Latest Updates
-
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా!
హ్యాపీ వసంత పంచమి..అజ్ఞాన చీకట్లు తొలగిస్తూ.. జ్ఞాన వెలుగులు నింపేలా మీ ఫ్రెండ్స్‌కు విష్ చేయండిలా
హిందువులకు ముఖ్యమైన పండుగల్లో వసంత పంచమి ఒకటి. దీనిని శ్రీ పంచమి లేదా సరస్వతీ పూజ లేదా మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా చదువుల తల్లి సరస్వతీ దేవికి అంకితం చేయబడిన పండుగ. వసంత పంచమి అంటే జ్ఞానాన్ని ఆరాధించే రోజు, ప్రకృతిని ప్రేమించే రోజు, కొత్త పనులకు శ్రీకారం చుట్టే శుభ దినం.
తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం శుక్ల పక్ష పంచమి తిథినాడు వసంత పంచమి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత అంతా నిశ్శబ్దంగా ఉందని గమనించాడు. అప్పుడు తన కమండలం నుండి నీటిని చల్లి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె తన వీణను మీటడం ద్వారా ఈ విశ్వానికి శబ్దాన్ని, మాటను, జ్ఞానాన్ని ప్రసాదించింది. అందుకే ఆమె పుట్టినరోజైన ఈ రోజున సరస్వతీ పూజ చేస్తారు.

ఈ రోజు నుండే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. చిన్న పిల్లలకు చదువు మొదలుపెట్టడానికి (అక్షరాభ్యాసం చేయడానికి) సంవత్సరంలో కెల్లా ఇది అత్యంత శ్రేష్టమైన రోజు. బాసర వంటి సరస్వతీ క్షేత్రాలు ఈ రోజున కిటకిటలాడుతుంటాయి. 2026 సంవత్సరంలో వసంత పంచమి జనవరి 23న శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు ఆకట్టుకునే విషెస్ ఎలా పంపాలో ఇక్కడ చూడండి.
ఇలా విషెస్ చెప్పండి
-మీకు, మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి, సరస్వతీ పూజ శుభాకాంక్షలు.
-జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీ దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..వసంత పంచమి శుభాకాంక్షలు.
-వసంత ఋతువు ఆగమనానికి స్వాగతం పలుకుతూ.. మీకు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వసంత పంచమి.
-అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపే పండుగ వసంత పంచమి. మీకు శుభాకాంక్షలు.
-వీణా పాణి మీ జీవితంలో సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని నింపాలి. శ్రీ పంచమి శుభాకాంక్షలు.
-చదువుల తల్లి కరుణా కటాక్షాలు మీ పిల్లలపై ఎప్పుడూ ఉండాలి. సరస్వతీ పూజ శుభాకాంక్షలు.

-ఈ వసంత పంచమి మీ జీవితంలో కొత్త ఆశలను, విజయాలను చిగురింపజేయాలి. హ్యాపీ వసంత పంచమి.
-విద్య, కళ, జ్ఞానానికి అధిదేవత అయిన శారదా మాత ఆశీస్సులు మీకు లభించుగాక. హ్యాపీ వసంత పంచమి.
-బుద్ధిని, సిద్ధిని ప్రసాదించే వాగ్దేవి అనుగ్రహం మీపై ఉండాలి. హ్యాపీ వసంత పంచమి.
-మీ జీవితంలో విద్య, విజ్ఞానం, వినయం వెల్లివిరియాలని కోరుకుంటూ.. శ్రీ పంచమి శుభాకాంక్షలు.
-సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి.. విద్యారంభం కరిష్యామి.. సిద్ధిర్భవతు మే సదా. వసంత పంచమి శుభాకాంక్షలు.
-కలం పట్టిన ప్రతి చేతికి జయం కలగాలి.. పుస్తకం పట్టిన ప్రతి మెదడు విజ్ఞానంతో నిండాలి. వసంత పంచమి శుభాకాంక్షలు.
-విద్య లేని వాడు వింత పశువు. జ్ఞానాన్ని ఆరాధిద్దాం, సరస్వతిని పూజిద్దాం. హ్యాపీ వసంత పంచమి
-వినయం లేని విద్య వృథా.. విద్యతో పాటు వినయాన్ని నేర్పే చదువుల తల్లికి నమస్కారం.
-అక్షరాభ్యాసం చేసుకుంటున్న చిన్నారులకు విద్యాబుద్ధులు అబ్బాలి. వసంత పంచమి శుభాకాంక్షలు.
-జ్ఞానం అనేది ఎవరూ దొంగిలించలేని ఆస్తి. ఆ ఆస్తిని మనకు ప్రసాదించే రోజు ఈ వసంత పంచమి.
నేటి చదువే.. రేపటి మన గెలుపు. హ్యాపీ శ్రీ పంచమి.



Click it and Unblock the Notifications