అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!

భారత మాజీ రాష్ట్రపతి, అత్యుత్తమ ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ప్రతి ఏటా సెప్టెంబర్ 5ని టీచర్స్ డేగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్..తన పుట్టినరోజును వ్యక్తిగతంగా జరుపుకోవడానికి బదులుగా, ఉపాధ్యాయులందరినీ గౌరవించే రోజుగా జరపాలని సూచించారు. అప్పటి నుండి ఈ రోజును టీచర్స్ డే గా పాటిస్తున్నాము.

మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అని మన సంస్కృతి చెబుతోంది. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకతను నేర్పేది గురువు. అజ్ఞానం అనే చీకటిని తొలగించి, జ్ఞానం అనే వెలుగును నింపే వారు ఉపాధ్యాయులు. ఒక దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది. అలాంటి గొప్ప బాధ్యతను మోస్తున్న గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజే ఈ ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్స్ డే సందర్భంగా మీ లైఫ్ లోని గురువులకు విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

Happy Teachers Day 2026 Best Wishes Quotes and WhatsApp Status in Telugu to Share With Your Gurus

టీచర్స్ డే విషెస్ ఇలా చెప్పండి

-అక్షరాలు నేర్పి నా జీవితానికి పునాది వేసిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-నన్ను నేను నమ్మేలా చేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ టీచర్స్ డే.

-మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ టీచర్స్ డే

-మీరు నా ఉపాధ్యాయులు కావడం నా అదృష్టం. శుభాకాంక్షలు.

-కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదు, జీవిత పాఠాలు నేర్పిన మీకు కృతజ్ఞతలు. హ్యాపీ టీచర్స్ డే.

-తప్పు చేసినప్పుడు దండించి, ఒప్పు చేసినప్పుడు అభినందించిన మీకు పాదాభివందనాలు. హ్యాపీ టీచర్స్ డే.

-నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు.

-చీకటిలో ఉన్న నాకు జ్ఞాన జ్యోతిని అందించిన మీకు శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే.

టీచర్స్ డే వాట్సాప్ స్టేటస్

-గురుదేవోభవ. హ్యాపీ టీచర్స్ డే.

-నా జీవితానికి మార్గనిర్దేశం చేసిన నా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు. హ్యాపీ టీచర్స్ డే.

-నా గెలుపు వెనుక ఉన్న అసలైన శక్తి నా గురువు. థాంక్యూ టీచర్స్.

-అజ్ఞానపు చీకట్లను పారద్రోలే సూర్యుడు గురువు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా ఉపాధ్యాయులే. హ్యాపీ టీచర్స్ డే.

-తరగతి గదిలో మీరు చెప్పిన పాఠాలే, నేడు నా జీవితానికి పునాదులు. హ్యాపీ టీచర్స్ డే.

-వజ్రాన్ని సానపెట్టేవాడు శిల్పి, విద్యార్థిని ప్రయోజకుడిని చేసేవాడు గురువు. హ్యాపీ టీచర్స్ డే.

-నాలోని తప్పులను సరిదిద్ది, నన్ను సరైన మార్గంలో నడిపించిన గురువులకు పాదాభివందనాలు.

-ఎప్పటికీ మర్చిపోలేనిది బడి, ఎప్పటికీ వదిలిపెట్టలేనిది గురువుల స్ఫూర్తి. హ్యాపీ టీచర్స్ డే.

-ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉంటాడు. నా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.

Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..

స్ఫూర్తిదాయకమైన టీచర్స్ డే కోట్స్

-మీరు కేవలం ఉపాధ్యాయులు కాదు, నా రోల్ మోడల్. శుభాకాంక్షలు.

-మీ మాటలు నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి. హ్యాపీ టీచర్స్ డే.

-కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-మిమ్మల్ని చూసిన ప్రతిసారీ కొత్త ఉత్సాహం వస్తుంది. హ్యాపీ టీచర్స్ డే.

-నాలో దాగున్న నైపుణ్యాన్ని వెలికితీసిన మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

-ప్రతి విద్యార్థికి మీలాంటి ఉపాధ్యాయులు ఉంటే దేశం ఎంతో ముందుంటుంది. హ్యాపీ టీచర్స్ డే.

-నాలోని ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపిన మీకు హ్యాపీ టీచర్స్ డే.

Story first published: Friday, September 4, 2026, 20:15 [IST]
Desktop Bottom Promotion