Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా!
శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ పవిత్రమైన రోజునే మనం శ్రీ కృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి లేదా గోకులాష్టమిగా జరుపుకుంటాము. ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఇవాళ( సెప్టెంబర్ 4)న జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి కృష్ణుడి జనన సమయానికి పూజలు చేస్తారు. చిన్నారులకు కృష్ణుడి, రాధల వేషాలు వేసి మురిసిపోతారు. ఉట్టి కొట్టడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ.
కర్మ చేయడమే మన వంతు, ఫలితాన్ని ఆశించకూడదు అనే గొప్ప జీవిత సత్యాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. కృష్ణుడి బాల్య లీలలు, గోపికలతో ఆటలు, యశోదమ్మ వాత్సల్యం, రాధతో ప్రేమ.. ఇవన్నీ భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉండే స్వచ్ఛమైన బంధాన్ని తెలియజేస్తాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు విషెస్ ఎలా తెలియజేయాలో ఇక్కడ చూడండి.

ఆధ్యాత్మిక విషెస్ ఇలా చెప్పండి
-శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ.. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
-మురళీధరుని వేణుగానం మీ ఇంట సంతోషాలను, ప్రశాంతతను నింపాలి. హ్యాపీ జన్మాష్టమి 2026.
-ధర్మాన్ని రక్షించే ఆ పరమాత్మ మీ కష్టాలన్నింటినీ తొలగించాలని ఆకాంక్షిస్తూ.. 2026 జన్మాష్టమి శుభాకాంక్షలు.
-వెన్నదొంగ మీ కష్టాలను దొంగిలించి, సకల సంతోషాలను ప్రసాదించాలి. హ్యాపీ కృష్ణాష్టమి 2026.
-కృష్ణం వందే జగద్గురుమ్.. మీకందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు.
-చిన్ని కృష్ణుడి అడుగులు మీ ఇంట సిరుల వర్షం కురిపించాలి. శుభ కృష్ణాష్టమి.
-గోపికాలోలుని కృపతో మీ జీవితం మధురంగా మారాలి.
-అంధకారం తొలగి, మీ ఇంట కృష్ణ జ్యోతి వెలగాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు.

శ్రీకృష్ణుని స్ఫూర్తిదాయక కోట్స్
-నీ కర్మను నువ్వు చేయి, ఫలితాన్ని నాపై వదిలేయ్- భగవద్గీత సందేశంతో కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
-ధర్మం ఎక్కడైతే ఉంటుందో, అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఉన్నచోట విజయం తథ్యం. హ్యాపీ కృష్ణాష్టమి 2026.
-కష్టాలు శాశ్వతం కాదు, కృష్ణుడిపై మనం చూపే భక్తి మాత్రమే శాశ్వతం.
-భగవద్గీత కేవలం ఒక పుస్తకం కాదు, జీవన వేదం. గీతాచార్యుని పుట్టినరోజు శుభాకాంక్షలు.
-మనస్సును అదుపులో ఉంచుకున్నవాడికి ప్రపంచమే దాసోహం అవుతుంది. హ్యాపీ జన్మాష్టమి.
-తప్పును ఎదిరించడం అధర్మం కాదు, అదే అసలైన ధర్మం. హ్యాపీ కృష్ణాష్టమి.

కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం విషెస్
-నా ప్రియమైన మిత్రులకు, కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు.
-మన బంధం రాధాకృష్ణుల ప్రేమంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ కృష్ణాష్టమి 2026.
-చిన్ని కృష్ణుడి చిలిపితనం మీ ఇంట నవ్వుల పువ్వులు పూయించాలి. హ్యాపీ కృష్ణాష్టమి.
-ఈ 2026 జన్మాష్టమి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
-వెన్న దొంగిలించిన కన్నయ్య, మన బాధలను దూరం చేయాలి. హ్యాపీ జన్మాష్టమి.
-నా ఆత్మీయులందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ... గోకులాష్టమి శుభాకాంక్షలు.
-ఉట్టి కొట్టే ఉత్సాహం మీ జీవితంలో ఎప్పటికీ తగ్గకూడదు మిత్రమా! హ్యాపీ జన్మాష్టమి.
-కృష్ణుడి లాంటి నీ స్నేహం దొరికినందుకు ఆనందిస్తూ.. హ్యాపీ జన్మాష్టమి.
-మా ఇంట వెలసిన చిన్ని కృష్ణులకు, పెద్దలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.

వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్ లు
-మురళీ లోలుడు, నంద కిశోరుడు మీ ఇంట ఆనందాలు నింపాలి. హ్యాపీ జన్మాష్టమి 2026
-కృష్ణం వందే జగద్గురుమ్..అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
-మాయదారి కన్నయ్య నా మనసు దోచాడయ్యా. హ్యాపీ గోకులాష్టమి.
-ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హ్యాపీ జన్మాష్టమి
-నల్లని వాడైనా, నా ఎదలో కొలువైన దేవుడు శ్రీకృష్ణుడు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
-చిన్ని కృష్ణుడి పాదాలు మీ ఇంట అష్టైశ్వర్యాలు తీసుకురావాలి. హ్యాపీ జన్మాష్టమి 2026.



Click it and Unblock the Notifications