Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
Republic Day Wishes: హ్యాపీ రిపబ్లిక్ డే 2026..మీ కుటుంబ సభ్యులకు,ఫ్రెండ్స్ కు పంపాల్సిన బెస్ట్ విషెస్
బ్రిటీష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిప్పటికీ మనకంటూ సొంత పరిపాలనా విధానం, చట్టాలు పూర్తిగా అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26నే. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించిన భారత రాజ్యాంగం ఈ రోజు నుండే అమల్లోకి వచ్చింది.
అప్పటి నుండి భారతదేశం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందుకే ఈ రోజును మనం రిపబ్లిక్ డే గా జరుపుకుంటాం. దేశ పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించి, ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం చెప్పిన రోజు ఇది.

సోమవారం(జనవరి 26,2026)భారతదేశం 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటున్న సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి, సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ కి రిపబ్లిక్ డే విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి
రిపబ్లిక్ డే విషెస్ చెప్పండిలా
-మీకు, మీ కుటుంబ సభ్యులకు 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
-దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్.. మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేదే ఈ గణతంత్ర దినోత్సవం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-మన స్వేచ్ఛ వెనుక ఎందరో వీరుల త్యాగం ఉంది. వారిని స్మరించుకుంటూ..77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
-స్వేచ్ఛ మన హక్కు, బాధ్యత మన కర్తవ్యం. హ్యాపీ రిపబ్లిక్ డే 2026.
-రాజ్యాంగం మనకు కేవలం హక్కులనే కాదు, బాధ్యతలను కూడా నేర్పింది. బాధ్యత గల పౌరులుగా ఉందాం. హ్యాపీ రిపబ్లిక్ డే 2026.
-కులమతాల బేధాలు వీడి, భారతీయతను చాటుదాం. జై హింద్.
-స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు, దృఢమైన విశ్వాసం.. ఇదే మన దేశానికి నిజమైన బలం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-శాంతి, సామరస్యలే మన దేశానికి పునాదులు. ఆ పునాదులను కాపాడుకుందాం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం..ఇవే మన రాజ్యాంగ మూలస్తంభాలు. హ్యాపీ రిపబ్లిక్ డే.
-మూడు రంగుల జెండా.. జాతికి అండ.. మనందరి గుండె.. జై భారత్.

-ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది.. భారతీయుడిగా పుట్టినందుకు గర్విద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-భారతదేశం కేవలం ఒక దేశం కాదు, అది ఒక భావోద్వేగం. హ్యాపీ రిపబ్లిక్ డే 2026.
-2026 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
-భిన్నత్వంలో ఏకత్వం.. అదే నా భారతదేశం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-మన జెండా.. మన గర్వం. హ్యాపీ రిపబ్లిక్ డే 2026.
-స్వేచ్ఛా భారతవనిలో స్వేచ్ఛా పౌరులం మనం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-సగర్వంగా జరుపుకుందాం.. 77వ గణతంత్ర వేడుకలు.
-మనమంతా కలిసి నవ భారతాన్ని నిర్మిద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే.
-చట్టాన్ని గౌరవిద్దాం.. దేశాన్ని ప్రేమిద్దాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
-ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశం మనది. జై హింద్.
-హక్కులతో పాటు బాధ్యతలు కూడా నెరవేర్చినప్పుడే నిజమైన పౌరులం అవుతాం.
-ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
-కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు.. మనమంతా ఒక్కటే. జై హింద్. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.
-సారే జహా సే అచ్చా.. హిందుస్తాన్ హమారా. జై హింద్.. జై భారత్.



Click it and Unblock the Notifications