Latest Updates
-
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్!
మనదేశంలో ప్రభుత్వ స్కూల్ పరిస్థితి అనగానే ఎక్కడో కొన్ని బాగుంటాయి తప్ప మిగతా అన్నీ చోట్ల అరకొరా వసతులే ఉంటాయి. వాష్ రూమ్ లు కట్టి ఉంటాయి, కానీ వాడటానికి వీల్లేకుండా తాళం వేసి ఉంటది, స్కూల్ పైకప్పు ఎప్పుడు కూలుతుందా అన్నట్లు ఉంటుంది, ఏ సైడ్ నుంచి ఎప్పుడు ఏ పాములు, తేళ్లు వస్తాయో తెలియదు..ఇలా వందల సమస్యలతో మన దేశంలోని అనేక స్కూల్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నెంట్ స్కూల్స్ మిగతా రాష్ట్రాలతో పోల్చితే కొంచెం బెటర్.
ఇదిలా ఉంటే తాజాగా ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ తన సొంత డబ్బుతో స్కూల్ లో వసతులను మెరుగుపర్చే పని చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అయితే ఈ పని చేసినందుకు అభినందించాల్సిన ఉన్నతాధికారులు, ప్రభుత్వం..అతడిని వేధిస్తుంది. ఇవన్నీ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరిచ్చారు అంటూ అతడికి ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ వచ్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నాం జిల్లాలోని రూప్ నగర్ గ్రామంలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బద్రిలాల్ రాథోడ్..తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి స్కూల్ లో స్మార్ట్ బోర్డులు, ఫర్నిచర్, వాటర్ కూలర్, కొత్త ఫ్లోరింగ్ చేయించడం, కొత్తగా పెయింటింగ్ వేయించడం, విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు అందించారు. విద్యార్థులకు అభ్యాసాన్ని మరింత అందుబాటులోకి, ఆకర్షణీయంగా మార్చే లక్ష్యంతో బద్రిలాల్ రాథోడ్ ఈ పని చేశారు.
అంతేకాకుండా స్కూల్ లో టీచర్ల కొరత ఉండటంతో తాల్కాలిక ఉపాధ్యాయులను ఏర్పాటు చేసుకుని, ఆయన సొంతడబ్బులను జీతాలుగా ఇచ్చారు. స్కూల్ లో స్వచ్చందంగా సేవలు అందిస్తున్న ఒక ఉపాధ్యాయుడు, మరో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులను పిల్లలకు బోదించడానికి ఎందుకు అనుమతించారనేదానిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో ఉంది.

అయితే విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు..స్కూల్ లో నిర్మాణ పనులకు, మిగతావి ఏర్పాటు చేయడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ బద్రిలాల్ రాథోడ్ కి షోకాజు నోటీసు పంపించారు. అంతేకాకుండా ఈ ఏడాది జూన్ 30న అతడిని పిప్లోడా ఏరియాలోని సెమ్లియా గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లింద్రుడు కూడా చాలా బాధపడ్డారు.
బద్రిలాల్ సార్ ని తిరిగి తమ గ్రామానికి పంపాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన కూడా చేపట్టారు. లేదంటే తమ పిల్లల టీసీలు తమకు ఇచ్చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్ధులకు మీరు ఎలాగో సౌకర్యాలు అందించడం లేదు, అలా చేస్తున్న వారికిపై ఈ చర్యలేంటీ అంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులపై స్థానికులు,నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
