Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హ్యాపీ సంక్రాంతి 2026..ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు ఇలా విషెస్ చెప్పండి
మంచు కురిసే వేళ.. గొబ్బెమ్మల అందాలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పిండివంటల ఘమఘమలు.. ఇవన్నీ కలిస్తే వచ్చే పండుగే సంక్రాంతి. తెలుగు వారికి ఇది కేవలం ఒక పండుగ కాదు, ఒక భావోద్వేగం. పెద్ద పండుగగా పిలుచుకునే ఈ సంక్రాంతి, మన మట్టి వాసనలను, రైతు కష్టాన్ని, కుటుంబ బంధాలను గుర్తుచేసే అద్భుతమైన వేడుక.
సంక్రాంతి అంటేనే పంటల పండుగ. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి, ధాన్యపు రాశులు ఇంటికి చేరే సమయం ఇది. రైతుల కళ్ళలో సంతృప్తి, ఇంటా బయటా పచ్చదనంతో కళకళలాడే పండుగ ఇది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలమే ఈ మకర సంక్రాంతి. చీకటిని పారద్రోలి, వెలుగును పంచే ఉత్తరాయణ పుణ్యకాలం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది.

ఈ ఏడాది జనవరి 15న సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ఆకట్టుకునే విషెస్ ఎలా పంపాలో ఇక్కడ చూడండి.
సంక్రాంతి విషెస్ ఇలా చెప్పండి
-ఈ సంక్రాంతి మీ ఇంట సిరుల పంట పండించాలి, కనకపు వర్షం కురిపించాలి. 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీకు ఆ దేవుడు ప్రసాదించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-సూర్య భగవానుడి ఆశీస్సులతో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలి. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
-సిరుల పంటలు ఇంటికి చేరే వేళ, ఆనందాల అరిసెలు రుచి చూసే వేళ... సంక్రాంతి లక్ష్మి మీ ఇంట కొలువుండాలి.
-భోగి మంటల వెచ్చదనం, సంక్రాంతి పచ్చదనం, కనుమ సరదాలు... మీ జీవితంలో ఎప్పుడూ నిండాలి. 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
-రంగురంగుల ముగ్గులు వాకిట మెరవగా, గాలిపటాలు నింగిన ఎగరగా.. ఆనందాల హరివిల్లు మీ ఇంట విరియాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-పాత జ్ఞాపకాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో ఈ సంక్రాంతిని ఆహ్వానిద్దాం. మీకు, మీ కుటుంబానికి 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఆకాశంలో ఎగరే గాలిపటంలా.. మీ ఆశయాలు, ఆనందాలు ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉండాలి. హ్యాపీ సంక్రాంతి 2026.
-చెరుకు గడల తీపి, బెల్లం పాకం కమ్మదనం..మీ మాటల్లో, బంధాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో చీకట్లను తొలగించి, విజయాల వెలుగులను ప్రసాదించాలని కోరుకుంటూ... పండుగ శుభాకాంక్షలు.
-హరిదాసు కీర్తనలు, బసవన్న దీవెనలు, ఇల్లాలు ముగ్గులు, పిండివంటల ఘుమఘుమలు.. ఇదే కదా మన పండుగ సంబరాలు..సంక్రాంతి శుభాకాంక్షలు.
-పంట చేల కళకళలు, రైతన్నల మొహాల్లో చిరునవ్వులు.. దేశమంతా సుఖసంతోషాలతో ఉండాలి. జై కిసాన్.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-గాలిపటం దారం తెగినా పర్లేదు కానీ..మన బంధాల దారం ఎప్పటికీ తెగకూడదు. నా ప్రియమైన మిత్రునికి సంక్రాంతి శుభాకాంక్షలు.

-కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్లు, బంధుమిత్రుల రాకతో మీ ఇల్లు కళకళలాడాలి. హ్యాపీ సంక్రాంతి.
-మీ కష్టాలన్నీ భోగి మంటల్లో కాలిపోవాలి, మీ విజయాలు సంక్రాంతి కాంతుల్లా వెలిగిపోవాలి.
-ముత్యాల ముగ్గులతో, రత్నాల గొబ్బెమ్మలతో మీ లోగిలి స్వర్గాన్ని తలపించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఈ మకర సంక్రమణం..మీ జీవితంలో సరికొత్త గమనం, అద్భుతమైన విజయం తీసుకురావాలి.
-ప్రకృతిని పూజించే పండుగ, పశుపక్ష్యాదులను ప్రేమించే పండుగ, మన సంస్కృతిని చాటే పండుగ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-మీ ముఖంలో చిరునవ్వు, మీ గుండెలో ఆనందం, ఈ సంక్రాంతి తెచ్చే గొప్ప వరం. పండుగ శుభాకాంక్షలు.
-నువ్వులు, బెల్లం కలిపి తిందాం.. తీయటి మాటలే మాట్లాడుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఉత్తరాయణ పుణ్యకాలం మీ జీవితంలో పుణ్యఫలాలను, ప్రశాంతతను అందించాలి.
-ఆనందాల హరివిల్లు, అనురాగాల లోగిలి.. అదే మన సంక్రాంతి పండుగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
-గంగిరెద్దుల సవ్వడి, ముగ్గుల సందడి... తెలుగు వారిగింట పండుగ వచ్చిందండి. హ్యాపీ సంక్రాంతి 2026.
-కాలం మారినా, ఏళ్లు గడిచినా.. మన సంప్రదాయాల గొప్పతనం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు.
-దూరంగా ఉన్నా మనసు దగ్గరగా ఉండాలి... ఈ పండుగ మన బంధాన్ని మరింత గట్టిపరచాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-2026 సంక్రాంతి మీ ఆశయాలకు రెక్కలు తొడగాలి, మీరు అనుకున్నది సాధించాలి.
-బంగారు పంటలు చేతికి వచ్చే వేళ, రైతు కళ్ళలో ఆనందం చూసే వేళ.. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఈ పండుగ మీ ఇంట నవ్వుల పువ్వులు పూయించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-గతం తాలూకు చేదు జ్ఞాపకాలను వదిలేసి, భవిష్యత్తు వైపు తీయటి అడుగులు వేద్దాం. హ్యాపీ సంక్రాంతి.
-మట్టిని నమ్ముకున్న రైతన్నకు, మనుషులని నమ్ముకున్న మీ అందరికీ..సంక్రాంతి శుభాకాంక్షలు.
-మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం ఈ సంక్రాంతి. ఈ పండుగను ఘనంగా జరుపుకుందాం.
-స్నేహం అనే దారంతో, ప్రేమ అనే గాలిపటాన్ని ఎగురవేద్దాం. మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
-కష్టాల కారుమబ్బులు విడిపోవాలి, సుఖాల సూర్యుడు ఉదయించాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.
-ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలని కోరుకుంటూ.. 2026 సంక్రాంతి శుభాకాంక్షలు.
-సంక్రాంతి లక్ష్మి మీ ఇంటి తలుపు తట్టాలి, దారిద్ర్యం మీ ఇంటి నుండి పారిపోవాలి.
-కొత్త సంవత్సరం, కొత్త పండుగ, కొత్త ఆశలు..అన్నీ నెరవేరాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications