Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
Modi Health Habits: బిజీ షెడ్యూల్, విపరీతమైన పని ఒత్తిడి.. అయినా అదే చురుకుదనం, మోదీకి ఇదేలా సాధ్యమంటే..
వరుస మీటింగ్‌లు, తీవ్రమైన పని ఒత్తిడి, ఒక దాని తర్వాత ఒకటి సమావేశాలు, ఎన్నికల వేళ వరుస ర్యాలీలు, సమావేశాలు, సభలు, ప్రసంగాలు, పార్టీ నేతలకు సలహాలు, సూచనలు, వ్యూహాలు ప్రతివ్యూహాలు ఇలా ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ తో, విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా ఉండటం, పార్టీకి పెద్దగా నేతలకు మార్గనిర్దేశనం చేయడం, ప్రతిపక్షాలకు దీటుగా, ధాటిగా వ్యూహాలు రచించడం, ఇరుపొరుగు దేశాలను నొప్పించకుండా చురకలు అంటించడం ఇలా ఎన్నో పనులతో నిత్యం బిజీగా ఉంటూనే చాలా చలాకీగా ఉంటారు మోదీ.
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి.. ఈ వయస్సులోనూ ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఇంత చురుకుగా ఉండటానికి ఆయన పాటించే ఆరోగ్యకరమైన అలవాట్లే ప్రధాన కారణం. ప్రధాని మోదీ పాటించే ఆ హెల్దీ హ్యాబిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా- దినచర్యలో ఓ భాగం:
ప్రధాని మోదీ రోజూ యోగా చేస్తారు. యోగా సాధన చేయడం వల్ల తాను పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రోజూ ఉదయం యోగా చేస్తారు ప్రధాని. 2020 మార్చిలో కొవిడ్ మహమ్మారి రోజుల్లో యోగా సాధన గురించి ప్రధాని ట్వీట్ చేశారు.
' నేను ఫిట్‌నెస్ నిపుణుడిని కాదు, వైద్య నిపుణుడిని కాదు. యోగా సాధన చాలా సంవత్సరాలుగా నా జీవితంలో భాగమైపోయింది. యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించాను' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
'నాకు సమయం దొరికినప్పుడల్లా వారానికి ఒకటి లేదా రెండు సార్లు యోగా నిద్ర సాధన చేస్తాను. ఇది మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మనస్సును రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది' అని మోదీ చెప్పారు.
ఆయుర్వేదం:
యోగా తర్వాత భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత కీలకమైనది ఆయుర్వేదమని పలు సందర్భాల్లో ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. భారతీయ పురాతన ఆయుర్వేద సూత్రాల ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అన్నారు. ఆయుర్వేద సూత్రాలను త్వరలోనే ప్రపంచం అంగీకరిసతుందని, ఆయుర్వేదాన్ని విదేశాలకు విస్తరించడంలో యువత ముందుండాలని మోదీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ జలుబు, దగ్గు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్యాలకు హోం రెమిడీస్ పాటిస్తారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. వేడి నీటిని తాగడం ద్వారా, ఉపవాసం పాటించడం ద్వారా జలుబును తగ్గించుకుంటానని మోదీ తెలిపారు. వంటింట్లో దొరికే చాలా మూలికల ద్వారా అనేక రోగాలు దరిచేరవని చెప్పారు.
వ్యాయామం:
తాను బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేస్తానని, ప్రకృతిలో 5 అంశాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల నుండి ప్రేరణ పొందిన ట్రాక్ లో రోజూ నడుస్తానని ప్రధాని మోదీ చెప్పారు. యోగాతో పాటు తాను ఇది కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. వీటి వల్ల తాజాదనంగా అనిపిస్తుందని తెలిపారు.
అల్పాహారం:
ప్రధాని మోదీ ఉదయం పూట సమతుల్యమైన పోషకాలతో కూడిన అల్పాహారం తీసుకుంటారు. సాధారణంగా పోహా, అల్లం టీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆయన పూర్తి శాఖాహారి కాబట్టి అల్పాహారంతో పాటు పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. సాంప్రదాయ దక్షిణ భారతీయ, గుజరాతీ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు ప్రధాని.



Click it and Unblock the Notifications