Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి
హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. అందులోనూ ఏటా ఆషాఢ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 25, శనివారం నాడు ఈ పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం వచ్చింది. హిందువుల పండుగలకు ఇది ఆరంభం లాంటిది.

శయన ఏకాదశి విశిష్టత
తొలి ఏకాదశిని శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినం నాడే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళతారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా యోగనిద్రకు ఉపక్రమించిన స్వామివారు, సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. అంతేకాదు తొలి ఏకాదశి ప్రకృతిలో వచ్చే మార్పులకు సంకేతం. ఈ రోజు నుంచి భూమిపై పగటి సమయం తగ్గిపోయి, రాత్రి సమయం పెరుగుతుంది. తొలి ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.
తొలి ఏకాదశి విషెస్ ఇలా చెప్పండి
-మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు 2026.
-శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-ఈ తొలి ఏకాదశి మీ జీవితంలో ఆనందాన్ని, సిరిసంపదలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
-ఓం నమో భగవతే వాసుదేవాయ..మీకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
-తొలి ఏకాదశి పర్వదినాన ఆ శ్రీహరి కరుణాకటాక్షాలు మీకు కలగాలని ప్రార్థిస్తున్నాను.
-సకల శుభాలకు నాంది ఈ తొలి ఏకాదశి. మీకు, మీ కుటుంబానికి శుభాకాంక్షలు.
-చాతుర్మాస్య వ్రత ప్రారంభ దినమైన తొలి ఏకాదశి మీ జీవితంలో సర్వ శుభాలను చేకూర్చాలి.
-ఆ పద్మనాభుని దయతో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. హ్యాపీ తొలి ఏకాదశి.
-శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ఈ పవిత్ర దినాన మీ కోరికలన్నీ నెరవేరాలి.
-పాపాలను హరించే ఈ పవిత్ర ఏకాదశి, మీ జీవితంలో పుణ్యఫలాలను అందించాలి. శుభాకాంక్షలు.
-పేలాల పిండి ప్రసాదంతో మొదలయ్యే ఈ పండుగ మీ బతుకులో తీపిని నింపాలి.
-వైకుంఠవాసుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ... తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-సర్వ పాపాలను తొలగించే తొలి ఏకాదశి నాడు ఆ దేవుడి దయ మీపై పరిపూర్ణంగా ఉండాలి.
-శయన ఏకాదశి శుభ సందర్భంగా మీకందరికీ భగవంతుని కృప ఎల్లవేళలా రక్షగా ఉండాలి.

తొలి ఏకాదశి వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్ లు
-కష్టాలను కడతేర్చేవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు ఆ వైకుంఠనాథుడు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2026.
-దేవుని దయ, పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ మనతో ఉండాలి. హ్యాపీ తొలి ఏకాదశి.
-సృష్టి కారకుడు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం. సర్వేజనా సుఖినోభవంతు.
-ఉపవాసం, భక్తి, ముక్తి... ఇవే ఏకాదశి విశిష్టతలు. మిత్రులందరికీ శుభాకాంక్షలు.
-ఆ విష్ణుమూర్తి కృపతో ప్రతి ఇంటా ఆనందాల పండుగ వాతావరణం నెలకొనాలి.
-ఆ పద్మనాభుని కరుణ మనందరిపై ఉండాలి. ఏకాదశి వ్రతం ఆచరించే అందరికీ శుభం కలుగుగాక.
-ఏకాదశి ఉపవాసం పాపాలను దహించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. హ్యాపీ తొలి ఏకాదశి.
-పండుగల రాకను తెలిపే పవిత్ర దినం తొలి ఏకాదశి. మీకందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
-ఆ వైకుంఠనాథుని స్మరణే ఒక వరం. ఈ తొలి ఏకాదశి నాడు ఆ స్వామి కృప మనందరిపై ఉండుగాక.
-ధర్మం, భక్తి, విశ్వాసాలకు ప్రతీక తొలి ఏకాదశి. జై శ్రీహరి.
శ్లోకాలతో తొలి ఏకాదశి విషెస్ చెప్పండిలా
-శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం
సమస్త లోకాలకు నాథుడైన శ్రీ మహావిష్ణువు కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 తొలి ఏకాదశి శుభాకాంక్షలు
-ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్
శ్రీ లక్ష్మీనారాయణుల దీవెనలతో మీరు, మీ కుటుంబం ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలి. మీకు అంతా మంచే జరగాలి. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-యజ్జ్యానినాద శ్రవణాత్సురాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్య:
భవంతి దైత్యాశని బాణవర్షి శార్ఞం సదాహం శరణం ప్రపద్యే
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడి చేయిపట్టి నడిపించినట్టు.. ఆ మహావిష్ణువు మీకు ఎప్పుడూ తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః
మిమ్మల్ని చుట్టుముట్టిన ప్రతికూల శక్తులన్నీ మాయమైపోయి, మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలి. హృదయపూర్వక తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
-స్ఫురత్ సహస్రార శిఖా తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో: చక్రం సదాహం శరణం ప్రపద్యే
ఈ ఏకాదశి మీ జీవితంలో సంతోషాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపాలని ప్రార్థిస్తూ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications