Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
Maha Shivratri Wishes: ఈశ్వర అనుగ్రహం పొందేలా..మీ బంధుమిత్రులకు మహాశివరాత్రి విషెస్ ఇలా చెప్పండి!
మహా శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. 2026 సంవత్సరంలో మహా శివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు రావడం విశేషం. ఆదివారం సూర్యునికి ప్రతీక, శివుడు అగ్ని స్వరూపుడు. ఈ రోజున చేసే శివారాధన వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, తేజస్సు, శక్తి లభిస్తాయని నమ్మకం. ఈ రోజు శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవ కాలం ఎంతో శక్తివంతమైనవి.
శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం,జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని,పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు పంపగలిగే కొన్ని అద్భుతమైన శుభాకాంక్షల మెసేజ్ లు, కోట్స్ ఇక్కడ చూడండి.

సాంప్రదాయక శుభాకాంక్షలు ఇలా
-2026 మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
-ఈ మహా శివరాత్రి పర్వదినాన మీ కష్టాలన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ..శివరాత్రి శుభాకాంక్షలు.
-ఓం నమః శివాయ! భోళా శంకరుని దయతో మీ జీవితంలో వెలుగులు నిండాలి. హ్యాపీ మహా శివరాత్రి 2026.
-పరమశివుడు మీ జీవితాల నుండి అన్ని అడ్డంకులను తొలగించి, మీకు శాంతి, ఆనందాన్ని కలిగించుగాక. మహా శివరాత్రి 2026 శుభాకాంక్షలు.
-లయకారుడైన శివుడు మీలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-హర హర మహాదేవ్! శివుని నామస్మరణతో మీ పాపాలు తొలగి, పుణ్యం ప్రాప్తించుగాక.
-గరళాన్ని మింగి లోకాలను కాపాడిన నీలకంఠుడు, మీ కష్టాలను కూడా మింగేసి మీకు సంతోషాన్ని ఇవ్వాలి. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం అనేది ఈశ్వరుడి ప్రత్యేకత. అంతటి సర్వశక్తిమంతుడైన శివయ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మహా శివరాత్రి 2026.
-హర హర మహదేవ శంబో శంకర..ఇహపరముల నేలే జయ జగదీశ్వర..కోరిన వాళ్ల కోర్కెలను తీర్చేటి శివుడి చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ మీకు, మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి 2026 శుభాకాంక్షలు.
-శివయ్య అనుగ్రహంతో మీరు తలపెట్టిన ప్రతి పని విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
-కైలాసవాసుని కరుణాకటాక్షాలు మీపై ఎల్లప్పుడూ వర్షించాలి. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-ఉపవాసం, జాగరణలతో ఆ పరమేశ్వరుని కొలిచే భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి.
-ఈ పవిత్రమైన రోజున శివలింగానికి చేసే అభిషేకం, మీ జీవితాన్ని పవిత్రం చేయుగాక.

స్ఫూర్తిదాయకమైన కోట్స్
-శివుడు అంటే శూన్యం, శివుడు అంటే అనంతం. ఆ అనంతమైన శక్తి మీలో నిండాలి.
-సమస్యల విషాన్ని మింగేవాడే నిజమైన శివుడు. మీలో ఆ ధైర్యం నిండాలని కోరుకుంటూ.. శివరాత్రి శుభాకాంక్షలు.
-మనసును శివునిపై లగ్నం చేస్తే, భయాలన్నీ మాయమవుతాయి. ఓం నమః శివాయ.
-శివుడు అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు. స్వచ్ఛమైన మనసుతో చేసే ప్రార్థనే ఆయనకు ఇష్టం.
-కోపం, కామం, అహంకారం అనే మలినాలను దహించి వేయడమే నిజమైన శివరాత్రి.
-ధ్యానం ద్వారా శివుని చేరుకోవచ్చు. ఈ రాత్రి మీ అంతరంగంలోని దైవాన్ని దర్శించండి.
-మూడు కన్నుల స్వామి మీ మూడో కన్నును (జ్ఞాన నేత్రాన్ని) తెరిపించుగాక.హ్యాపీ మహా శివరాత్రి.
-సృష్టి, స్థితి, లయ కారకుడు ఆ శివుడే. అంతా ఆయనే అని నమ్మిన వారికి ఏ భయముండదు.
-భక్తితో బిల్వపత్రం సమర్పిస్తే చాలు, పొంగిపోయే భోళాశంకరుడు మనకు తోడుగా ఉండుగాక.
-నిశ్శబ్దంలోనే శివుడు ఉంటాడు. ఈ శివరాత్రి నాడు మౌనంగా ఆయన్ను ధ్యానించండి.
ఫ్రెండ్ప్, ఫ్యామిలీకి ఇలా విష్ చేయండి
-నా ప్రియమైన మిత్రులకు, కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. మన బంధం శివపార్వతుల అనుబంధంలా దృఢంగా ఉండాలి.
-మిత్రమా! ఈ శివరాత్రి నీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.
-మన కుటుంబంపై సదా ఆ పరమేశ్వరుని చల్లని చూపు ఉండాలి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
-శివుని డమరుక నాదం మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపాలి. హ్యాపీ శివరాత్రి మై డియర్ ఫ్రెండ్.
-ఈ పండుగ రోజున మన స్నేహం మరింత బలపడాలని ఆ శివుని కోరుకుంటున్నాను.
-మీ ఇంట సిరిసంపదలు తాండవించాలి, కష్టాలు కరిగిపోవాలి. శివరాత్రి శుభాకాంక్షలు.
-గంగాధరుడు మీ ఇంట ఆనందాల గంగను ప్రవహింపజేయాలి.
-మిత్రమా, శివుని ధ్యానంలో మునిగి, ఆనందాన్ని పొందు. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-అమ్మ నాన్నలకు,కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
-దూరాన ఉన్నా, నా ప్రార్థనలు ఎప్పుడూ మీ క్షేమం కోసమే. శివుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

వాట్సాప్ స్టేటస్
-ఓం నమః శివాయ!
-శివోహం... శివోహం!
-హర హర మహాదేవ్..శంభో శంకర!
-జై బోలోనాథ్! అందరికీ శుభం కలగాలి.
-ఈ రాత్రి శివ నామస్మరణతో పునీతమవుదాం.
-ఆ ఆదియోగీ ఆశీస్సులు మనందరికీ ఉండాలి.
-నా ఊపిరి.. నా ప్రాణం.. ఆ శివయ్యే!
-శివుని నమ్ము.. ధైర్యంగా అడుగులు వెయ్యి.
-మహా శివరాత్రి శుభాకాంక్షలు 2026.
-కర్పూర గౌరం కరుణావతారం!.

భక్తిరస సందేశాలు
-ఓ జంగమా.. ఓ లింగమా.. పక్కనే పార్వతమ్మా.. తలపై గంగమ్మ.. మెడలో సర్పమా.. బూడిద దేహమా.. సిగలో చందమామ.. స్రుష్టినే స్రుష్టించగల దైవమా.. మాఘ మాసంలో మళ్లీ పుట్టిన పరమాత్ముని ఆశీస్సులతో మీరు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి 2026 శుభాకాంక్షలు.
-త్రినేత్రుడు, త్రిశూలధారి అయిన ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుగాక.
-విభూతి ధారణ, రుద్రాక్ష మాల.. శివ నామస్మరణే ముక్తికి మార్గం. హ్యాపీ మహా శివరాత్రి.
-మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే.. ఆ మృత్యుంజయుడు మీకు దీర్ఘాయుష్షుని ప్రసాదించుగాక.
-శివయ్య అంటేనే ప్రేమ, శివయ్య అంటేనే నమ్మకం. ఆ నమ్మకంతో ముందడుగు వేయండి.
-ఈ జాగరణ రాత్రి, మీ అంతరాత్మను మేల్కొలిపే రాత్రి కావాలి.
-బిల్వార్చనతో శివుని ప్రీతి చేసుకుందాం, కోటి జన్మల పుణ్యాన్ని పొందుదాం.
-ఆదిదేవుని ఆరాధనతో మీ మనసు ప్రశాంతంగా మారాలి. శుభ శివరాత్రి.
-నందీశ్వరుని వాహనుడు, నాగులను ధరించిన వాడు, మన భయాలను పారద్రోలుతాడు.
-పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం.. లోక కళ్యాణం. మీకు అంతా మంచే జరగాలి.
-కాశీ విశ్వేశ్వరుని కృప మీపై సదా ఉండుగాక.
కవితాత్మక విషెస్
-శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..ఆయన దయ ఉంటే ఏ కష్టమూ మనల్ని తాకదు.
-కైలాసం ఆయన నివాసం.. మన మదిలో ఉంటే అది ఆనంద విలాసం. హ్యాపీ శివరాత్రి.
-ఢమ ఢమ మోగెను డమరుకం.. పారిపోవును పాపపు అంధకారం.
-గంగను తలపై మోసిన వాడు..మన భారాలను కూడా మోస్తాడు. నమ్మకంతో వేడుకో.
-రుద్రాక్ష ధరిద్దాం.. రుద్రుని స్మరిద్దాం..ముక్తిని పొందుదాం.
-అభిషేకంతో ఆనందించే శివయ్య..మా కష్టాలన్నీ తీర్చయ్య.
-వెన్నెల కాంతులు, శివుని విభూతి రేఖలు.. మీ జీవితంలో నింపాలి సుఖసంతోషాలు.
-హాలాహలం మింగింది లోకం కోసం.. ఆ శివుని కొలుద్దాం మన మేలు కోసం.



Click it and Unblock the Notifications











