Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Tholi Ekadasi 2025 Wishes: ఓం నమో నారాయణాయ..మీ ఫ్రెండ్స్, బంధువులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇలా చెప్పండి
తొలి ఏకాదశి.. హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథి. దీనిని శయన ఏకాదశి, దేవశయని ఏకాదశి, హరి వాసరం, పేలాల పండుగ అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఇది మొదటిది, అందుకే దీనికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏడాది తొలి ఏకాదశి పండుగ ఆదివారం జులై 6,2025 జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్ముతారు. ఈ యోగ నిద్ర నాలుగు నెలల పాటు ఉంటుంది, దీనిని చాతుర్మాసం అని అంటారు. ఈ సమయంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాలు నిర్వహించరు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి తిరిగి మేల్కొంటాడు.
తొలి ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి సమయమని భావించే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇప్పటిదాకా ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తొలి ఏకాదశి నుంచి దక్షణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఈ తొలి ఏకాదశి నుంచే హిందూ పండుగలు మొదలవుతాయని చాలా మంది విశ్వసిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి, కోరిన కోరికలు తీరి, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలూ కలిగాయని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపలగితే కొన్ని అద్భుతమైన సందేశాలను, వాట్సాప్ కోట్స్ ఇక్కడ చూడండి.

తొలి ఏకాదశి విషెస్ ఇలా అందంగా చెప్పండి
-శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ జీవితం సుఖశాంతులతో నిండాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-తొలి ఏకాదశి పర్వదినం మీ జీవితంలో కొత్త కాంతులను నింపాలని ఆశిస్తున్నాను. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-ఈ పవిత్రమైన రోజున శ్రీహరి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-పాపాలు తొలగి, పుణ్యం వృద్ధి చెందే పవిత్ర దినం తొలి ఏకాదశి. ఈ రోజు మీకు శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను.
-సమస్త శుభాలను కలిగించే తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం..అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః..తొలి ఏకాదశి శుభాకాంక్షలు
-విష్ణువు అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరాలని ప్రార్థిస్తూ, తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-హరినామ స్మరణతో పునీతమయ్యే ఈ రోజు మీ జీవితంలో ఆనందాన్ని నింపాలని ఆశిస్తున్నాను.
-తొలి ఏకాదశి పర్వదినం మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-ఈ ఏకాదశి మీ ఇంట సిరిసంపదలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.
-తొలి ఏకాదశి శుభవేళ అందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుందాం.
-ఓం నమో నారాయణాయ.. తొలి ఏకాదశి శుభ దినాన మీకందరికీ శుభాకాంక్షలు.
-ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి,తన్నోవిష్ణుః ప్రచోదయాత్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు
-విష్ణువును ధ్యానించి, పుణ్యాన్ని సంపాదించుకునే తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-ఈ తొలి ఏకాదశి రోజున శ్రీహరి ఆశీస్సులు మీకు లభించాలని ఆకాంక్షిస్తున్నాను.
-మీ తప్పులను మన్నించి శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-దేవశయని ఏకాదశి మీ జీవితంలో ఆనందాన్ని, ఆధ్యాత్మిక చింతనను నింపాలని కోరుకుంటున్నాను.
-తొలి ఏకాదశి వ్రతం ఆచరించి, పుణ్యఫలాలు పొందండి. మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఇదే సరైన సమయం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

-ఈ ఏకాదశి మీ జీవితానికి కొత్త దిశానిర్దేశం చేయాలని కోరుకుంటున్నాను.
-పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీ మనసులో శాంతి, సంతోషం వెల్లివిరియాలి.
-తొలి ఏకాదశి పవిత్రత మీ ఇంట నిండాలని, మీ మనసు ఆధ్యాత్మిక ఆనందంతో వెలగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
-తొలి ఏకాదశి కేవలం ఒక పండుగ కాదు, అది మనల్ని మనం పరిశీలించుకునే అవకాశం.
-శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం..విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం..లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం..వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications