Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
హార్దిక్ నటాశా మధ్య విడాకులకు కారణమేంటి..? ఈ పుకారు నిజమనుకోవచ్చా..?
సరిగ్గా వారం రోజుల క్రితం అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక మొత్తం సాంప్రదాయ బద్దంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రాజకీయ నాయకులుడ,బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా హాజరయ్యారు. అయితే క్రికెటర్లలో హార్ధిక్ పాండ్యా కూడా ఈ వేడుకకు హజరయ్యాడు. కానీ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో హార్దిక్ పాండ్యాను బ్రేకెన్ హార్ట్‌ఎటాక్‌గా వర్ణించారు. అంటే దుఖం ఎంత వున్నా సరే సంతోషంగా ఉంటూ బాధను దిగమింగుకువచ్చాడని కామెంట్లు చేశారు. వారం తరువాత హార్దిక పాండ్యా, నటాశా కలిసి ఇన్స్‌టాగ్రాంలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం మొత్తం మీడియాను, క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.

నాలుగేళ్ల తర్వాత ఇద్దరం కలిసి ఉండేందుకు చాలా ప్రయత్నించాము కానీ అది సాధ్యపడలేదు చివరకు విడిపోవాలని నిర్ణయించుకొని ఈ విడాకులు తీసుకుంటుంన్నామని ప్రకటించారు. ఇద్దరి జీవితంలో ఆత్మాభిమానం, భవిష్యత్తు దెబ్బతినకుండా వుండడానికి ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటన చేశారు. మా ఇద్దరి అనుబంధానికి గుర్తుగా అగస్త్య పుట్టాడు. అతని భవిష్యత్తును బాగా చూసుకుంటాం, ఈ కష్టకాలంలో మాకు మీ సపోర్ట్ కావాలి అంటూ ఇద్దరూ ఒకేసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో హార్దిక్ నటాషా పోస్టులు చూసి త్వరలోనే వీరిద్దరూ విడిపోతారేమోనని మీడియాతో పాటు నెటిజెన్లు కూడా భావించారు. హార్ధిక పాండ్యా క్రికెట్ మ్యాచులను ఇరగదీస్తూ వుంటే, నటాశా తలుక్కుమని కనిపించి హార్ధిక పాండ్యాను ప్రోత్సహించేది. కానీ గత కొన్ని రోజులగా అవేవీ కనిపించడం కూడా అనుమానాలకు దారితీసింది.
గత కొద్ది రోజులుగా భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం కూడా ఆపేసింది. మార్చ్ 4వ తేదీని హార్దిక్ పాండ్య తన భార్య పుట్టిన రోజు హడావుడి చేసేవాడు, కానీ ఈ 2024వ సంవత్సరంలో అదేదీ లేకపోవడం కూడా అనుమానాలకు బలం చేకూరింది.
సోషల్ మీడియాలో నటాశా తన పేరు చివర పాండ్యా అని తగిలించుకుంది కానీ మే నెలలో నటాశా తన పేరు చివర పాండ్యను తీసివేసింది. నటాశాస్టాంకోవిచ్ అంటూ తన ఇంటిపేరునే ఆమె మళ్లీ తగిలించుకుంది. ఇది చూసిన నెటిజెన్లు వీరిద్దరూ విడిపోవడం ఖాయమని తేల్చేశారు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లికి కూడా పాండ్యా ఒక్కడే హాజరయ్యాడు కానీ భార్య నటాశాను వెంట తీసుకెళ్లలేకపోయాడు. ఇద్దరం విడిపోతున్నాం అని ఇద్దరూ ఒకేసారి జులై 18న ప్రకటించారు. కానీ కొడుకు అగస్త్యను కలిసి చూసుకుంటామని ప్రకటన చేశారు. అసలు వీరిద్దరి విడాకులకు కారణమేంటనేది అంతుచిక్కకుండా పోతుంది.
అసలు నటాశా భారత్‌కు ఎలా వచ్చింది. హర్థిక పాండ్యాను ఎలా పెళ్లి చేసుకుందనే వివారలను తెలుసుకుందాం. నటాశా స్టాంకోవిచ్‌ది సెర్బీయా. 1992 మార్చ్ 4న జన్మిచింది. చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ రంగమంటే ఆసక్తి. తల్లిదండ్రులు కూడా ఆమెను ప్రోత్సహించారు. 2012లో భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ యాడ్‌లో అవకాశం కొట్టింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 2లో కూడా ఆమె పాల్గొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయ్.
బాలీవుడ్ లో ఒక పక్క ఆఫర్లు వస్తూనే సడెన్‌గా హార్దిక్ పాండ్యాతో వివాహం కావడంతో నటాశా ఒక్కసారిగా పాపులర్ అయింది. మే 2020లో ఇద్దరి పెళ్లి జరిగింది. జులై 2020లో వీరికి అగస్త్య అనే బాబు పుట్టాడు. పెళ్లికి ముందే నటాశా గర్భవతి అని చెప్పుకోవచ్చు. 2023లో రాజస్థాన్‌లో ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన ఏడాదిలోనే ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. పెళ్లై నాలుగేళ్లు కాకముందే ఇద్దరూ విడాకులు తీసుకునేదాకా వచ్చింది. హార్థిక పాండ్యా ఆస్థికోసమే నటాశా పెళ్లి చేసుకుందని పుకార్లు వ్యాపిస్తున్నాయ్. అయితే ఇద్దరి మధ్య విడాకులకు కారణమేంటో ఇంకా తెలియదు.



Click it and Unblock the Notifications
