Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా.. అయితే మీకు ఈ రోగం ఉన్నట్లే.. దానికోసం ఏం చేయాలంటే?
ప్రస్తుత కాలంలో చాలా మందికి షూస్ వేసుకోవడం ఒక అలవాటుగా మారింది. రోజు వారీగా లేదా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు షూస్ వేసుకోవడం సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే చాలా మంది యువత సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారు. దీని కారణంగా ఆరోగ్యానికి చాలా ప్రమాదాలు తలెత్తే అవకాశముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి పరిష్కారమేంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటే ఏమవుతుందంటే..?
శరీరంలో ఎక్కువగా చెమటలు పట్టే భాగాల్లో పాదాలు కూడా ఒకటి. కొంచెం ఎండలో వెళ్లినా, కొంచెం దూరం నడిచినా వెంటనే పాదాలకు చెమటలు పట్టేస్తుంటాయి. మరీ ముఖ్యంగా షూస్ వేసుకున్నప్పుడు చెమట సాధారణం దానికంటే కొంచెం అధికంగా పడుతుంది. అయితే సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల.. ఆ చెమట పాదాలపైనే ఉండిపోయి దుర్వాసనకు కారణమవుతాయి. అలాగే వివిధ రోగాల బారిన పడేందుకు మూలంగా మారుతాయి.

సాక్స్ వేసుకోవడం వల్ల ఆ చెమటను పీల్చేసుకుంటాయి. పాదాలను సురక్షితంగా హానికారకమైన క్రీముల నుంచి రక్షిస్తాయి. అలాగే పాదాలలో చెమటను నివారిస్తాయి. సాక్స్ వేసుకోవడం వల్ల పాదాలకు హానికరమైన ఫంగల్ లేదా బ్యాక్టీరియాలు నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ప్రస్తుత చలికాలంలో సాక్సులు వేసుకోవడం వల్ల పాదాలకు వెచ్చదనం తలిగి పాదాలు పొడిబారకుండా, సజీవంగా కాంతి వంతగా కనిపిస్తాయి. అదే వేసవికాలంలో పాదాలను ఎండ వేడి నుంచి, చెమటల నుంచి రక్షిస్తాయి.
ఒకవేళ సాక్సులు ధరించకపోతే ఈ సమస్యలన్నీ ఒకేచోట చేరి పాదాలను ప్రమాదం బారిన పడేలా చేసే అవకాశముంది. అందుకే షూస్ వేసుకునేటప్పుడు సాక్స్ వేసుకోవడం అనేది ఉత్తమమైన చర్య. చాలా మందికి కొంచెం సున్నితమైన చర్మం ఉంటుంది. దీని కారణంగా సాక్సులు లేకుండా షూస్ లేదా బూట్స్ వేసుకుంటే అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. లేదా బూట్స్ వల్ల చర్మం కూడా కట్ అయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాక్స్ లేకుండా బూట్స్ లేదా షూస్ ధరించడం మంచిది కాదు.
పాదాలపై బొబ్బలు
సాధారణంగా కొంతమంది కొంచెం దూరం నడిస్తే పాదాలపై బొబ్బలు వస్తుంటాయి. అయితే కొందరికి సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశముంది. అలా బొబ్బలు ఏర్పడడంతో పాటు సాక్స్ లేకపోవడం వల్ల చెమట ఆ బొబ్బల్లో చేరే మరింత ప్రమాదకరంగా మారనుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాక్స్ లేకుండా బూట్స్, షూస్ ధరించొచ్చని పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించేముందు లేదా విశ్వసించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications