కళ తర్వాత వచ్చే కనుమ పండుగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మనిషికి ప్రకృతికి, ముఖ్యంగా రైతుకి పశువులకి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీక.
దీనిని పశువుల పండుగ అని పిలుస్తారు. గోమాతను పూజించడం, వ్యవసాయానికి సహకరించిన బసవన్నలను గౌరవించడం ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. కనుమ పండుగలో మరో ఆసక్తికరమైన విశేషం మాంసాహారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కనుమ రోజున మాంసాహారం వండటం ఆనవాయితీ. కనుమ నాడు కాకి కూడా ముక్క ముట్టకుండా ఉండదు అనేది పెద్దల సామెత.

ఈ ఏడాది జనవరి 16న కనుమ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ఆకట్టుకునే విషెస్ ఎలా పంపాలో ఇక్కడ చూడండి.
కనుమ విషెస్ ఇలా చెప్పండి
-సిరుల తల్లి గోమాతను పూజిస్తూ, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పవిత్ర పండుగ కనుమ. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 కనుమ శుభాకాంక్షలు.
-పాడిపంటలతో మీ ఇల్లు కళకళలాడాలని, కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ..కనుమ శుభాకాంక్షలు.
-పశుసంపదను దైవంగా భావించే మన సంస్కృతికి ప్రతీక కనుమ. ఈ పండుగ మీ ఇంట సిరుల పంట పండించాలి.
-రైతన్నకు అండగా నిలిచే మూగజీవాలకు వందనం చేసే రోజే కనుమ. అందరికీ శుభాకాంక్షలు.
-గోమాత ఆశీస్సులతో మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశిస్తూ.. కనుమ శుభాకాంక్షలు.
-మట్టి మనుషుల కష్టానికి, మూగ జీవాల సాయానికి నిలువుటద్దం ఈ కనుమ. అందరికీ పండుగ శుభాకాంక్షలు.
-సంక్రాంతి సందడిని రెట్టింపు చేస్తూ వచ్చిన కనుమ..మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి.
-పల్లె కోనల్లో పశువుల పండుగ.. ప్రతి ఇంట్లో ఆనందాల పండుగ. హ్యాపీ కనుమ 2026.
-భోగి మంటల వెలుగులు, సంక్రాంతి సిరులు, కనుమ కమ్మని విందులు.. మీ జీవితాన్ని ఆనందమయం చేయాలి.
-గాలిపటాల సందడి ముగిసింది.. ఇక ప్లేట్లలో నాన్ వెజ్ యుద్ధం మొదలవ్వాలి. కనుమ శుభాకాంక్షలు మిత్రమా.
-సంక్రాంతి పిండివంటలు ఒక ఎత్తైతే.. కనుమ నాడు తినే ముక్కల పులుసు మరో ఎత్తు. ఎంజాయ్ చేయండి.
-పండగ అంటే బట్టలు, పిండివంటలే కాదు.. దోస్తులతో కలిసి తినే విందు భోజనం కూడా. 2026 కనుమ శుభాకాంక్షలు.
-అల్లుళ్ల మర్యాదలు, కోడి పందెం జోరు, కమ్మని విందు భోజనం.. కనుమ అంటేనే హుషారు. హ్యాపీ కనుమ.

-క్యాలరీల గురించి మర్చిపో.. కనుమ విందులో మునిగిపో. శుభాకాంక్షలు.
-సంక్రాంతికి చుక్కలు చూసాం.. కనుమకి ముక్కలు తిందాం. రండి కుమ్మేద్దాం.
-ఊరంతా సందడి.. మన ప్లేట్ నిండా నాన్-వెజ్.. ఇంతకన్నా ఏం కావాలి? హ్యాపీ కనుమ.
-పండగ మూడు రోజుల్లో అసలైన మజా ఇచ్చేది కనుమ మాత్రమే. లెట్స్ సెలబ్రేట్.
-కోడి కూర, గారెలు.. మీ ఇంట ఘుమఘుమలాడాలి. నోరూరించే కనుమ శుభాకాంక్షలు.
-రైతు లేనిదే రాజ్యం లేదు.. పశువు లేనిదే పంట లేదు. వ్యవసాయానికి వెన్నెముకైన జీవాలకు వందనం. కనుమ శుభాకాంక్షలు.
-పొలాల గట్ల మీద పచ్చని పైరు గాలి.. పశువుల మెడలోని గంటల సవ్వడి.. అదే మన పల్లె సంస్కృతి. అందరికీ కనుమ శుభాకాంక్షలు.
-నాగలి పట్టే చేతులకు, బండి లాగే కాళ్లకు పాదాభివందనం. హ్యాపీ కనుమ 2026.
-మీకు, మీ కుటుంబానికి 2026 కనుమ శుభాకాంక్షలు.
-అందరికీ ఆనందకరమైన కనుమ పండుగ శుభాకాంక్షలు.
-అరిసెలు తిన్నాం సంక్రాంతికి.. గారెలు తిందాం కనుమకి. శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications