Happy Teachers Day 2025: గురువు అంటే గూగుల్ కన్నా గొప్పవాడు..టీచర్స్ డే విషెస్ ను ఇలా అందంగా చెప్పండి

మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ.. మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అంతటి ఉన్నత స్థానం గురువులకే ఇచ్చారు. మనల్ని అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి నడిపించే దీపస్తంభాలు ఉపాధ్యాయులు. అలాంటి గొప్ప గురువులను స్మరించుకోవడానికి, వారి సేవలను గౌరవించుకోవడానికి జరుపుకునే పండుగే ఉపాధ్యాయ దినోత్సవం. భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజు మన దేశ రెండవ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి.

ఒకసారి ఆయన విద్యార్థులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరపాలని కోరగా, దానికి ఆయన ఎంతో వినమ్రంగా ఇలా సమాధానమిచ్చారు. నా పుట్టినరోజును ఘనంగా జరపడం కంటే, ఆ రోజును ఉపాధ్యాయులందరినీ గౌరవించే దినంగా జరుపుకుంటే నేను ఎంతో గర్విస్తాను అని అన్నారు. ఆ ఉన్నతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ రోజున దేశవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థులు తమ గురువులకు పువ్వులు, బహుమతులు ఇచ్చి వారి పట్ల తమ కృతజ్ఞతను, ప్రేమను చాటుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో గురువుల గొప్పతనాన్ని కొనియాడుతారు. ఇది కేవలం ఒకరోజు వేడుక కాదు, మన జీవితాంతం మన గురువులు నేర్పిన విలువలను గుర్తుచేసుకునే ఒక గొప్ప సందర్భం. డబ్బు సంపాదించడం ఎలాగో ఎవరైనా నేర్పుతారు, కానీ ఎలా జీవించాలో నేర్పేవారే నిజమైన గురువు. మన జీవితాలను వెలిగించిన ఆ జ్ఞానజ్యోతులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం. విద్య నేర్పిన ప్రతి గురువుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుదాం.

happy teachers day 2025 wishes messages quotes whatsapp status in telugu

టీచర్స్ డే విషెస్ ఇలా అందంగా చెప్పండి

-మా భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన మీరే మా నిజమైన హీరో. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

-జ్ఞానమనే వెలుగును పంచి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించిన గురువులకు పాదాభివందనం. హ్యాపీ టీచర్స్ డే.

-మట్టిలాంటి మమ్మల్ని మహోన్నత శిల్పాలుగా తీర్చిదిద్దిన మీకు హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-కేవలం పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-మీరు చూపిన మార్గం, మీరు నేర్పిన పాఠం, మా జీవితాంతం మాతోనే ఉంటాయి. మీకు మా కృతజ్ఞతలు.

-ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక ఉపాధ్యాయుడు ఈ ప్రపంచాన్ని మార్చగలరు. ఆ మార్పుకు కారణమైన మీకు శుభాకాంక్షలు.

-అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. మా జీవితాన్ని ప్రకాశవంతం చేసిన మీకు వందనం.

-నాలోని ప్రతిభను గుర్తించి, నన్ను ప్రోత్సహించిన నా ప్రియమైన గురువుగారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-మీరు మాకు కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు, స్ఫూర్తి ప్రదాతలు. హ్యాపీ టీచర్స్ డే.

-మీ సహనానికి, మీ ప్రేమకు, మీ మార్గదర్శకత్వానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-అక్షరాలు దిద్దించిన చేయి మొదలుకొని, మా తలరాతను మార్చే శక్తి వరకు మీరే మా సర్వస్వం. హ్యాపీ టీచర్స్ డే.

-భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని నూరిపోసి, మమ్మల్ని విజేతలుగా నిలబెట్టిన మీకు వందనాలు. హ్యాపీ టీచర్స్ డే.

-తరగతి గది నాలుగు గోడల మధ్య మా ప్రపంచాన్ని విస్తరింపజేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. హ్యాపీ టీచర్స్ డే.

-మా ప్రశ్నలకు ఓపికగా సమాధానమిచ్చి, మా సందేహాలను నివృత్తి చేసిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు మీరు నేర్పిన పాఠాలే కారణం. థాంక్యూ టీచర్.

happy teachers day 2025 wishes messages quotes whatsapp status in telugu

-ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. ఆ శిల్పులే ఉపాధ్యాయులు.

-గొప్ప ఉపాధ్యాయుడు సమాధానాలు చెప్పరు, సమాధానాలు వెతికే ఆసక్తిని రేకెత్తిస్తారు.

-విద్య అనేది జీవితానికి తయారీ కాదు, విద్యే జీవితం. ఆ జీవితాన్ని నేర్పేవాడే గురువు.

-తల్లిదండ్రులు మనకు మూలాన్ని చూపిస్తే, గురువు ఆకాశాన్ని ఎలా అందుకోవాలో నేర్పుతారు.

-ఉపాధ్యాయుడి ప్రభావం శాశ్వతమైనది. అది ఎక్కడ ఆగిపోతుందో ఎవరూ చెప్పలేరు.

-పుస్తకాలు జ్ఞానాన్ని అందిస్తాయి, కానీ ఒక మంచి గురువు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పుతాడు.

-బోధించడం అనేది ఒక వృత్తి కాదు, అదొక అద్భుతమైన కళ.

-ప్రపంచంలో అత్యుత్తమ ఉపాధ్యాయులు పుస్తకాల నుండి కాదు, హృదయం నుండి బోధిస్తారు.

-ఒక కొవ్వొత్తి మరో కొవ్వొత్తిని వెలిగించినట్లు, ఒక గురువు విద్యార్థి జీవితంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు.

-ఉపాధ్యాయుడు ఒక దిక్సూచి లాంటివాడు. విద్యార్థులలో ఆసక్తిని, సృజనాత్మకతను ప్రేరేపిస్తాడు.

-ప్రశ్నలు అడగమని ప్రోత్సహించేవాడే నిజమైన గురువు.

-సరైన గురువు దొరికితే, సాధారణ విద్యార్థి కూడా అసాధారణ విజయాలు సాధించగలడు.

-ఒక ఉపాధ్యాయుడిని గౌరవించడం అంటే, జ్ఞానాన్ని గౌరవించడమే.

-తరగతి గదిని దాటి, జీవితమనే పాఠశాలలో ఎలా గెలవాలో నేర్పే వారే గురువులు.

-సమాజానికి వెన్నెముక ఉపాధ్యాయులే.

happy teachers day 2025 wishes messages quotes whatsapp status in telugu

-నా జీవితమనే పుస్తకానికి అద్భుతమైన మార్గాన్ని చూపిన నా గురువులకు వందనం. హ్యాపీ టీచర్స్ డే 2025

-నిజమైన హీరోలు కనిపించరు, వాళ్ళు తరగతి గదుల్లో పాఠాలు చెబుతారు. థాంక్యూ టీచర్.

-జ్ఞానాన్ని పంచే ప్రతి ఒక్కరూ గురువే. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-మాకు రెక్కలిచ్చి ఎగరడం నేర్పిన మీకు థాంక్స్. పీ టీచర్స్ డే.

-నా బెస్ట్ టీచర్‌ కి.. హ్యాపీ టీచర్స్ డే. మీరు లేకపోతే నేను లేను. మై టీచర్ మై హీరో.

-అక్షరాలను దిద్దించి, ఆశయాలను నిర్దేశించిన మా గురువులకు పాదాభివందనం.

-నాలోని ప్రతిభను నమ్మినందుకు థాంక్యూ, టీచర్.

-ఈ రోజు నా విజయం వెనుక మీ ప్రోత్సాహం ఉంది. హ్యాపీ టీచర్స్ డే!

-గురువు అంటే గూగుల్ కన్నా గొప్పవాడు. ఎందుకంటే ఆయన జ్ఞానంతో పాటు ప్రేమను కూడా పంచుతాడు.

-డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు.

-పాఠశాల రోజులు గుర్తొచ్చాయి.. మా ప్రియమైన టీచర్ గుర్తొచ్చారు. హ్యాపీ టీచర్స్ డే.

-మీరే మాకు స్ఫూర్తి.. మీరే మాకు గైడ్. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్.

Desktop Bottom Promotion