Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అదే పనిగా రీల్స్ చూస్తూ కుంచుంటున్నారా గురూ! మీ పని ఇక అంతేపో
ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విపరీతంగా వినియోగించేస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గంటల తరబడి ఫోన్లలో మునిగిపోతున్నారు. అయితే అలా తరచుగా తదేకంగా రీల్స్ చూడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఓ కథనంలో వెల్లడైంది. ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో వివరించాము తెలుసుకోండి.
ఆరోగ్యంపై దుష్ప్రభావాలు
BMC జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం, రాత్రి సమయాల్లో ఎక్కువ రీల్స్ చూసే వారిలో అధిక రక్తపోటు సమస్యలు పెరిగే అవకాశం ఉందని తేలింది. రీల్స్ చూసినప్పుడు మనసుకు తాత్కాలిక ఉత్తేజాన్ని కలిగించినప్పటికీ, దీని ప్రభావం ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. చైనా, హెబీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో, రాత్రి రీల్స్ చూసే యువత, మధ్య వయసున్నవారిలో అధిక రక్తపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

2023 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో నిర్వహించిన ఈ పరిశోధనలో 4,318 మంది యువత, మధ్య వయసు వారు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వైద్య పరీక్షల ఫలితాలు, ఎక్కువ రీల్స్ చూసే వారి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో చెప్తున్నాయి. రాత్రిపూట ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల నిద్రపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్, మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి, నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. దీని వలన నిద్రపోవడం కష్టంగా మారుతుంది.
ఎలా జాగ్రత్తపడాలి?
స్క్రీన్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నించండి.
స్క్రీన్ చూస్తున్నప్పుడు బ్లూ లైట్ ఫిల్టర్లు ఉపయోగించండి.
నిద్రకు ముందు పుస్తకాలు చదవడం లేదా ధ్యానం చేయడం వంటి ఇతర కార్యకలాపాలను అంగీకరించండి.
నిద్రించే ముందు మీ పడక గదిని చల్లగా, నిశ్శబ్దంగా, చీకటిగా ఉంచండి.
ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా, స్క్రీన్ సమయం వల్ల కలిగే నష్టం తగ్గించి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.



Click it and Unblock the Notifications